Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-52

[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]

2026లో ఆటలు, ప్రకృతి, ‘అనలాగ్ బాల్యం’ ఎందుకు అంత ముఖ్యం?

ప్రతి కాలానికి తన సవాళ్లు ఉంటాయి. మన కాలంలో పోటీ తక్కువ. అవకాశాలు పరిమితం.

ఇప్పటి పిల్లలకు అవకాశాలు అపారంగా ఉన్నాయి. కానీ మనసుకు విశ్రాంతి తగ్గిందా?

ఈ మధ్య మనం గమనిస్తున్నాం: పిల్లలు బిజీగా ఉన్నారు, కానీ ప్రశాంతంగా లేరు. పైపెచ్చు వాళ్లలో టెన్షన్లు, డిప్రెషన్లు ఎక్కువవుతున్నాయి.

ఒక్కసారి ఆగి ఒక ప్రశ్న అడుగుదాం.. మన పిల్లలు బాల్యాన్ని అనుభవిస్తున్నారా? లేక కేవలం దాటుకుంటూ వెళ్తున్నారా?

మన చిన్ననాటి రోజులు గుర్తున్నాయా?

మన ప్రపంచం చిన్నది. కానీ సంపూర్ణం.

అందుకే మనసు తేలికగా ఉండేది.

ఇప్పటి పిల్లల ప్రపంచం పెద్దది. కానీ విభజించబడింది.

ఒకేసారి మన పిల్లలు:

మధ్య పరిగెడుతూ ఉంటారు వారి శరీరం ఇక్కడ ఉంటుంది. కానీ మనసు మరోచోట ఉంటుంది.

ప్రస్తుత క్షణంలో పూర్తిగా ఉండే సామర్థ్యం ఎప్పుడైతే మన పిల్లల్లో తగ్గిపోతుందో, అప్పుడు వారి బాల్యం అనుభవంగా కాకుండా.. ఒక్క కార్యక్రమంగా మారిపోతుంది.

‘అనలాగ్ బాల్యం’ అంటే ఏమిటి?

‘అనలాగ్ బాల్యం’ అంటే టెక్నాలజీని పూర్తిగా దూరం పెట్టడం కాదు. అది సంతులనం గురించి. పిల్లల జీవితంలో స్క్రీన్ ఉండొచ్చు. కానీ స్క్రీన్ మాత్రమే ఉండకూడదు. అనలాగ్ బాల్యం అంటే:

ఒక చిన్న ఉదాహరణ చూడండి.

ఒక 9 ఏళ్ల బాలుడు ప్రతిరోజూ స్కూల్ నుంచి వచ్చాక “బోర్ కొడుతోంది” అని ఫోన్ అడుగుతాడు. అమ్మ వెంటనే ఫోన్ ఇస్తుంది. అతను అరగంటలో నవ్వుతాడు, గెలుస్తాడు, ఓడిపోతాడు. కానీ ఆ నవ్వు అక్కడితో ముగుస్తుంది.

అదే రోజు అమ్మ ఫోన్ ఇవ్వకుండా, “ఈరోజు బోర్ అయితే మనం ఏదైనా కొత్తగా తయారు చేద్దామా?” అని అడిగితే? మొదట అతను మొహం చిట్లిస్తాడు. అయిదు నిమిషాలు గది చుట్టూ తిరుగుతాడు. ఆ తర్వాత పాత బాక్సులతో ఒక చిన్న కార్ తయారు చేయడం మొదలుపెడతాడు. అరగంట తర్వాత అతను కేవలం ఎంటర్టైన్ కాలేదు – ఏదో సృష్టించాడు. తన బోర్‌ను తానే మార్చుకున్నాడు.

అదే అనలాగ్ బాల్యం.

బోర్ నుంచి సృజనాత్మకత పుట్టే స్థలం. స్క్రీన్ వెలుగు కాకుండా ఊహాశక్తి వెలుగు వెలిగే దశ.

