[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]
వేసవి సెలవులు: పిల్లలకు నిజంగా అవసరమైన విశ్రాంతి ఏమిటి?
పరీక్షలు అయిపోయాయి.. ఇంట్లో, ఉదయాన్నే అలారం మోగడం లేదు.. “లేట్ అయింది త్వరగా లేవు!” అనే మాటలు తగ్గిపోయాయి.. టైమ్ టేబుల్స్, revisions, last-minute tension అన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి.
మనకు ఒక చిన్న ఊపిరి వచ్చినట్టే అనిపిస్తుంది. హమ్మయ్య! ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుతారు పిల్లలు, అని సరదా పడతాము. కానీ.. కొన్ని రోజులకే మనలో మరేవో ఆలోచనలు మొదలవుతాయి:
- “ఇంత ఫ్రీగా ఉండటం సరేనా?”
- “ఏదైనా క్లాస్‌లో జాయిన్ చేయాలా?”
- “ఇలా టైమ్ వృథా అవుతుందేమో?”
ఎందుకంటే మన పిల్లలు
- ఎక్కువగా నిద్రపోతున్నారు
- మొబైల్లో ఎక్కువ టైమ్ గడుపుతున్నారు
- సినిమాలు స్నేహితులతో ఔటింగు అంటూ టైమ్ అంతా గడిపేస్తున్నారా?
వేసవి సెలవులు అంటే ఇంతేనా అని, మనలో ఒక చిన్న అసహనం కూడా వస్తుంది. అప్పుడే మనం ఒకసారి ఆగి ఆలోచించాల్సింది ఏమిటంటే:
👉 “విశ్రాంతి అంటే అసలు ఏమిటి?”
👉 “పిల్లలకు నిజంగా అవసరమైన విశ్రాంతి మనం ఇస్తున్నామా?” అని.
విశ్రాంతి అంటే ఖాళీ సమయం కాదు.. మనసుకు ఊపిరి
మనలో చాలా మందికి విశ్రాంతి అంటే, ఖాళీగా ఉండటం, చదవకుండా ఉండటం, టీవీ లేదా మొబైల్ చూడటం, నిద్రపోవటం, మొదలగునవి చేయటం.
కానీ పిల్లలకి నిజమైన విశ్రాంతి అంటే ఇవి కాదు.
వాళ్లు ఇన్ని రోజులుగా ఒక పరీక్షలు అనే ఒక ప్రెషర్‌లో ఉన్నారు. ఎందుకంటే, వాళ్లు పరీక్షల సమయంలో ఒక్క performance mode లో ఉంటారు. వాళ్ల భావాలు, ఆలోచనలు, అలవాట్లు.. అన్నీ ఒక లక్ష్యం చుట్టూనే తిరుగుతాయి. కానీ పరీక్షలు పూర్తయ్యాక.. ఆ ఒత్తిడి ఒక్కసారిగా వదిలిపోతుంది, వారి మనసు relax అవ్వడానికి ప్రయత్నిస్తుంది. అందుకే, వారికి నిజమైన విశ్రాంతి అంటే..
- ఒత్తిడి లేకుండా ఉండటం
- ఎవరి అంచనాలు లేకుండా ఉండటం
- తమకు నచ్చిన విధంగా ఉండగలగటం.
విశ్రాంతి అంటే ఖాళీగా ఉండటం కాదు.. మన మనసు, మైండ్ మళ్లీ రిలాక్స్ అయ్యే సమయం.
నిజమైన విశ్రాంతి ఎలా కనిపిస్తుంది?
పరీక్షలు అయిపోయాక.. మన పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులు చూసి మనకి కొంచెం confusion వస్తుంది.
- ఇంతగా నిద్రపోతున్నాడు?
- రోజంతా ఏమీ చేయడం లేదు?
- మొబైల్ లోనే ఉన్నాడు?
అప్పుడు మనకి అనిపిస్తుంది..
“ఇది నిజంగా విశ్రాంతి తీసుకోవటమేనా లేదు ఇది లేజినెస్ కాదు కద?” అని.
కానీ.. ఇక్కడే మనం ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలి.
