Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-41

[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]

‘మన పిల్లలు వారి బెస్ట్ వెర్షన్‌గా మారాలంటే..’ – సంవత్సరం చివరి పేరెంటింగ్ రిజల్యూషన్స్

సంవత్సరం చివరి రోజులు వచ్చేస్తుంటే.. చాలా మంది తల్లిదండ్రుల దృష్టి కొత్త సంవత్సరం వేడుకలమీదే ఉంటుంది. ఎక్కడ పార్టీ చేసుకోవాలి? ఎక్కడికి వెకేషన్‌కు వెళ్లాలి? పిల్లలతో, ఫ్రెండ్స్‌తో ఎలా ఎంజాయ్ చేయాలి?

ఈ ఆనందం, ఈ ఉత్సాహం సహజమే. మన కుటుంబానికి చిన్న బ్రేక్.. మన హృదయాలకు చిన్న పండుగ.

కానీ.. సంవత్సరాంతం అంటే కేవలం పార్టీలు, ప్లాన్లు, రిజల్యూషన్లే కాదు.

ఇది ఒక అందమైన ‘రిఫ్లెక్షన్ టైమ్’ – మన జీవితం, మన పేరెంటింగ్, మన పిల్లల ప్రయాణం గురించి ఆలోచించే మౌన క్షణం.

మనమేం చేస్తున్నాం?

మన పిల్లలను భవిష్యత్తు కోసం ఎలా సిద్ధం చేస్తున్నాం?

వాళ్లను సరైన దారిలో నడిపిస్తున్నామా?

వారి భావోద్వేగాలు, అలవాట్లు, ఆత్మవిశ్వాసం.. ఇవన్నీ ఎలా పెరుగుతున్నాయి?

ఈ ప్రశ్నలు ప్రతి సంవత్సరం చివరలో మనం మనసుతో మనకే వేసుకోవాల్సినవి.

మన పిల్లలు వారి బెస్ట్ వెర్షన్‌గా మారాలంటే, కొత్త సంవత్సరంలో మనం ఏ మార్పులు తీసుకురావాలి? మనకు, మన పిల్లలకు, మన కుటుంబానికి మంచి దిశ చూపే కొన్ని హృదయపూర్వక పేరెంటింగ్ రిజల్యూషన్లు మీ కోసం, ఈ రోజు.

పిల్లల ‘బెస్ట్ వెర్షన్’ అంటే నిజంగా ఏమిటి?

మనకు ‘బెస్ట్ వెర్షన్’ అంటే వెంటనే గుర్తొచ్చేది – మంచి చదువు, మంచి మార్కులు, మంచి ప్రవర్తన. స్కూల్లో టాప్ ర్యాంక్ వస్తే మనకు గర్వంగా ఉంటుంది.. టీచర్ “మీ వాడు చాలా ఒబిడియెంట్” అంటే మన మనసు అంతా ఆనందంతో నిండిపోతుంది కదా!! ఇవి ఏవి తప్పు కాదు, కానీ బెస్ట్ వెర్షన్ అనేది ఇంతకంటే పెద్దదే కాదా?

ఉదా:

ఒకరోజు స్కూల్ నుంచి వచ్చి, “నేడు నాకు మాథ్స్‌లో డౌట్ వచ్చింది, నేను తప్పుగా చేసేశాను” అని చెబుతున్న పిల్లాడు.. కానీ అదే తప్పును రేపటి క్లాస్‌లో చెయ్యెత్తి టీచర్‌ని అడగడానికి ధైర్యం చేస్తే; అది కూడా అతని బెస్ట్ వెర్షన్ దిశగా వేసే అడుగే కదా?

పార్క్‌లో ఆడుతుంటే ఒకసారీ ఓడిపోయి ఇంటికి వచ్చి ఏడవడం సహజం. కానీ మళ్లీ వెళ్లి ఆడాలని, నేర్చుకోవాలని నిర్ణయం తీసుకోవడం; ఇది కూడా ఒక్క ఎదుగుదలే.

