Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-38

[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]

పిల్లల ఎగ్జామ్ ప్రెజర్ డిసెంబర్ నుంచే మొదలవుతుంది – పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేయాలి?

డిసెంబర్ నెల అంటే.. బయట పండుగలు, ఇళ్లలో సంతోషాలు, సెలవుల కోసం చిన్న చిన్న ప్లాన్లు. కానీ బోర్డు ఎగ్జామ్స్ రాయబోయే పిల్లల ఇళ్లలో మాత్రం.. ఇంకో రకమైన వాతావరణం ఉంటుంది, ఒక నిశ్శబ్దం పారాడుతూ ఉంటుంది. ఆ నిశ్శబ్దం పేరే ఎగ్జామ్ ప్రెజర్. అది ఒక కనిపించే నీడలా ఆ ఇంట్లో కదలాడుతూ ఉంటుంది.

మీరు ఎప్పుడైనా గమనించారా?

బోర్డు ఎగ్జామ్స్ రాయబోయే పిల్లలు అందరిలాగే నవ్వుతారు, ఆడుతారు, కానీ పుస్తకం తెరిచినప్పుడు మాత్రం వారి కళ్లలో కనిపించే ఒక చిన్న భయం, చిన్న ఆందోళన కొంచెం జాగ్రత్తగా మనం గమనిస్తే కనిపించక మానదు.

అది “సిలబస్ ఎలా పూర్తిచేస్తాను?” అనే భయం కాదు, అది “నేను బాగా రాయకపోతే.. అమ్మ నాన్న నిరాశపడతారా?, వాళ్లు బాధపడతారా?” అని ఒక చిన్న టెన్షన్.

ఈ భావనలు పెద్దగా బయటపడవు. కానీ పిల్లల హృదయంలో మాత్రం, ఈ టెన్షన్ డిసెంబర్ నుంచే మొదలైపోతుంది ఎందుకంటే ఇది ఎగ్జామ్ సీజన్ కాబట్టి.

ఎందుకు ఎగ్జామ్ ప్రెజర్ డిసెంబర్ నుంచే మొదలవుతుంది?

సిలబస్ రివిజన్‌లో వేగం పెరగటం, టీచర్ల నుండి reminders, slip tests, pre-finals.. ఇవన్నీ పిల్లల మనసులో ఒకే మాటను మళ్ళీ మళ్ళీ మోగిస్తుంటాయి; “మార్చ్ దగ్గరపడుతోంది..”

ఫ్రెండ్స్తో మార్కుల గురించి మాటలు, ఇంట్లో పెద్దల చదువు అని చెప్పడం తప్ప వేరే మాటలు వినపడకపోవడం, Teachers నుంచి continuous reminders, బయట ఎవరిని కలిసిన ఎలా సాగుతోంది నీ చదువు అని ప్రశ్నలే వినపడటం మొదలుగునవి అన్నీ వారిలో చిన్న చిన్న ఒత్తిడిలుగా వచ్చి చేరతాయి.

కానీ కొందరు పిల్లలు ఏమీ తెలియనట్టుగా ఉంటారు, కొంతమంది శాంతంగా కనిపిస్తారు, మరి కొంతమంది టెన్షన్తో తిరుగుతూ ఉంటారు.

కానీ నిజానికి, వారు ఎవరు కూడా perfectly fine గా ఉండటం కాదు.. perfectly composed గా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. అదీ ఒక ఒత్తిడే.

పిల్లల్లో కనిపించే చిన్న చిన్న సంకేతాలు

ఎగ్జామ్ ప్రెజర్ అనేది పెద్దగా అరుస్తూ రాదు.

అది మనకి తెలియనంతగా ఒక చిన్న చిన్న మార్పులు రూపంలో వస్తుంది. మనం గమనించే లోపల పిల్లలు దగ్గర ఎగ్జాం ప్రెషర్‌గా మొదలైపోతుంది.

మనం పెద్దలమై ప్రతి భావాన్నీ మాటల్లో చెప్పగలము, చూపగలము. కానీ పిల్లలు?

వాళ్లు వ్యవహారంలో చూపిస్తారు.

అవి ఎలాగంటే:

ఇవి అన్నీ “పిల్లలు తప్పు చేస్తున్నారు” అని కాదు.. “పిల్లలు ఒత్తిడిలో ఉన్నారు” అని చెప్పే సంకేతాలు.

