Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-39

[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]

హాలిడే ట్రావెల్‌లో పిల్లలతో ప్రశాంతంగా ప్రయాణించడానికి కావల్సిన టిప్స్

డిసెంబర్ చల్లని గాలి మొదలవగానే, ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక ఎక్సైట్‌మెంట్ మొదలవుతుంది “ఈ క్రిస్మస్ హాలిడేస్‌కి ఎక్కడికైనా వెళ్దామా?” అని.

ఆఫీసులో వర్క్, ఇంట్లో పని, రొటీన్‌గా జరగాల్సిన కొన్ని పనులు, పిల్లల పాఠశాల టైమ్‌టేబుల్, హోంవర్క్ ఒత్తిడులలో మునిగి కొట్టుకుపోతున్న మనందరికీ ఈ హాలిడేస్ ఒక మంచి రిలాక్సింగ్ టానిక్.

మా పేరెంటింగ్ గ్రూపులో ఒక మదర్ రీసెంట్‌గా ఈ స్టోరీ షేర్ చేశారు:

“మా ట్రిప్ కోసం ప్యాకింగ్ చేస్తుంటే, నా 7 ఏళ్ల కొడుకు నన్ను చూసి ఇలా అన్నాడు – ‘అమ్మా, మనం వెళ్లే చోటున్న వాళ్లు ఎలా జీవిస్తారో తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది.’

అప్పుడే నాకు తెలిసింది మీ మాటల్లోనే నిజము మనం ఈ హాలిడేల్లో వెళ్లే ట్రిప్పుల మూలంగా మన పిల్లల్ని ప్రపంచానికి దగ్గరగా తీసుకెళ్తున్నాము అని.”

అదే నిజం.. పిల్లలకు హాలిడే ట్రిప్స్ అంటే కేవలం ఫోటోలు కాదు.. అది, వారు ఇంటి బయట ప్రపంచాన్ని చూడడానికి అర్థం చేసుకోవడానికి చేసే మొదటి ప్రయత్నం.

మన పిల్లలు బయట దేశాలు, నగరాలు, భాషలు, స్థానిక జీవనం, మొదలగునవి ప్రత్యక్షంగా చూసినప్పుడు, వాళ్లలో ఓ కొత్త బుద్ధి, ఓ కొత్త ప్రశ్న, ఓ కొత్త జిజ్ఞాస పుడుతుంది.

మరి ఈ హాలిడేస్ అని టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఎలా ఎంజాయ్ చేద్దాం తెలుసుకుందామా?

1. పిల్లలను Planning లో భాగం చేయండి

Map చూపిస్తూ, “మనమిప్పుడు ఇక్కడ ఉన్నాం, మనం ఇక్కడికి వెళ్తున్నాం” అని చెప్పడం మూలంగా పిల్లలు చాలా రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అవుతారు. దాంతో పాటు వాళ్లకి కొత్త ప్రదేశం గురించి ఇంకా తెలుసుకోవాలని ఒక ఆసక్తి వాళ్ళలో కలుగుతుంది

2. పిల్లల్ని ప్యాకింగ్ లో కూడా పాలుపంచుకోమని చెప్పండి

పిల్లలకు ఒక చిన్న బ్యాక్‌ప్యాక్ ఇచ్చి అందులో ప్రయాణానికి అవసరమైనవి వాళ్ళని ప్యాక్ చేసుకోమనండి

ఈ బ్యాగ్ ఎక్కువ హెవీగా ఉండదు కానీ మీ పిల్లల్లో రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అవుతుంది.