తన ఫ్రెండ్‌కి హోంవర్క్‌లో హెల్ప్ చేయడం, చిన్న తమ్ముడితో సహనం చూపడం, షాపింగ్‌కి వెళ్లినప్పుడు “నాకింకా ఇది కావాలి” అని బలవంతం చేయకుండా అర్థం చేసుకోవడం. ఇవన్నీ పిల్లలకి కావాల్సిన లైఫ్ స్కిల్స్ కానీ ఈ టెస్ట్ బుక్స్‌లో మనకి కనిపించవు.

ఇలాంటి చిన్న చిన్న సంఘటనలే మన పిల్లలను రేపటి రోజు వాళ్లను ఒక మంచి మనిషిగా ఒక మంచి లీడర్‌గా నిలబెట్టటానికి కావాల్సిన సోపానాలు. అందుకే, మనం ‘బెస్ట్ వెర్షన్’ అనగానే పరీక్షలు, ట్రోఫీలు మటుకే గుర్తు రాకూడదు, వాళ్ల మానసిక బలం, భావోద్వేగ తెలివి, నిర్ణయం తీసుకునే సామర్థ్యం, విలువలు కూడా గుర్తుకు రావాలి.

పిల్లలు వారి బెస్ట్ వెర్షన్‌గా మారడం అంటే —

ఇది అన్నీ స్కోర్ కార్డ్‌లో కనబడేవి కావు.

కానీ ఇవే జీవితాంతం నిలిచే నైపుణ్యాలు.

అందుకే మన పేరెంటింగ్ రిజల్యూషన్స్ కూడా ర్యాంకులు, గ్రేడ్లు, చదువుల చుట్టూ మాత్రమే కాకుండా..

పిల్లల వ్యక్తిత్వం, భావోద్వేగ ఆరోగ్యం, అలవాట్లు, లక్ష్యాలు, ఆత్మవిశ్వాసం – ఇవన్నీ కవర్ చేసేలా ఉండాలి.

సంవత్సరాంత పేరెంటింగ్ రివ్యూ – మనం ఏం నేర్చుకున్నాం?

సంవత్సరం ముగింపు అనగానే, మనం ఎక్కువగా ఆలోచించేది:

కానీ అంతకంటే ముఖ్యమైన ప్రశ్న ఒకటి ఉంది. అదే, మనల్ని మనం ఒక పేరెంటుగా వేసుకోవాల్సింది “నేను ఒక పేరెంట్‌గా ఈ ఏడాది ఏం నేర్చుకున్నాను?” అని.

ఈ ప్రశ్న చాలా చిన్నదిగా కనిపించినా.. అత్యంత శక్తివంతమైనది.

ఎందుకంటే పిల్లల ఎదుగుదల వరుసగా సాగాలంటే, మనం కూడా ఒక పేరెంట్‌గా వాళ్లతో కలిసి ఎదగాలి.

ఉదా:

ఒక అమ్మ తన 10 సంవత్సరాల కుమారుడి మీద హోంవర్క్ విషయంలో ప్రతిరోజూ కోప్పడేది. కానీ తరువాత ఆమె గమనించింది, పిల్లాడు, తన హోమ్ వర్క్ ఎలా స్టార్ట్ చేయాలో, ఎలా ప్లాన్ చేసుకోవాలో, తెలియక కంగారు పడటంతో, ప్రాబ్లమ్‌ని ఎస్కేప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని.

ఆమె పద్ధతి మార్చి, “మొదట 10 నిమిషాలు కలిసి ప్రారంభిద్దాం” అన్నప్పుడు..

పిల్లాడు కూడా ఒత్తిడి లేకుండా పని చేయడం మొదలుపెట్టాడు. పిల్లవాడికి తన వర్క్ ప్లానింగ్ గురించి కూడా అర్థమవ్వటం మొదలైంది.

ఇక్కడ మారిందేమిటి?

పిల్లాడు కాదు, పేరెంటింగ్ దృక్పధం.

అదే మార్పు ఇంట్లోని వాతావరణాన్నే మార్చేస్తుంది.