వాళ్లు మన మీద కోపగించుకుంటే, మన మాటలకు స్పందించకపోయినా..

నిజానికి మనలను దూరం చేస్తున్నట్టు కాదు మన సాయం ఎలా అడగాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు.

ఈ సంకేతాలను గమనించి భుజం తట్టే తల్లిదండ్రులే, బోర్డు ఎగ్జామ్స్ రాయబోయే పిల్లలకు ఒక పెద్దఅండగా నిలబడగలుతారు.

ఎలా మీరు మీ పిల్లలకి అండగా నిలబడగలరు?

మీ పిల్లలు బోర్డు ఎగ్జామ్స్ కోసం సబ్జెక్టు మట్టుకు చదువుకుంటే సరిపోదు, ఎందుకంటే, వాళ్లు ఆన్సర్ చేయాల్సింది బోర్డు ఎగ్జామ్స్‌లో వచ్చే ప్రశ్న పత్రం మట్టుకే కాదు తమ మనసులో మెదులుతున్న భయాలు, సందేహాలు, ఇంకా మరెన్నో ప్రశ్నలకు కూడా వాళ్ళు జవాబులు ఇచ్చుకోగలగాలి.

పుస్తకాల్లోని chapters కంటే, వారి మనసులోని ప్రశ్నలు పెద్దవి.

ఈ ప్రశ్నలు పుస్తకాల్లో కనిపించవు, కానీ పిల్లలు పుస్తకం తెరిచిన ప్రతిసారీ.. ఈ భావాలు మాత్రం పేజీల మధ్యలో నుంచి మెల్లగా ఎగిరి తలలోకి ఎక్కి కూర్చుంటాయి.

మనకి, పెద్దలకి, ఇవి చిన్న విషయాల్లాగా అనిపించవచ్చు. కానీ వారి వయసులో.. ప్రతి ఒక చిన్న ప్రశ్న కూడా భారీ ఒత్తిడిలా అనిపిస్తుంది.

అందుకే బోర్డు ఎగ్జామ్ సమయంలో పిల్లలకు కావాల్సింది; ఇంకా ఎక్కువ చదువు అని చెప్పే తల్లిదండ్రులు కాదు, మొబైల్ ఫోన్ పక్కన పడేసేయి, పోర్షన్ ఎప్పుడు కంప్లీట్ చేస్తావు అని, చెప్పే తల్లిదండ్రులు అంతకంటే కాదు!!

వారికి కావాల్సింది:

అందుకే:

1. “నీకు భయం సహజమే” అని చెప్పండి

పిల్లలు “నాకు టెన్షన్‌గా ఉంది” అని చెప్పినప్పుడు మనలో చాలామంది వెంటనే అంటారు; “ఏముంది టెన్షన్ పడడానికి?, డ్రామాలు చేయకు” అని కూడా అంటారు.

కానీ వాళ్ల మనసుకు కావాల్సింది ఒక్కటే వాక్యం:

ఇలా అనిపించడం చాలా సహజం. నేను నీ పక్కనే ఉన్నాను.

ఈ ఒక్క వాక్యం పిల్లల ఒత్తిడిని సగానికి తగ్గిస్తుంది.

2. చదువు ప్లాన్‌ను సరళముగా మార్చండి

రోజంతా పిల్లల్ని చదువు అని చెప్పి గంట గంటకి టైం టేబుల్ మారుస్తూ ఉంటే, వాళ్ళకి పిల్లల్లో ఒత్తిడిని పెంచుతుంది, తప్పించి, వాళ్ళు చదువుకున్నది బుర్రలోకి ఎక్కదు. వాళ్ల టైం టేబుల్‌లో కొంచెం సేపు రిలాక్సేషన్, కొంచెం సేపు ఫ్యామిలీ టైము, కొంచెం సేపు ప్రకృతిలో గడపటం, మొదలగునవి కూడా ఇస్తూ చదువుని సరిగా ప్లాన్ చేస్తే మంచిది.

వారు ఎన్ని గంటలు చదివారు అన్నది కాదు ఎన్ని గంటలు కాన్సన్ట్రేటెడ్‌గా చదివారో అన్నది ముఖ్యం అని టైం టేబుల్ డిజైన్ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి

3. ప్రతిరోజు 10 నిమిషాల పాటు వారితో సమయం గడపండి.

ఇది చదువు కన్నా ముఖ్యమైనది.

