Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పరంపర

[19 మార్చ్ 2026 శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘పరంపర’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

గాది రాకతో..

తీరుమారిన
మస్తిష్కాలకు
క్రొత్తందనాలు
ప్రభవిస్తున్నవి

వసివాడిన
అడవులకు
పచ్చందనాలు
పల్లవిస్తున్నవి

మోడువారిన
మోదుగు చెట్లకు
ఎర్రందనాలు
ప్రసరిస్తున్నవి

మూగవోయిన
కోకిల స్వరాలకు
తియ్యందనాలు
శ్రుతి చేస్తున్నవి

Exit mobile version