[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]
పరీక్షలు అయిపోయిన తర్వాత పిల్లలు ఎందుకు మారిపోతారు?
పిల్లల పరీక్షలు ముగిసాయి ఇంట్లోకి కొంచెం ప్రశాంతత వచ్చింది. అలారం మోతతో లేచి పిల్లలు టిఫిన్ బాక్సులు కట్టే హడావిడి తగ్గింది. అందరి ఇళ్లల్లో ఇప్పుడు హృదయాలు నెమ్మదిగా మొదలవుతూ ఉంటాయి.
కానీ.. ఇంకో మార్పు కూడా మనం గమనిస్తుంటాం. మన పిల్లలు.. ముందు లాగా ఉండటం లేదు, మాటలు తగ్గిపోయాయి.. లేదా చాలా ఎక్కువయ్యాయి.
చదవడం మానేశారు.. లేదా పూర్తిగా మొబైల్లో మునిగిపోయారు.
అప్పుడు “ఈ పిల్లలు ఇలా ఎందుకు మారిపోయారు?” అని మన మనసులో ఒక చిన్న ప్రశ్న వస్తుంది.
మనకు మార్పుగా కనిపిస్తున్నది ఒక నిజానికి ఒక సహజమైన భావోద్వేగ విడుదల దశ. (emotional or stress release state).
పరీక్షల సమయంలో పిల్లలు ఒక “performance mode”లో ఉంటారు. వాళ్ల ఆలోచనలు భావాలు అలవాట్లు అన్ని పరీక్షలు చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కానీ పరీక్షలు పూర్తయిన వెంటనే..
👉 ఆ కట్టుదిట్టమైన నియంత్రణ ఒక్కసారిగా వదిలిపోతుంది.
👉 అప్పుడు బయటకు వచ్చే ప్రవర్తనే మనం “మార్పు”గా చూస్తున్నాం.
పరీక్షల సమయంలో, పిల్లలు కేవలం చదవడం మాత్రమే చేయరు.. వాళ్ళ మనసులు బోలెడంత ఒత్తిడి భయాలు ఆలోచనలతో నిండి ఉంటాయి.
ఉదా:
- “బాగా రాయాలి” అనే ఒత్తిడి
- “తక్కువ మార్కులు వస్తే?” అనే భయం
- “అమ్మానాన్న ఏమనుకుంటారు?” అనే ఆలోచన
- ఇతరులతో పోల్చుకోవడం
ఈ అన్నిటి మధ్య.. వాళ్లు తమ భావాలను పక్కన పెట్టి, ఒక లక్ష్యం కోసం ప్రయత్నిస్తారు. పరీక్షలు బాగా రాయడమే వారి లక్ష్యము. పరీక్షలు అవగానే మన పిల్లల జీవితంలో ఒక తాత్కాలికమైన ఖాళీ ఏర్పడుతుంది. అందుకే మన పిల్లల ప్రవర్తన పరీక్షల రంగాన్ని మారుతుంది. ఈ మార్పుకు కొన్ని సహజమైన కారణాలు ఉన్నాయి:
1. భావోద్వేగ విడుదల (Emotional Release)
ఇన్ని రోజులుగా నొక్కిపెట్టిన టెన్షన్, ఆందోళన..
ఇప్పుడు బయటకు వస్తాయి.
👉 కొందరు పిల్లలు నిశ్శబ్దంగా ఉంటారు
👉 మరికొందరు చిరాకు చూపిస్తారు
👉 ఇంకొందరు అలసటగా కనిపిస్తారు
ఇది సమస్య కాదు.. ఇది ఒక release process
2. ఒకేసారి రొటీన్ కోల్పోవడం (Loss of Structure)
పరీక్షల సమయంలో:
- టైమ్‌టేబుల్
- చదువు
- క్రమశిక్షణ
అన్నీ స్పష్టంగా ఉంటాయి. ఇప్పుడు ఒక్కసారిగా: “ఇప్పుడు ఏం చేయాలి?” అనే ఖాళీ వస్తుంది. ఆ ఖాళీని పిల్లలు తాత్కాలికంగా మొబైల్, గేమ్స్‌తో నింపడానికి ప్రయత్నిస్తారు.
