Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పగటి వేషగాడు

[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘పగటి వేషగాడు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

తనే
వేషం కుదిరింది
అందుకేనేమో భ్రుకుంసుడైంది

అతనే
రూపం అదిరింది
ఆంగికాభినయ అనుభవముంది

అతనే
పైత్యం ముదిరింది
నడకలో కొంత తేడా కనిపిస్తుంది

అతనే
లోకం నవ్వుకుంది
పై పూతలతో మలినదర్పణమైంది

అతనే
జనం గుర్తించింది
తాత్కాలిక నాటకమని తేల్చేసింది

అతనే
రంగు పూసుకుంది
చెమిక మెరుపుల్తో ఆనందపరిచింది

అతనే
పాత్రను పోషిస్తుంది
పొట్టకూటి కోసమే ఈ ఆటాడుతుంది

Exit mobile version