Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-57

[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]

గాడ్జెట్ అలవాటును తగ్గించి పిల్లలను సృజనాత్మక దారిలోకి ఎలా తీసుకెళ్లాలి?

వేసవి సెలవులు మొదలయ్యాక మొదటి కొన్ని రోజులు చాలా ఉత్సాహంగా గడుస్తాయి కదా.. లేట్‌గా లేవడం, ఎలాంటి టెన్షన్ లేకుండా గడపడం, చిన్న చిన్న ప్లాన్లు..

కానీ కొద్ది రోజులు గడిచాక.. ఒక చిన్న మార్పు మనకు కనిపించడం మొదలవుతుంది.

అదే మన పిల్లల చేతుల్లోని ఫోను లేదు ట్యాబ్. 10 నిమిషాలు అంటూ మన పిల్లలు చేతిలోకి తీసుకున్న మొబైల్ లోనే వాళ్ళు గంటలు గంటలు కూర్చుని పోవడంతోని మనకి ఒక చిన్న ఆందోళన మొదలవుతుంది. అదే, మన పిల్లలు ఇలా మొబైల్‌కి ఎడిక్ట్ అయిపోతారా?, సమ్మర్ మొత్తం ఇలాగనే మొబైల్‌తో కాలం గడిపేస్తారా అని?

కానీ ఇక్కడ, సమస్య గాడ్జెట్ కాదు.. ఆ గ్యాప్‌ది.

ఆ గ్యాప్ ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి, రీల్ జీవితానికి రియల్ జీవితానికి మధ్యనుండే గ్యాప్.

అసలు పిల్లలు గాడ్జెట్ ఎందుకు పట్టుకుంటారు?

మనము చాలా ఈజీగా అనేస్తాము, మా పిల్లలు మొబైల్‌కి అలవాటు పడిపోయారు అని. కానీ ఎవరైనా ఎందుకు మీ పిల్లలు మొబైల్‌కి ఎందుకు అలవాటుపడిపోయారు అని అడిగితే, ఏం సమాధానం చెప్పాలో తెలీదు కదా! అందుకే కొంచెం లోతుగా ఈ ప్రాబ్లమ్ లోకి తరిచి చూస్తేమన పిల్లలకి:

గాడ్జెట్ వాళ్లకి ఒక easy option అవుతుంది. అది వారికి entertainment మాత్రమే కాదు.., కొన్ని సందర్భాల్లో అది వాళ్లకి ఒక companion కూడా అవుతుంది.

ఒక చిన్న మాట:

పిల్లలకు గాడ్జెట్ మీద ప్రేమ కంటే.. ఖాళీ సమయం మీద భయం ఎక్కువ.

అందుకే వాళ్ళు ఎక్కువ సమయం మొబైల్లో గడపటానికి ఎక్కువ ఇష్టపడతారు.

అప్పుడు చాలామంది తల్లిదండ్రులు చేసే మొట్టమొదటి పని ఏంటంటే, ఇకపైన ఫోన్ లేదు నీకు అని చెప్పటం. వాళ్ల చేతుల్లోని ఫోన్ లాక్కోవడం, ఇంకా గేమ్స్ వద్దు, అని గట్టిగా చెప్పటం మొదలైనవి చేస్తాము. మనం అలా చెప్పినప్పుడే.. పిల్లలలో resistance పెరుగుతుంది.

అందుకే, Restriction కంటే Replacement ఎక్కువ పనిచేస్తుంది.

మన పిల్లల చేతుల్లోని మొబైల్ లేదు గాడ్జెట్‌ని మనం ఎలా రీప్లేస్ చేయాలి అంటే, కొన్ని చిన్నవి కానీ ప్రభావంతమైన ఈ క్రింది మార్పులు చూద్దాం:

1. ముందుగా.. గాడ్జెట్‌ను villain చేయకండి:

చాలా సార్లు మనం ఇలా అంటాం: “ఈ ఫోన్‌ వల్లే నీకు ఇలా అవుతోంది!”,

“ఈ గేమ్స్ నిన్ను పాడుచేస్తున్నాయి!” మొదలగునవి. కానీ, మన పిల్లలు

నేను ఇష్టంగా ఏది చేసినా మా తల్లిదండ్రులు నన్ను తప్పు పడతారు అని అర్థం చేసుకుంటారు.