3. “ఇప్పుడు నా టైమ్” అనే భావన (Need for Freedom)
పిల్లల మనసులో ఒక చిన్న ఆలోచన ఉంటుంది:
👉 “ఇన్ని రోజులు కష్టపడ్డాను.. ఇప్పుడు కొంచెం నా లాగా ఉండాలి”
ఇది తప్పు కాదు.. ఇది సహజం.
4. కనిపించని అలసట (Hidden Exhaustion)
పరీక్షలు కేవలం చదువు కాదు.. అవి మానసికంగా చాలా శక్తిని తీసుకుంటాయి.
పరీక్షలు పూర్తయిన తర్వాతే.. ఆ అలసట బయటపడుతుంది. అందుకే పిల్లలు:
- ఎక్కువగా నిద్రపోవచ్చు
- ఏదీ చేయాలనిపించకపోవచ్చు
ఈ దశలో పిల్లలను అర్థం చేసుకోవడం.. లేక తప్పుగా అర్థం చేసుకోవడం?
పరీక్షలు పూర్తయ్యాక పిల్లల ప్రవర్తనలో వచ్చిన మార్పును చూసి.. మనలో చాలా మంది తల్లిదండ్రులకి మొదట వచ్చే ఆలోచన:
👉 “ఇంత అలసత్వం ఎక్కడి నుంచి వచ్చింది?”
👉 “ఇప్పుడే ఇలా ఉంటే.. ముందెప్పుడు?”
మనకు ఇది ఒక problem లా కనిపిస్తుంది. కానీ నిజానికి..
👉 ఇది problem కాదు.. ఒక process
👉 ఇది laziness కాదు.. ఒక recovery phase
ఇన్ని రోజులుగా పిల్లలు తమ భావాలను పక్కన పెట్టి, ఒక disciplineలో ఉన్నారు.
ఇప్పుడు వాళ్లు కాస్త రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మనం ఈ దశను అర్థం చేసుకోకుండా స్పందించినప్పుడు.. తెలియకుండానే కొన్ని చిన్న తప్పులు చేస్తాం.
ఉదాహరణకు:
- “ఇంత ఖాళీగా ఎందుకు ఉన్నావ్?” అని తరచూ అడగడం
- వెంటనే కొత్త classesలో enroll చేయడం
- ఇతర పిల్లలతో పోల్చడం
- ఒక్కసారిగా చాలా rules పెట్టడం
ఇవి మనకు సాధారణంగా అనిపించవచ్చు. కానీ పిల్లలకి ఇవి ఇలా వినిపిస్తాయి:
👉 “నువ్వు ఇలా ఉండకూడదు”
👉 “నువ్వు సరిపోవడం లేదు”
అక్కడే వాళ్లు:
- దూరమవ్వడం మొదలుపెడతారు
- చిరాకు చూపిస్తారు
- లేదా పూర్తిగా మూసుకుపోతారు
అందుకే ఇప్పుడే మనము మన ఆలోచనలో ఒక చిన్న మార్పు తెచ్చుకోవాలి. అది ఏంటంటే –
“మీరు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, అని మనం మన పిల్లల తిట్టకుండా, వారి మనసులో ఏం జరుగుతుంది అని మనం ఆలోచించటం”.
అప్పుడే, మన పిల్లల పట్ల మన స్పందన మారుతుంది, వారి ప్రవర్తన కూడా క్రమంగా మారుతుంది.
ఈ సమయంలో మనం ఏమి చేయాలి?
ఈ దశలో పిల్లలకు మార్పు అవసరం లేదు.. మన స్పందన అవసరం.
