Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-49

[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]

తప్పులు జరిగాయి.. కానీ ఇప్పటికీ ఆలస్యం కాలేదు!!

పేరెంటింగ్ అనే ప్రయాణంలో మనం ఎక్కువగా భయపడేది, బాధపడేది, ఏంటంటే, మనలో వచ్చే ఒక చిన్న ఆలోచన. ఆ చిన్న ఆలోచనే మనల్ని పెద్ద ఉప్పెన లాగా ముంచేస్తుంది.

ఉదా:

ఈ ఆలోచనలు చాలామంది పేరెంట్స్ మనసులో నిశ్శబ్దంగా తిరుగుతూనే ఉంటాయి. అవి సహజమే కానీ ఈ ఆలోచనల మధ్యలో మనం ఒక నిజం మర్చిపోతున్నాము. అది ఏమిటంటే:

పేరెంటింగ్‌లో ఆలస్యం అన్నది మన ఊహలో మాత్రమే ఉంటుంది.

పిల్లలకి మనకుండే అనుబంధంలో ఇప్పుడే, ఈ క్షణమే అన్న మాటలకి చాలా విలువ బలం ఉంది.

ఎవరూ పరిపూర్ణ పేరెంట్స్ కాదు. అది మనకి తెలుసు. కానీ మన మనసు మాత్రం అలా ఒప్పుకోదు. పేరెంటింగ్‌లో మనందరికీ కొన్ని క్షణాలు ఉంటాయి. అవే మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి భావించే క్షణాలు కూడాను.

ఉదా:

ఆ క్షణంలో మన ఉద్దేశం చెడ్డది కాదు. మనకి తెలిసినంత మంచిగానే స్పందించాం. కానీ తర్వాత, ఇంట్లో నిశ్శబ్దం పెరిగినప్పుడు, లేదా మన పిల్లలు మనతో మామూలుగా మాట్లాడకుండా ఉన్నప్పుడు; మనలో ఏదో కదులుతుంది. ఒక చిన్న భావన స్టార్ట్ అవుతుంది అదే:

ఈ చిన్న ఆలోచనలు పెరిగి పెద్ద ఉప్పెనలాగా మనల్ని పేరంటల్ గిల్ట్ వైపుకి నడిపిస్తాయి. కానీ కొంచెం సమయం తీసుకుని ఆలోచిస్తే, ఈ చిన్న చిన్న ఆలోచనలు మనము పేరెంటింగ్‌లో తప్పులు చేసాము అనటానికి సాక్ష్యాలు కాదు! అవి మనలోని అవగాహన మొదలైంది అని చెప్పడానికి సంకేతాలు!!

మన ఈ తప్పులు, మనల్ని చెడ్డ పేరెంట్స్‌గా చూపించవు, అవి మనం ఎదుగుతున్నామన్నది చెబుతాయి.

ఇది ఒప్పుకోవడం కష్టం కావచ్చు. కానీ చాలా నిజం.

తప్పు గుర్తించడం అంటే బలహీనత కాదు!

చాలామంది పేరెంట్స్, తమ తప్పులను ఒప్పుకోవడానికి వెనకాడతారు. తమ తప్పు ఒప్పుకోమన్నప్పుడు వాళ్ళల్లో ఎన్నో భావాలు కదులాడుతూ ఉంటాయి.

ఉదా:

కానీ పిల్లలతో సంబంధంలో, తప్పు గుర్తించడం బలహీనత కాదు. అది ఒక బలమైన మోడల్. ఎందుకంటే, పిల్లలు మన మాటలకన్నా మన చర్యల్ని ఎక్కువగా గమనిస్తారు.

మన తప్పులను అంగీకరించడం ద్వారా వాళ్లకి ఒక ముఖ్యమైన సందేశం ఇస్తాం. అదే

తప్పులు చేయడం మనుషుల లక్షణం. వాటిని సరిదిద్దుకోవడం కూడా అంతే సహజం.

‘ఇప్పుడే, ఈ క్షణమే’ అన్న మాటలో ఉన్న శక్తి

చాలాసార్లు మనం ఇలా అనుకుంటాం.ఇప్పుడు ఎందుకు ఆ పాత విషయాలు మళ్లీ తవ్వటం? ఇప్పుడు మొదలెడితే, మళ్ళీ గొడవలు స్టార్ట్ అవ్వవా? ఎందుకు ఇంతసేపు తర్వాత మళ్లీ దాని గురించి మాట్లాడాలి అని.

ఈ ఆలోచనలు సహజమే. మనకు కూడా అసౌకర్యంగా ఉంటుంది, కూడా. ఎక్కడో మనలో ఒక చిన్న భయం కూడా ఉంటుంది. మాట మొదలుపెడితే పరిస్థితి ఇంకా చెడిపోతుందేమో అని.

అందుకే చాలాసార్లు, మనం ఆ క్షణాన్ని వదిలేస్తాం. తర్వాత ఎప్పుడో మాట్లాడుదాం అనుకుంటాం. కానీ ఆ ‘తర్వాత’ చాలాసార్లు రాదు.

