Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పల్లె

[వాణి వేమవరపు గారు రచించిన ‘పల్లె’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

పక్షుల కిలకిలరావాలతో
పల్లె మేల్కొంది,
కువ కువ లాడే పక్షులు,
కూకు రాగాలతో కోయిలలు,
సన్నటి సంగీతం
మదిని తాకినట్టుంది,
సూర్యకిరణాలు తాకి పల్లె
విరబూసిన మల్లెలలా తోచింది,
అరవిరిసిన పుష్ప సోయగం
ముస్తాబైన నవవధువు
మోములా అగుపడింది,
ఎగసిపడుతున్న వాగులు,
చింది పడుతున్న నీరు,
సుగంధ భరిత పన్నీరు జల్లే అయింది,
పిల్ల తెమ్మరకు ఊగుతున్న
పచ్చటి పైరు
కొసరి కొసరి తినిపిస్తానని పిలిచినట్లుంది,
పల్లె, ఆదమరచి తల్లి ఒడిలో
నిదురించే బిడ్డ వలె ప్రశాంతంగా ఉంది,
నిండుకుండ లాంటి పల్లె
భూమాత నుదిటిన బొట్టుగా నిలిచింది.

Exit mobile version