బాల్యం ఒక అప్డేట్ కాదు. అది ఒక అనుభవం. ఆ అనుభవం లోతుగా ఉండాలంటే, జీవితం కొద్దిగా నెమ్మదించాలి.

ఆట – మెదడుకు అవసరమైన వ్యాయామం

మనకు చాలా సార్లు అనిపిస్తుంది, పిల్లలు  “ఆడుకుంటూ టైమ్ వేస్ట్ చేస్తున్నారు.” కానీ నిజానికి ఆట అనేది పిల్లల మెదడుకు అత్యవసరమైన వ్యాయామం.

 పుస్తకాలు వారికి సమాచారం ఇస్తాయి. కానీ ఆట వారికి జీవితాన్ని నేర్పుతుంది.

ఇవన్నీ ఆటలోనే మొదలవుతాయి.

ఉదా: ఒకసారి ఇద్దరు పిల్లలు క్రికెట్ ఆడుతుండగా గొడవ పడిన దృశ్యం ఊహించండి. “నువ్వు అవుట్!” “కాదు, నేను కాదు!” అని వాదన మొదలవుతుంది.

అక్కడ పెద్దవాళ్లు వెంటనే జోక్యం చేసుకుని తీర్పు చెప్పేస్తే గొడవ ముగుస్తుంది. కానీ పిల్లలు తామే మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకుంటే? అక్కడ వాళ్లు కేవలం ఆటనే కాదు – చర్చించడం, ఒప్పుకోవడం, కొంత వెనక్కి తగ్గడం నేర్చుకుంటున్నారు. అది జీవిత నైపుణ్యం.

స్వేచ్ఛా ఆటలో పిల్లలు తమ పరిమితులను పరీక్షిస్తారు. కొంచెం రిస్క్ తీసుకుంటారు. చెట్టు ఎక్కి కిందకి దిగేటప్పుడు వచ్చే చిన్న భయం, ఆ తర్వాత వచ్చే ధైర్యం,  అది వారి లోపలి విశ్వాసాన్ని పెంచుతుంది. “నేను చేయగలను” అనే భావన అక్కడే పుడుతుంది.

స్క్రీన్ మీద గేమ్‌లో ఓడిపోతే “రీస్టార్ట్” ఉంటుంది. కానీ బయట ఆటలో ఓడిపోతే,  మళ్లీ ఆడాల్సిందే. అదే పట్టుదలకి మొదటి పాఠం.

ఆట కేవలం వినోదం కాదు. అది భావోద్వేగ బలానికి పునాది. అది జీవితానికి నిశ్శబ్దమైన సాధన.

ప్రకృతి – మౌన ఉపాధ్యాయుడు

ప్రకృతి పెద్దగా ఉపన్యాసాలు ఇవ్వదు, సలహాలు ఇవ్వదు, కానీ మౌనంగా మనసును మలుస్తుంది.

ఈ రోజుల్లో పిల్లల్లో  చిన్న విషయానికే చిరాకు, అసహనం, త్వరగా విసుగొచ్చే స్వభావం, మనం గమనిస్తున్నాం.

ఎందుకంటే వారికి రోజు మొత్తం నాలుగు గోడల మధ్య లేదు స్క్రీన్ నుంచి వచ్చే వెలుగులోనే గడిచిపోతుంది ప్రకృతిలో గడిపే సమయం తగ్గిపోతుంది?

ప్రకృతిలో గడిపే సమయం కేవలం ఫ్రెష్ ఎయిర్ కాదు. అది నాడీవ్యవస్థకు విశ్రాంతి.

ఉదా:

ఒక 13 ఏళ్ల బాలిక పరీక్షల ఒత్తిడి, ఫ్రెండ్స్ మధ్య పోలికలు, సోషల్ మీడియా ప్రభావం అన్ని ఆమె మనసులో నిశ్శబ్దంగా పేరుకుపోతున్నాయి. దానితో ఆమెలో చిరాకు, అసహనం పెరిగిపోతుంది. అమ్మ గమనించింది కాని పెద్ద లెక్చర్ ఇవ్వలేదు. బదులుగా, “ఈ ఆదివారం పార్క్‌కి వెళ్లామా?” అని అడిగింది.