కాబట్టి సంవత్సరం చివరలో మనం అడగాల్సిన నిజమైన ప్రశ్నలు ఇవి:

ఇలా వెనక్కు చూసినప్పుడు, మన ఇంట్లోనూ విజయాలు కనిపిస్తాయి:

ఇవన్నీ కూడా ఈ సంవత్సరపు నిజమైన ‘సెలబ్రేషన్ మోమెంట్స్’.

ఈ రివ్యూ మనకు judgement కాదు.. ఒక gentle reminder, gentle pause:

బెటర్ పేరెంటింగ్ అంటే రోజువారీ రోజువారి జీవితంలో మనం చేసే చిన్న చిన్న మార్పులు. మన పిల్లల్ని మనల్ని మనము మరింత అర్థం చేసుకొని ఇంకా కొంచెం ప్రేమతో కలిసి ఉండటానికి అవసరమయ్యే ఒక gentle pause.

కొత్త సంవత్సరానికి 7 కీలక పేరెంటింగ్ రిజల్యూషన్స్

మన పిల్లలు వారి బెస్ట్ వెర్షన్ వైపు నడవాలంటే..

ముందుగా మనం మన బెస్ట్ వెర్షన్ పేరెంట్స్‌గా మారాలి.

2026లో మనం చేయగలిగే చిన్న కానీ ప్రభావవంతమైన 7 పేరెంటింగ్ రిజల్యూషన్స్ ఇవి:

1. “Listen More, React Less” – మరింత విని, తక్కువగా స్పందించడం

పిల్లల మాటల్లో ఎంత నిజం ఉన్నదో వినకపోతే తెలుస్తుందా?

అవసరం లేని వ్యాఖ్యలు, త్వరిత స్పందనలు తగ్గించి..

“Tell me more” అని అడగడం ఈ ఏడాది మన మొదటి రిజల్యూషన్ కావాలి.

టిప్: మాట్లాడుతుంటే, మొబైల్‌ను పక్కన పెట్టండి – ఇది వాళ్లకు పెద్ద signal.

2. పిల్లలకు భావోద్వేగాలను పేర్లు పెట్టడం నేర్పించడం

కోపం, బాధ, ఈర్ష్య, గందరగోళం – ఇవన్నీ పిల్లలలో సహజమైన భావాలు.

కానీ వాటికి పేరు పెట్టగలిగినప్పుడు మాత్రమే వారు వాటిని నియంత్రించగలరు.

“నీకు ఇప్పుడు అసహనంగా ఉన్నట్టుంది, కదా?” అని అడగడం చాలాసార్లు అతని మనసు తేలిక చేస్తుంది.

టిప్: వాళ్లు upsetగా ఉంటే, diagnosis చేయకుండా options ఇవ్వండి – “ఇది కోపమా? బాధా? అలసటా?”

3. స్క్రీన్ టైమ్‌పై వాదనలు కాదు, సహకారం

ఎన్ని బాన్‌లు వేసినా, ఎంత కోప్పడ్డా..

స్క్రీన్ సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందా?

పిల్లలతో కలిసి రూల్స్ నిర్ణయించడం, వారికి ownership ఇవ్వడం – ఇదే sustainable మార్గం.

టిప్:  రూల్స్‌ను పేపర్‌పై రాసి, fridge మీద పెట్టండి – ఇది arguments తగ్గిస్తుంది.

4. ‘ఫ్యామిలీ టైమ్’ ను ఒక రొటీన్‌గా మార్చడం

ఒక వారం లో కనీసం 2 uninterrupted family moments –

ఫోన్లు పక్కకు, పనులు పక్కకు, టీవీ పక్కకు.

ఆ 20–30 నిమిషాలు కూడా పిల్లల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.

5. తప్పులకు అవకాశమివ్వడం – మరియు విమర్శ తగ్గించడం

పిల్ల తప్పు చేస్తే వెంటనే ప్రతి ఇంట్లో ఒకే మాట వినిపిస్తుంది: “ఎన్ని సార్లు చెప్పాను?” అని. ఈ ఏడాది ఇది మార్చుకుందాం.