అందుకే, “నువ్వు ఈ game ని enjoy చేస్తున్నావని నాకు తెలుసు.. కానీ ఇంకొన్ని fun things కూడా try చేద్దామా?” అని అడగండి.

దానితో మనము మన పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నామంటే:

“నేను నిన్ను అర్థం చేసుకుంటున్నాను.. నేను నిన్ను ఆపడం కాదు, guide చేస్తున్నాను.”

2. స్క్రీన్ టైమ్‌కి బదులుగా ‘ఫన్ టైమ్’ ఇవ్వండి:

పిల్లలు ఫోన్ వదిలాలి అంటే దానికంటే మీరు మంచి ఫన్ అయినా ఆప్షన్‌ని ఇవ్వాలి.

ఉదా:

ఒక అమ్మ తన కూతురు ఫోన్ వదలక పోతే మనిద్దరం కలిసి ఐస్‌క్రీమ్ చేసుకుందామా లేదు కేక్ బేక్ చేసుకుందామా అని అడిగింది.

మొదట వాళ్ళ పాప ఇష్టం చూపెట్టకుండా కొంచెం సందేహపడ్డా, కొన్ని రోజులకి ఫోన్లో కంటే కిచెన్‌లో ఆ పాప స్పెండ్ చేసే టైం ఎక్కువైంది.

👉 Tip: Fun replace చేస్తే.. screen naturally తగ్గుతుంది.

3. పిల్లలతో కలిసి ప్లాన్ చేయండి (impose చేయొద్దు)

తల్లితండ్రులుగా మనకి ఇది మంచిది మన పిల్లలు ఇది చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ పిల్లలకి choice లేకపోతే.. interest కూడా ఉండదు.

ఉదా:

“ఇప్పటి నుండి daily drawing చేయాలి” అని చెప్పడం కంటే..

“ఈ weekలో ఏం try చేద్దాం? drawing, dance, cooking?” అని అడిగితే..

వాళ్లు choose చేస్తారు → వాళ్ల ownership పెరుగుతుంది.

👉 Tip: పిల్లలు follow అవ్వడం కాదు.. involve అవ్వడం మొదలవుతుంది.

4. మీరు కూడా example అవ్వాలి:

ఇది చాలా subtle కానీ powerful. మీరే ఒక చేతిలో ఫోన్ పట్టుకొని, నోటితో నువ్వు ఫోన్ వదిలేయ్ అని పిల్లలకు చెప్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు.

ఉదా:

ఒక నాన్న dinner timeలో phone side కి పెట్టి.. “ఇది family time” అని చెప్పడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులకు.. పిల్లలు కూడా అదే follow అయ్యారు.

👉 Tip: పిల్లలు మన మాటలు కాదు.. మన habits copy చేస్తారు.

5. చిన్న మార్పులతో మొదలు పెట్టండి:

ఒకే రోజు మీ పిల్లలు మారాలి అనుకుంటే, అది మీకు, మీ పిల్లలకి, ఇద్దరికీ చాలా స్ట్రెస్ అయిపోతుంది.

ఉదా:

రోజుకు 3 గంటలు phone వాడుతున్న పిల్లకి, “ఇప్పటి నుండి 30 minutes మాత్రమే” అంటే.. frustration వస్తుంది.

దాని బదులు.. 3 గంటలు → 2.5 గంటలు → 2 గంటలు.. ఇలా slowly తగ్గిస్తే అది sustainable అవుతుంది.

👉 Tip: parentingలో consistency small stepsలోనే ఉంటుంది.. big jumpsలో కాదు.

6. Connection ముందుగా.. correction తర్వాత:

చాలా సార్లు మనం direct correctionకి వెళ్తాం – “ఇది చేయొద్దు.. అది చేయొద్దు..” అని. కానీ పిల్లలకి ముందుగా కావాల్సింది – connection.