3. లోకల్ కల్చర్ గురించి ముందుగానే పిల్లలకి చెప్పండి

పిల్లలు కొత్త ప్రదేశానికి ఎలా వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, అన్న విషయంపై కొంచెం క్యూరియస్‌గా ఉంటారు. అందుకే వారికి అక్కడి కల్చర్ గురించి అక్కడ మనం చూసే విషయాల గురించి కొంచెం ముందుగానే ఒక వివరణ ఇస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు

ఉదాహరణకు:

ఈ సమాచారం మొత్తం 5 నిమిషాల మాటల్లో ముగిసిపోతుంది.. కానీ ఐదు నిమిషాల సంభాషణ పిల్లల్లో ఒక కొత్త క్యూరియాసిటీని పెంచుతుంది.

4. ట్రావెల్ డీలేస్ గురించి ముందుగానే పిల్లలకి వివరించండి

హాలిడేస్ మూలంగా ఒక్కోసారి ట్రైన్స్, ఫ్లైట్స్ లేట్ అయ్యే అవకాశం ఉంది, రోడ్ ట్రిప్‌లో వెళ్తే ట్రాఫిక్ జామ్ అవకాశం కూడా ఉంది, అని వాళ్ళకి వివరించండి. అలాంటప్పుడు వారికి బోర్ కొట్టకుండా వాళ్లతో కొన్ని గేమ్స్ ఆడండి.

దీంతో ఫ్యామిలీ బాండింగ్ కూడా పెరుగుతుంది

5. ట్రావెల్ తో మీరు మీ పిల్లలకు అందించబోయే అసలైన విజ్ఞానం

మనము కుటుంబంగా చేసే ప్రతి ప్రయాణం.. కేవలం కొత్త హోటల్లో ఉండటం, కొత్త ప్రదేశాలు చూడటం అనే పరిమిత అనుభవం కాదు. ఇది పిల్లలకు ప్రపంచాన్ని ప్రత్యక్షంగా అర్థం చేసుకునే అరుదైన అవకాశం.

అందుకే, వారిని:

లోకల్ లైఫ్‌ని చూడనివ్వండి: అక్కడ లోకల్ మార్కెట్లో తిరగండి అక్కడ ఏం వస్తువులు దొరుకుతాయో వాటిని కొనడానికి మనం వెండర్స్‌తో ఎలా మాట్లాడాలో పిల్లలకు తెలుస్తుంది. పిల్లలకి అదే ఒక రియల్ నిజమైన లెర్నింగ్ అవుతుంది

స్థానిక భోజనం తిననివ్వండి: పిల్లలు తొందరగా కొత్త రుచులు ట్రై చేయరు. కానీ మనం వెళ్లిన ప్రతిచోట అక్కడ దొరికే భోజనాన్ని ఒకసారన్నా ట్రై చేయమని ఎంకరేజ్ చేయండి. దీంతో వాళ్లు కొత్త వాటిని యాక్సెప్ట్ చేయడం అన్నది నేర్చుకుంటారు

స్థానికులతో చిన్న మాటలు: అక్కడ ఉన్న స్థానికులతో మీ పిల్లల్ని చిన్నగా సంభాషణలు మొదలు పెట్టమని చెప్పండి. హలో, థాంక్యూ, లేదంటే, వారి భాషలో ఒక కొత్త పదాలు నేర్చుకోవడం మీ పిల్లల్లోని షైనెస్ తగ్గిస్తాయి, సమాజంలో మనుషులతో ఎలా మసులుకోవాలో నేర్పిస్తుంది

6. Expectation vs Reality – ప్రయాణం నేర్పే చిన్న కానీ ముఖ్యమైన జీవన పాఠం

ప్రతి ట్రిప్‌లో మనం హోటల్ ఇలా ఉండాలి, బయట తినే భోజనం రుచిగా ఉండాలి, ప్రదేశాలు రద్దీ లేకుండా ప్రశాంతంగా ఉండాలి, అన్ని చాలా బాగా జరగాలి అని ముందు ప్లాన్ చేసుకుంటాము.