ఈ అమ్మాయి మొదటి వద్దంది కానీ అమ్మ బలవంతం మీద పార్కుకి వచ్చింది. చిరాకుగా నడక మొదలు పెట్టినప్పటికీ, కొంచెం సేపటి తర్వాత, తన ముఖంలో ప్రశాంతంగా తనంతట తానుగా వచ్చి చేరింది. ఆ తర్వాత బెంచ్ మీద కూర్చుని చెట్లు చూడడం. ఆ రోజు పెద్ద సంభాషణ జరగలేదు. కానీ ఆ అమ్మాయి ఇంటికి మంచి మూడ్‌లో తిరిగి వచ్చింది.

ప్రకృతి అలా పని చేస్తుంది. మనసును బలవంతంగా మార్చదు, కానీ నెమ్మదిగా శాంతింపజేస్తుంది.

చెట్టు ప్రతి రోజూ పెరుగుతుంది. కానీ మనకు కనిపించదు. అలాగే ప్రకృతిలో గడిపిన ప్రతి చిన్న క్షణం కూడా పిల్లల లోపల ఏదో నిర్మిస్తోంది.

ప్రకృతి పిల్లలకు నేర్పేది ఏమిటంటే –

అది పోలికల ప్రపంచానికి ప్రత్యామ్నాయం. అది నిదానంగా ఉండే స్థలం.

స్క్రీన్ పిల్లలకు సమాచారం ఇస్తుంది. ప్రకృతి పిల్లలకు స్థిరత్వం ఇస్తుంది.

మనం పిల్లలకు ప్రకృతి సమయం ఇస్తే, వాళ్లు కేవలం బయట ఆడటం కాదు.. లోపల ప్రశాంతతను నిర్మిస్తున్నారు.

టీనేజ్లో కూడా:

ఇవన్నీ పిల్లల వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి.

స్క్రీన్ ప్రపంచం వారికి సమాచారం ఇస్తుంది. అనలాగ్ ప్రపంచం వారికి అనుభవం ఇస్తుంది. సమాచారం తెలివిని పెంచుతుంది. అనుభవం లోతును పెంచుతుంది.

ముగింపు: చిన్న అనుభవాలే పెద్ద పునాది

మనకు అనిపించవచ్చు, బయట ఆడించడం, ప్రకృతిలో నడిపించడం, బోర్ అయ్యే సమయం ఇవ్వడం.. ఇవన్నీ చిన్న విషయాలే అని.

కానీ బాల్యంలో చిన్న అనుభవాలే, పెద్ద వ్యక్తిత్వానికి పునాది వేస్తాయి.

పిల్లవాడు మట్టిలో ఆడినప్పుడు:

పిల్లవాడు బోర్ అయ్యి ఏదైనా సృష్టించినప్పుడు:

ఇవన్నీ కలిసి బయటికి కనిపించని ఒక లోపలి బలం నిర్మిస్తున్నాయి.

ఆ బలం ఒక్కరోజులో రాదు. అది ప్రతి రోజు చిన్న చిన్న అనుభవాలతో నెమ్మదిగా పెరుగుతుంది.

ఈ వారం ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం.

ఎందుకంటే వచ్చే వారం మనం ఒక ముఖ్యమైన ప్రశ్న గురించి ఆలోచించబోతున్నాం.

పిల్లల నిజమైన సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది?

అది మార్కుల నుంచా?

విజయాల నుంచా?

లేక ఈ చిన్న అనలాగ్ అనుభవాల నుంచా?

బాల్యం ఒక దశ మాత్రమే కాదు. అది జీవితానికి వేసే విత్తనం.

ఆ విత్తనం బలంగా ఉండాలంటే, మన పిల్లలకు స్క్రీన్ కంటే ఎక్కువ – అనుభవాలు ఇవ్వాలి.

(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)

Exit mobile version