తప్పులు చేస్తేనే వాళ్లకు నేర్చుకునే అవకాశం వస్తుంది. ఆ అవకాశంని, సరైన రీతిలో ఉపయోగించుకోవడం గురించి వారికి తెలియచెప్పే మెంటర్ గానే మనం నిలబడాలి

చిన్న టిప్: తప్పు జరిగితే “ఎందుకు చేశావు?” అని కాకుండా “దీనిని ఎలా సరిచేద్దాం?” అని అడగండి.

6. పిల్లల రొటీన్‌లో చిన్న self-discipline అలవాట్లు పెట్టడం

పిల్లల్లో self-discipline అంటే పెద్ద పెద్ద targets అవసరం లేదు. చిన్న చిన్న అలవాట్లే రేపటి పెద్ద బాధ్యతలకు పునాది అవుతాయి. ఉదా:

ఇలాంటి చిన్న అలవాట్లు రేపు పెద్ద disciplineగా మారతాయి.

7. పిల్లల strengths గుర్తించడం – వాటిని celebrate చేయడం

ప్రతి పిల్లలోని ఒక్కొక్క strength ఉంటుంది. ఒక్కరికి డ్రాయింగ్ అద్భుతంగా వస్తుంది, ఇంకొకరు సహజంగానే లీడర్‌షిప్ చూపుతారు, మరెవరైనా చిన్న చిన్న విషయాల్లోనూ empathy ప్రదర్శిస్తారు. వారిలోని strengths ను మనం గమనించి, చిన్నగా అయినా celebrate చేస్తే.. పిల్లలకు తమలోని విలువ తెలుస్తుంది. వారు “నాలో కూడా ఒక ప్రత్యేకత ఉంది” అనే భావనతో ఎదుగుతారు. అలాంటి recognition వారి నిజమైన బెస్ట్ వెర్షన్కి దారి చూపుతుంది.

చిన్న టిప్: పిల్లల టాలెంట్స్‌ని చిన్నగా అయినా display చేయండి – fridge art corner, photo shelf, etc.

ముగింపు:

డిసెంబర్ చివరి వారం అనేది మనందరికీ రీసెట్ బటన్ లాంటింది – ఏడాది ఎలా గడిచిందో చూసుకునే, మన parenting ప్రయాణాన్ని మనస్ఫూర్తిగా పరిశీలించే సమయం. ఈ నెలలో పిల్లలకు ఎగ్జామ్ ప్రెజర్ తగ్గించే చిన్న మార్గాలు పాటిస్తూ, మనం కూడా ఏం బాగా చేశాము, ఎక్కడ ఇంకా మెరుగుపరచుకోవాలి అన్న విషయాలపై కాసేపు ఆగి ఆలోచిస్తే.. వచ్చే సంవత్సరం మరింత తెలివైన, మరింత చక్కని తల్లిదండ్రులుగా మారగలం.

మన పిల్లల్లో ఉన్న ప్రత్యేకతలను గుర్తించి, వారిని బెస్ట్ వెర్షన్ వైపు నడిపించే ఈ చిన్న చిన్న ప్రయత్నాలు – ఇవే నిజమైన గిఫ్ట్లు. కొత్త సంవత్సరం ప్రారంభంకాకముందే, మనలోని పాజిటివ్ ఎనర్జీని మళ్ళీ వెలిగించి, పిల్లలకు ధైర్యం, నమ్మకం, ప్రేమ అనే మూడు గొప్ప బహుమతులు ఇవ్వగలిగితే.. వాళ్ల భవిష్యత్తు మరింత ప్రకాశవంతమవుతుంది.

ఈ సంవత్సరం చివరిని ఒక ‘reflection week’ లా చూసుకుని.. కొత్త సంవత్సరం మొదలయ్యేసరికి మనమూ, పిల్లలూ – ఇద్దరం కలిసి ఒక కొత్త, సంతోషకరమైన అధ్యాయం ప్రారంభిద్దాం.

(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)

Exit mobile version