Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పిల్లాడిని కొట్టడం చాలా చెడ్డపని

[మాయా ఏంజిలో రచించిన ‘To beat the child was bad enough’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]

(ఈ కవితా నిర్మాణం కొంత క్లిష్టంగా తోస్తుంది. ఆకలి, అమాయకత్వం కలగలసిన పిల్లాడి దుర్బలత్వం, దయనీయ స్థితిని విషాదపు ముగింపుతో కళ్ళ ముందుంచుతుంది.)

~

లికాలపు సూర్యరశ్మి లాంటి కాంతితో
సరికొత్త విత్తనం రెండుగా చీలుతూ
వాగ్దానం చేసిన నవాంకురం వంటి
ఒక లేలేత చిన్ని దేహం,
ఎంచుకునే అవకాశమే లేని
భవిష్యత్తు ఆకాశం మీద
నిశ్శబ్దపు తీగ నుంచి నిర్దాక్షిణ్యంగా వేలాడదీయబడింది

ఆకలి, కొత్త చేతులు, విచిత్రమైన గొంతులు
ఏడుపు సహజం గానే వచ్చింది, కన్నీళ్ళతో

చవకబారు కుండలో
తెలిసీ తెలియని అమాయకత్వంతో
మరగబెట్టిన నీళ్ళతో
పిల్లవాడి ఉత్సుకత
భీభత్సంలోకి మారిపోయింది
చర్మం ఊడిపోయింది
శరీరపు మాంసం నివేదన అయిపోయింది

ఆకలి, శాంతి రెండింటి చేతుల్లో
ఆక్రందన పగిలిన గాలిలో కలిసి చెల్లాచెదురవుతుంది

ఒక యువ శరీరం నిశ్శబ్దంగా తేలుతుంది!!

~

మూలం: మాయా ఏంజిలో

అనువాదం: హిమజ


  1. మనలో ప్రతి ఒక్కరు కొందరికి రోల్ మోడల్సే. కానట్లయితే ఆదర్శంగా ఉండటానికయినా ప్రయత్నించాలి.
  2. రోజూ రాత్రి ప్రార్థన చేసేందుకు మోకాళ్ళ కింద వేసుకునే దిండుకి కూడా మనం కృతజ్ఞులమై ఉండాలి. చెడుని దాటుకొని పోవడానికి మంచికి స్వాగతం చెప్పడానికి మధ్యన మనం వారధి అవ్వాలి.
  3. నక్షత్రాలను చేరుకోవాలనుకోవడం ఓ ఆకాంక్ష. హృదయాలకు చేరువ అవ్వాలనుకోవడం తెలివైన పని.
  4. విజయానికి సమానమైనది ఏదీ లేదు. చిన్న విజయం సాధించి చూడండి. మరిన్ని చిన్న చిన్న విజయాలు మీ స్వంతమవుతాయి.
  5. నీతో నువ్వుండడం కొరకు. నీకంటూ సమయం కేటాయించుకో.
  6. ఏదైనా మన అవసరానికి మించే మనం కోరుకుంటాం.
  7. నవ్వుతున్నప్పుడు జీవితం మెరుగ్గా కనబడుతుంది.
  8. ఆమె తెరిచిన పుస్తకం. అతనో నిరక్షరాస్యుడు.
Exit mobile version