ఉదా:

పిల్ల phoneలో game ఆడుతున్నాడు.. అమ్మ వచ్చి వెంటనే –  “పెట్టేయ్!” అంటే resistance.

కానీ.. “ఏ game ఆడుతున్నావు?” అని అడిగి, కొంచెం time spend చేసి, తర్వాత – “ఒక 10 నిమిషాల్లో wrap చేద్దామా?” అంటే, అది accept చేయడం easy అవుతుంది.

👉 Tip: ఎందుకంటే.. connection ఉన్న చోట correction smoothగా జరుగుతుంది.

ఈ మొత్తం processలో మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే –

పిల్లలు గాడ్జెట్ని వదలాలి అని కాదు.. వాళ్లు జీవితం వైపు ఆకర్షితులు కావాలి.

మన presence.. మన patience.. మన చిన్న ప్రయత్నాలు.. ఇవే వాళ్లలో పెద్ద మార్పులు తీసుకువస్తాయి.

పిల్లలను సృజనాత్మక దారిలోకి తీసుకెళ్లే 5 మార్గాలు:

ఇక్కడ main goal.. గాడ్జెట్ తీసేయడం కాదు.. దృష్టిని మళ్లించడం.

1. Interest-based activities గుర్తించండి:

ప్రతి పిల్లాడికి ఒక natural interest ఉంటుంది. అది drawing, music, dancing, storytelling, building..ఏదైనా కావచ్చు. మనం కొంచెం observe చేస్తే కనిపిస్తుంది.

ఉదా:

“అమ్మ, నేను bored..” అంటే, “ఒక కొత్త drawing try చేద్దామా?” అని నెమ్మదిగా వారి దృష్టి మరలచడానికి ప్రయత్నం చేయండి.

2. ‘Boredom’ని allow చేయండి:

ఇది చాలా powerful step. పిల్లలు bored అయిన వెంటనే phone ఇస్తే..

వాళ్లు boredom handle చేయడం నేర్చుకోరు. కానీ కొంచెం సమయం ఇచ్చినప్పుడు.. వాళ్ల brain కొత్త ideas వెతుక్కుంటుంది.

Creativity చాలా సార్లు boredom నుంచే పుడుతుంది.

3. Family time → gadget replacement

పిల్లలు gadgetsని ఇష్టపడటానికి ఒక కారణం, అది వాళ్లకి fun ఇస్తుంది.

అదే fun మనం create చేయగలిగితే?

ఉదా:

ఇవి activities మాత్రమే కాదు.. connection moments.

4. Mini goals & challenges ఇవ్వండి:

పిల్లలు ఛాలెంజెస్‌ని చాలా ఇష్టపడతారు. కాబట్టి వారికి చిన్న చిన్న ఛాలెంజెస్ ఇవ్వడం మొదలెట్టండి.

ఉదా:

ఇవి వాళ్లలో excitement create చేస్తాయి. ఇవి వాళ్లలో ఎక్సైజ్మెంట్ పుట్టించడంతో పాటు వాళ్ళని క్రిటికల్‌గా, క్రియేటివ్‌గా థింక్ చేయడానికి కూడా తోడ్పాటు అందిస్తాయి.

5. Real-life exposure ఇవ్వండి:

Screen బయట కూడా ఒక beautiful world ఉంది అని చూపించాలి.

ఉదా:

ఇవి పిల్లల imagination‌ని, emotional bonding‌ని పెంచుతాయి.

ముగింపు

గాడ్జెట్ అలవాటు తగ్గించడం.. ఒకరోజులో జరిగే పని కాదు. అది ఒక slow.. mindful.. patient process.

పిల్లలు మనం చెప్పింది వినరు.. మనము ఎలా జీవిస్తున్నామో చూస్తారు.

మన సమయం, మన శ్రద్ధ, మన ప్రేమ.. ఇవే వాళ్లకి అసలు అయినా ఆల్టర్నేటివ్.

చివరగా..

“పిల్లల్ని గాడ్జెట్ నుండి దూరం చేయడం కాదు.. జీవితం వైపు దగ్గర చేయడం ముఖ్యము.”

(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)

Exit mobile version