కానీ వాస్తవం మాత్రం కొన్నిసార్లు భిన్నంగా ఉంటుంది. హోటల్ ఆశించినట్టుగా ఉండకపోవచ్చు, అక్కడి ఫుడ్ మనకు నచ్చకపోవచ్చు, లేదు ఆ ఊర్లో టూరిస్ట్ ఎక్కువగా ఉండొచ్చు, మనం ప్లాన్ చేసిన షెడ్యూల్ కూడా మార్చాల్సి రావచ్చు.

ఇలాంటి పరిస్థితులలో పిల్లలు చిరాకు పెట్టొచ్చు లేదా గొడవలు పడటం చాలా సహజం. అప్పుడే మనము పిల్లలకి నెమ్మదిగా చెప్పాలి, మనం వేసిన ప్లాన్లు ఏవైనా కూడా కొన్నిసార్లు పరిస్థితులను బట్టి అవి మారుతాయి, కాబట్టి మనము మన ప్లాన్లను మార్పు చేసుకోవాలి అని.

మనము చేసే ఈ చిన్న సంభాషణ పిల్లల్లో ఓపెన్ మైండ్‌ని పెంపొందిస్తుంది. వాళ్లలో వచ్చిన ప్రతి పరిస్థితిని దానికి అనుగుణంగా మానేజ్ చేసే కెపాసిటీ పెంచుతుంది.

7. Over-planning Avoid చేయండి – పిల్లలకి కూడా రెస్ట్ కావాలి

ప్రయాణం అంటే ప్రతీ రోజు పది ప్రదేశాలు చూసి రావడం కాదు. అలా రోజుకు 10 ప్రదేశాలు చూడడంతో వాళ్ళు ఏం చూసాము, ఏం నేర్చుకున్నాము, అన్నది కూడా మర్చిపోతారు.

పిల్లలకి కావాల్సింది మనతో కలిసి ప్రశాంతంగా టైమ్స్ పనిచేయటం వాళ్లతో కలిసి ఒక పార్కులోకి వెళ్లి కాసేపు ఆడుకున్నా కూడా చాలు. అందుకే ప్రతిరోజు ఫుల్ డే ఆక్టివిటీస్‌తో నింపాల్సిన అవసరం లేదు కొంచెం రెస్ట్ కూడా టైం కేటాయించి మీరు పనులను కూడా ముగించుకోవచ్చు

ముగింపు

ప్రదేశాలు మారుతాయి.. కానీ క్షణాలు నిలిచిపోతాయి

ప్రతి హాలిడే ట్రిప్ మన పిల్లలకు చూపేది కొత్త నగరాలను మాత్రమే కాదు.. కొత్త మనుషులను, కొత్త అనుభవాలను, కొత్త భావాలను కూడా. వారు పుస్తకాలలో చదివే ప్రపంచం, ఇక్కడ వారి కళ్ల ముందే జీవించి కనిపిస్తుంది. ఇది వారి మదిలో curiosity ని పెంచుతుంది, మనసులో ధైర్యాన్ని నింపుతుంది, హృదయంలో ఉన్న చిన్న చిన్న భయాలను కరిగిస్తుంది.

పిల్లలకు ప్రయాణం అంటే మనతో కలిసి గడిపే సమయం, మన మాటలు, మన నవ్వులు.

వాళ్లు ఏమి చూశారన్నదానికన్నా, ఎవ్వరితో కలిసి చూశారన్నదే వారికి జీవితాంతం గుర్తుంటుంది.

ఎందుకంటే చివరికి..

ట్రిప్స్ ముగుస్తాయి, రోజులు తిరిగి రొటీన్లోకి వెళ్తాయి. కానీ ఒకటి మటుకు మిగిలే ఉంటుంది అది మనమందరం కలిసి సృష్టించుకున్న మెమరీస్. ఆ మెమరీసే మీ పిల్లలకి మీరు ఈ హాలిడేస్‌లో ఇవ్వగలిగే అత్యంత అపురూపమైన గిఫ్ట్.

(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)

Exit mobile version