ఈ 10 నిమిషాల్లో:

పిల్లల్లోని కాన్ఫిడెన్స్‌ని పెంచుతాయి వాళ్ళ మనసులని ప్రశాంతంగా మారుస్తాయి.

4. పోలికలు పూర్తిగా మానేయండి

ఈ మాటలు పిల్లల మనసులో ఒకే భావనని పెంచుతాయి

అమ్మా నాన్నకి నేను ఎంత చేసినా, చదివినా సరిపోదు..”

దాని బదులు:

నీ pace, నీ style, నీ బలం.. నీదే.”, “నిన్ను నువ్వు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకు

ఈ రెండు వాక్యాలు పిల్లలకి అవసరమైన మద్దతునిస్తాయి వాళ్లలో కాన్ఫిడెన్స్ నింపుతాయి.

5. ఎగ్జామ్ అంటే జీవితం కాదు.. ఒక అధ్యాయం మాత్రమే

10th/12th చదువుతున్న పిల్లలు చాలా అంతర్ముఖంగా ఆలోచించే వయసులో ఉంటారు. వాళ్లు ఒక పెద్ద అపోహతో బ్రతుకుతారు:

ఈ మార్కులు నా జీవితాన్ని డిసైడ్ చేస్తాయి, మంచి మార్కులు రాకపోతే జీవితం లేదు

ఈ అపోహను తొలగించగలిగేది ఒక్కరే – తల్లిదండ్రులు.

6. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉండాలి

ఎగ్జామ్ నెలల్లో ఇంట్లో వాతావరణం ఎంతో ముఖ్యం.

మీ పిల్లలు చదువుతున్నప్పుడు:

ఇవి చిన్నగా కనిపించినా.. పిల్లల మనసుకి ఇవే పెద్ద సపోర్ట్.

7. వారికి మీ ఆత్మీయమైన మాటలు కావాలి

ఎగ్జామ్ భయం వారి మనసును పట్టిపీడిస్తుంటే.. వాళ్లకు బలం ఇచ్చేది పాఠాలు కాదు – తల్లిదండ్రుల మాటల్లో దాగిన ఆత్మీయతే.

ప్రతి రోజు వారికి వినిపించాల్సిన మాట.. ఒక్కటే:

ఏం జరిగినా.. నీ వెంటే నేనే ఉన్నాను.

మీ ఈ మాటలు, పిల్లలకు ఏ పుస్తకం నేర్పలేని ధైర్యాన్ని అందిస్తుంది. వారి మనసు ప్రశాంతమవుతుంది. వారి అడుగులు నిలకడగా మారతాయి.

ఎందుకంటే పిల్లలకి నిజంగా కావల్సింది: మీ తోడు, మీ ప్రేమ, మీ విశ్వాసం.

ముగింపు:

బోర్డు ఎగ్జామ్స్ పిల్లల జీవితంలో ఒక పెద్ద మలుపు అనిపించినా..

తల్లిదండ్రుల దగ్గర లభ్యమైన ప్రేమ, శాంతి, నమ్మకం..

వారి ప్రయాణాన్ని ఎంత సులభం చేస్తుందో మాటల్లో చెప్పలేం.

పిల్లలు పుస్తకాలు చదువుతారు.

సమాధానాలు రాస్తారు.

ఎగ్జామ్ హాల్లో ఒంటరిగా కూర్చుని పరీక్ష రాస్తారు.

కాని ఆ హాల్లోకి వెళ్లే ముందు.. వారి మనసుని తేలికగా చేయడం మన చేతిలో ఉన్న పని.

ఇంతకంటే పెద్ద సపోర్ట్ పిల్లలకు అవసరం లేదు.

పరీక్షలు వస్తాయి, పోతాయి.

ముందు మరెన్నో అవకాశాలు వస్తాయి.

కానీ మనం ఈ సమయంలో పిల్లలకు ఇచ్చే ప్రేమ-వారికి జీవితాంతం ఉండే బలం.

ఈ డిసెంబర్, మనం ఒక నిర్ణయం తీసుకుందామా:

పిల్లల నుంచి మనం పర్ఫెక్ట్ ఫలితాలు ఆశించకుండా, మనము వాళ్లకి పర్ఫెక్ట్ సపోర్ట్ ఎప్పుడైతే ఇస్తామో, అప్పుడే వారు మనకి మంచి ఫలితాలు సాధిస్తారు.

(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)

Exit mobile version