పిల్లలు ఇలా behave చేయడం.. problem కాదు, అది ఒక process అని. ఇన్ని రోజులుగా వాళ్లు ఒక pressureలో ఉన్నారు. “బాగా రాయాలి”, “తప్పు చేయకూడదు”, “ఎలా వస్తాయో marks?” అనే ఆలోచనలతో వాళ్ల మనసు బిజీగా ఉంది.
ఇప్పుడు ఒక్కసారిగా ఆ ఒత్తిడి తగ్గింది. అప్పుడు ఏమవుతుంది అంటే..
- కొందరు పిల్లలు నిశ్శబ్దంగా ఉంటారు
- కొందరు చిరాకు చూపిస్తారు
- ఇంకొందరికి ఏదీ చేయాలనిపించదు
ఇది laziness కాదు..ఇది emotional release
ఉదా:
ఒక రోజు మీరు చాలా busyగా, stressful గా గడిపారు అనుకోండి.
అన్ని పనులు పూర్తయ్యాక.. ఇంటికి వచ్చాక మీకు ఏం చేయాలనిపిస్తుంది?
- కాసేపు కూర్చోవాలని
- ఎవ్వరూ disturb చేయకుండా ఉండాలని
- may be phone scroll చేయాలని
కాని, అప్పుడు ఎవరో వచ్చి:
“ఇలా కూర్చోకుండా ఏదైనా productiveగా చేయి” అంటే.. ఎలా అనిపిస్తుంది?
అదే feeling ఇప్పుడు పిల్లలకి కూడా ఉంటుంది.
ఇంకో విషయం.. పరీక్షలు కేవలం చదువు కాదు.. అవి (పరీక్షలు) మెంటల్‌గా వాళ్ళని చాలా డ్రైన్ చేస్తాయి ఎందుకంటే బ్రెయిన్ చాలా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంది చదవటంలో. అందుకే పరీక్షలు తర్వాత వాళ్ళు ఎక్కువ నిద్రపోవచ్చు, లేదా, ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చోవచ్చు. ఇది time waste కాదు.. recovery.
ఇంకా.. పిల్లల మనసులో ఒక చిన్న thought కూడా ఉంటుంది. నేను, ఇన్ని రోజులు కష్టపడ్డాను.. ఇప్పుడు కాస్త నా లాగా ఉండాలి అని. అందుకే వాళ్లు:
- lateగా లేస్తారు
- randomగా ఏదో చేస్తారు
- plan లేకుండా రోజును గడుపుతారు
ఇది మనకి oddగా అనిపించవచ్చు.. కానీ వాళ్లకి ఇది చాలా అవసరం.
ఎందుకంటే అదే సమయంలో మన పిల్లలు
- ఒక funny video చూసి నవ్వుతున్నారు
- ఒక gameలో enjoy అవుతున్నారు
- లేదా YouTube లో ఏదో కొత్త విషయం చూస్తున్నారు
మనకి ఇది “time waste” లా కనిపించవచ్చు.. కానీ నిజానికి అక్కడ – వాళ్ళ మైండ్ రిలాక్స్ అవుతోంది, పైగా స్ట్రెస్ కూడా రిలీజ్ అవుతుంది.
కొన్ని రోజుల తర్వాత అదే పిల్లలు నేను కొత్తగా వేరే హాబీస్ నేర్చుకోవాలి, లేదు, ఏదైనా కోర్సు చేయాలి, లేదా, స్పోర్ట్స్ ఆడడం స్టార్ట్ చేయాలి అని మన దగ్గరికి వచ్చి చెప్పటం మొదలు పెడతారు.
ఇక్కడ ఏమి జరిగింది అంటే..
విశ్రాంతి → clarity → కొత్త ఆసక్తి
అందుకే.. నిజమైన విశ్రాంతి ఎలా కనిపిస్తుంది అంటే:
- ఒక రోజు ఏమీ చేయకుండా గడపడం
- ఎక్కువగా నిద్రపోవడం
- చిన్న చిన్న విషయాల్లో ఆనందపడటం
- familyతో casualగా టైమ్ గడపడం
ఇవి మనకి చిన్న విషయాల్లా అనిపిస్తాయి. కానీ ఇవే, వారి స్ట్రెస్‌ని హీల్ చేసి మైండ్‌ని రిలాక్స్ చేసి వాళ్లలో క్రియేటివిటీకి కొత్త సీడ్స్ వేస్తాయి.
