Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పెద్దరికం

[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘పెద్దరికం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

దైనా
ఆయన పోయాక
కొంత కాలం
కాలానిది చులకనే

వెలితి ఛాయల మధ్య
ముఖాలు రాసుకుంటూ
మాటలు పుట్టినా
కళ్ళముందే కరిగిపోతాయి

ఏకాంత ప్రవాహంలో
కొట్టుకుపోతున్న పాత రోజులు
నెట్టుకొస్తున్న కొత్త రోజులకు మధ్య

ఏ పదం చప్పుడైనా
ఆ గొంతు పోలికే

ఏ వాక్యం నడిచినా
ఆ పాదం అలికిడే..

ఆయన లేని ఇంటిలో
నాలో కనిపించేది
ఆయన పెద్దరికమే

Exit mobile version