Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పదహారు ప్రాయం

[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘పదహారు ప్రాయం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

దహారు అంకెలోనే వుంది ఏదో అందం
ప్రాయానికి అక్కడ పడుతుంది కళ్ళెం
పరువాలు పరిమళించే వేదికది
ప్రణయాలు పలికించే నాదమది
వయసు విసిగించే వాదమది
మనసు వినిపించే వేదమది
ఎదహోరుకు వలపు జోరుకు
మధ్యన నలిగే బంధమది
మొత్తం జీవితంలో
వెచ్చని మధుర జ్ఞాపకమది

Exit mobile version