అందుకే.. మనం చూసే behavior ని వెంటనే judge చేయకుండా..
“ఇది సరైనదేనా?” అని కాకుండా..
“ఇది వాళ్లకు ఇప్పుడు అవసరమా?” అని ఆలోచిస్తే..
మన స్పందన కూడా మారుతుంది.. వాళ్ల ప్రవర్తన కూడా నెమ్మదిగా సర్దుకుంటుంది.
ఈ సమయంలో తల్లిదండ్రులు ఏమి చేయాలి?
ఈ దశలో పిల్లలకు పెద్ద మార్పులు అవసరం లేదు.. మన స్పందనలో చిన్న మార్పులు చాలు. ఎందుకంటే.. పిల్లలు ఈ సమయంలో మన మాటలు కంటే.. మన tone, patience, acceptance ని ఎక్కువగా feel అవుతారు.
ఇన్ని రోజులుగా వాళ్లు ఒక ఒత్తిడిలో ఉన్నారు.. ఇప్పుడు ఆ ఒత్తిడిని వదిలి కాస్త సర్దుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే.. వాళ్లు కొంచెం slowగా ఉండటం,
ఏమీ చేయాలనిపించకపోవడం..
ఇవి సమస్యలు కాదు.. ఇవి recovery యొక్క సంకేతాలు.
మనము ఈ దశను అంగీకరించినప్పుడు.. వాళ్లు కూడా guilt లేకుండా relax అవగలుగుతారు.
కొన్ని రోజులు ఇలా గడిచిన తర్వాత.. వారికే సహజంగానే అనిపిస్తుంది:
ఇప్పుడేమైనా కొత్తగా మొదలుపెట్టాలా అని?
అప్పుడే వారి మీద మన అభిప్రాయాలు రుద్దకుండా వారిని పుష్యకుండా వాళ్ళని క్యూరియాసిన్ మెల్లగా వెలికి తీయాలి
ఉదా:
👉 “ఈ సెలవుల్లో ఏదైనా try చేయాలని అనిపిస్తుందా?”
👉 “నువ్వు ఎప్పటినుంచో నేర్చుకోవాలని అనుకున్నది ఏదైనా ఉందా?”
అని ఒక casual conversationలో అడిగితే.. మొదట వెంటనే answer రాకపోవచ్చు.
కానీ.. కొన్ని రోజుల్లో వాళ్లే:
👉 ఒక hobby గురించి
👉 ఒక activity గురించి
👉 ఒక కొత్త ఆసక్తి గురించి
చెప్పడం మొదలుపెడతారు. అది చాలా సహజంగా జరిగిపోతుంది. ఎందుకంటే..
మనము వారికి pressure ఇవ్వలేదు.. space ఇచ్చాం.
ముగింపు
వేసవి సెలవులు.. పిల్లలను busyగా ఉంచడానికి ఉన్న సమయం కాదు.. వాళ్లు కాస్త నెమ్మదిగా జీవితం ఆస్వాదించే సమయం.
ఈ మధ్యలో.. మనము కాస్త సహనం చూపించి, వాళ్లను వాళ్లలా ఉండనివ్వగలిగితే..
నెమ్మదిగా వాళ్లలో:
👉 ఉత్సాహం తిరిగి వస్తుంది
👉 ఆసక్తి మళ్లీ మేల్కొంటుంది
👉 కొత్త విషయాలు నేర్చుకోవాలనే కోరిక పెరుగుతుంది
ఎందుకంటే..
విశ్రాంతి ఇచ్చినప్పుడు మాత్రమే.. పిల్లలలో నిజమైన ఆసక్తి పుడుతుంది.
(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)
ఐ.పి. సుహాసిని గారు కిడ్స్ అండ్ పేరెంట్స్ లైఫ్ కోచ్‌గా పని చేస్తున్నారు. చైల్డ్ సైకాలజిస్ట్. పేరెంటింగ్ బ్లాగర్, యూట్యూబర్. పేరెంట్స్ కోసం వాట్సప్‌లో ఒక ఫ్రీ కమ్యూనిటీ నడుపుతున్నారు. ఆ కమ్యూనిటీ లింక్ Simplified Parenting with Suhasini. వారిని mommyshravmusings@gmail.com అనే మెయిల్ ఐడిలో సంప్రదించవచ్చు.