1. కొంచెం విరామం ఇవ్వండి:
ఇన్ని రోజుల ఒత్తిడి తర్వాత.. పిల్లలకి విశ్రాంతి అవసరం, మరొక లక్ష్యం కాదు. అందుకే వారిని, guilt లేకుండా కొన్ని రోజులు relax అవ్వనివ్వండి. ఈ చిన్న విరామం వాళ్లకి మానసికంగా చాలా అవసరం.
2. ముందుగా సంబంధాన్ని బలపరచండి:
సలహా చెప్పే ముందు.. వాళ్ల మనసులో చోటు సంపాదించండి. వారితో కలిసి మాట్లాడండి, బయటికి వెళ్ళండి, టైం స్పెండ్ చేయండి. అప్పుడే, పిల్లలు ముందుగా “connect” అవుతారు.. తర్వాతే “they listen”, వింటారు.
3. క్రమంగా రొటీన్ తీసుకురండి:
మార్పు బలవంతంగా కాదు.. నెమ్మదిగా వస్తేనే నిలుస్తుంది. ఒక్కసారిగా rules పెట్టడం కాకుండా.. slowly structure introduce చేయండి
4. ఎంపికలు ఇవ్వండి (Offer Choices):
వాళ్లు ఎంచుకున్న దారిలోనే.. వాళ్లు నిజంగా ముందుకు నడుస్తారు. ఇది చేయి, అని చెప్పడం కంటే.. ఏది చేయాలని అనుకుంటున్నావ్? అని అడగండి. Hobby, activity.. ఏదైనా వాళ్లే ఎంచుకునేలా చేయండి.
5. స్క్రీన్ టైమ్ మీద సహజమైన హద్దులు పెట్టండి:
నిబంధనలు కాదు.. అర్థం చేసుకుని పెట్టిన హద్దులే ఎక్కువకాలం నిలుస్తాయి.
ముగింపు
పరీక్షలు ముగిశాయి.. కానీ పిల్లల మనసులో జరుగుతున్న ప్రయాణం మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఈ మధ్యలో వాళ్లు కొంచెం మారిపోయినట్టుగా అనిపించవచ్చు..
కానీ నిజానికి వాళ్లు మారడం లేదు..
తమను తాము మళ్లీ సర్దుబాటు చేసుకుంటున్నారు.
ఈ సమయంలో.. వాళ్లకి మరిన్ని సూచనలు/నియమాలు అవసరం లేదు,
“నేను ఎలా ఉన్నా.. మా వాళ్లు నన్ను అర్థం చేసుకుంటారు” అనే భావన అవసరం.
కొన్ని రోజులు వాళ్లు దారి తప్పినట్టుగా అనిపించవచ్చు.. కానీ మనం తొందరపడకుండా, ఒత్తిడి చేయకుండా ఉంటే..
👉 వాళ్లు మళ్లీ తమ దారిలోకి వస్తారు.
పరీక్షలు వాళ్ల మార్కులను మాత్రమే నిర్ణయిస్తాయి.. కానీ ఈ రోజుల్లో మన స్పందన..
👉 వాళ్ల మనసులో ఒక భద్రతను
👉 ఒక నమ్మకాన్ని
👉 ఒక బలమైన సంబంధాన్ని నిర్మిస్తుంది.
అదే.. వారి జీవితంలో అసలు విజయం.
(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)
ఐ.పి. సుహాసిని గారు కిడ్స్ అండ్ పేరెంట్స్ లైఫ్ కోచ్‌గా పని చేస్తున్నారు. చైల్డ్ సైకాలజిస్ట్. పేరెంటింగ్ బ్లాగర్, యూట్యూబర్. పేరెంట్స్ కోసం వాట్సప్‌లో ఒక ఫ్రీ కమ్యూనిటీ నడుపుతున్నారు. ఆ కమ్యూనిటీ లింక్ Simplified Parenting with Suhasini. వారిని mommyshravmusings@gmail.com అనే మెయిల్ ఐడిలో సంప్రదించవచ్చు.