కానీ పిల్లలతో సంబంధంలో ‘ఇప్పుడే, ఈ క్షణమే’ అన్న మాటకి చాలా నిశ్శబ్దమైన శక్తి ఉంటుంది.

ఉదా:

ఆ మాట పర్ఫెక్ట్‌గా ఉండదు. వాక్యం కూడా పూర్తిగా ఉండకపోవచ్చు.

కానీ మీ పిల్లవాడు ఆ క్షణంలో మీరు అక్కడ ఉన్నారన్న భావనను గమనిస్తాడు.

ఆ ఒక్క వాక్యం మధ్యలో ఉన్న గోడను కొంచెం కదిలిస్తుంది.

“ఇప్పుడు చెప్పు” అని అంటారు. అది పెద్ద సంభాషణ కాదు. కానీ పిల్లకి ఒక పెద్ద సంకేతం: “మా వాళ్ళు నా మాట వింటారు” అని.

ఇవన్నీ చిన్న చర్యలే. కానీ పిల్లలకి “మాట ఎప్పుడైనా మొదలుపెట్టొచ్చు” అన్న భద్రతను ఇస్తాయి.

పిల్లలు మన గతాన్ని లెక్కపెట్టరు. మన మాటలు ఎన్ని సార్లు తప్పాయని కూడా కాదు.

వాళ్లు గమనించేది ఒక్కటే: మనము మళ్లీ తిరిగి వచ్చామా లేదా.

ఇప్పుడే, ఈ క్షణమేఅన్న మాట పిల్లలకి అదే చెబుతుంది.

అదే సంబంధాల్లో, మళ్లీ ఊపిరి పీల్చుకునే చోటు. మన పిల్లలు చిన్నవారైనా,

టీనేజ్లో ఉన్నవారైనా, ఈ మార్పును గమనిస్తారు. వాళ్లకి కావాల్సింది, మన గతం కాదు,

మన ప్రస్తుత ఉనికే.

మన తప్పుల్ని రిపేర్ చేసుకోవడం అంటే ఏమీ జరగనట్టు నటించడం కాదు. అది చిన్న విషయం అని ముందుకు వెళ్లిపోవడం కూడా కాదు.

రిపేర్ అంటే మన మధ్య ఏదో కుదరలేదని ముందుగా మనమే గుర్తించడం. ఆ భావాన్ని మళ్లీ తాకడానికి ప్రయత్నించడం. అది గంటల తర్వాత కావచ్చు, ఒక రోజు తర్వాత కావచ్చు,

లేదా ‘ఇప్పుడే’ కావచ్చు.

మన మార్పు చిన్నదైనా.. పిల్లలకు కావాల్సింది పరిపూర్ణ పేరెంట్ కాదు

పేరెంటింగ్‌లో మార్పు అంటే, పెద్ద నిర్ణయాలు తీసుకోవడం కాదు. జీవితాన్ని పూర్తిగా మార్చేయడం కూడా కాదు.

చాలాసార్లు మార్పు చాలా చిన్నదిగా మొదలవుతుంది.

ఉదా:

ఇవి పెద్ద విషయాల్లా అనిపించవు. కానీ పిల్లలకి ఇవి చాలా పెద్ద అనుభవాలు.

ఎందుకంటే ఈ చిన్న క్షణాల్లోనే, వాళ్లు ఒక విషయం గమనిస్తారు:

నా మాటకు ఇక్కడ విలువ ఉంది. నా భావానికి ఇక్కడ చోటుంది.

పిల్లలు మన దగ్గర పరిపూర్ణ స్పందన కోరుకోరు. ఎప్పుడూ సరైన మాటే చెప్పే పేరెంట్ కావాలని కూడా అనుకోరు. వాళ్లకి కావాల్సింది:

మన మార్పు ఎంత చిన్నదైనా పిల్లలకి దాని ప్రభావం చాలా పెద్దదిగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్లు చూస్తున్నది, మన తప్పుల సంఖ్య కాదు. మనం తిరిగి వచ్చి కూర్చున్న క్షణాలు.

ముగింపు: ఇప్పటికీ ఆలస్యం కాలేదు

పేరెంటింగ్‌లో మనం చేసిన ప్రతి తప్పును తిరిగి మార్చలేం. మిస్ అయిన ప్రతి క్షణాన్ని మళ్లీ తెచ్చుకోలేం.

కానీ ఇప్పుడున్న ఈ క్షణం మాత్రం మన చేతిలోనే ఉంది.

ఈ క్షణంలో, మనం వినగలం, మాట్లాడగలం, తిరిగి దగ్గరగా కూర్చోవచ్చు.

పిల్లలు మన గతాన్ని గుర్తుపెట్టుకుని, మనల్ని జడ్జ్ చేయరు. వాళ్లు చూసేది మనము వాళ్లతో పూర్తిగా ఉన్నామా లేదా అన్నదే. తప్పులు జరిగాయి, అవును. కానీ అవే మన కథ కాదు.

మన కథ అంటే:

ఈ రోజు కాకపోతే రేపు కాదు, రేపు కాకపోతే ఇంకో రోజు, ఎప్పుడైనా మొదలుపెట్టొచ్చు. అదే పేరెంటింగ్ లోని నిజమైన ఆశ.

(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)

Exit mobile version