[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]
పిల్లలకు సెలవులు వచ్చాయి.. కానీ పేరెంట్స్‌కి పరీక్షలు మొదలయ్యాయా?
పిల్లల చివరి పరీక్ష ముగిసిన రోజు ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది.
స్కూల్ బ్యాగ్ ఒక్క మూలకు వెళ్లిపోతుంది. షూస్, బుక్స్ అన్నీ ఎక్కడో ఒక మూలలో పడిపోతాయి. అలారంలు మూగపోతాయి. పిల్లల ముఖాల్లో ఆనందం, ఊపిరి పీల్చుకున్న భావం.
“అబ్బా ఫైనల్‌గా సెలవులు వచ్చేశాయి!” అని వాళ్లు సంబరపడుతుంటే, చాలామంది పేరెంట్స్ మనసులో టెన్షన్ పడుతూ లెక్కలు వేసుకుంటూ ఉంటారు. “ఎలా పిల్లలని ఎంగేజ్ చేయాలి?” అని.
రోజంతా పిల్లలు ఇంట్లో ఉంటారు, కదా! వారికి,
- Screen time ఎలా తగ్గించాలి?
- పిల్లలకి బోర్ కొట్టకుండా ఎలా ఎంగేజ్ చేయాలి?
- రోజూ బయటకు తీసుకెళ్లాలా?
- చదువు మర్చిపోతారేమో?
- వర్కింగ్ అయితే ఇంట్లోంచి మీటింగ్స్ ఎలా అటెండ్ అవ్వాలి పిల్లల్ని ఎలా మానేజ్ చేయాలి ఆ టైంలో? మొదలగునవి.
అంటే.. పిల్లలకు సెలవులు మొదలైతే, చాలా పేరెంట్స్‌కి కొత్త పరీక్షలు మొదలవుతాయి. కానీ ఒక నిజం చెప్పాలంటే, ఈ పరీక్షలో మార్క్స్ ఉండవు, పాస్ లేదా ఫెయిల్ అవ్వటం ఉండదు. మెమరీస్ మటుకు బోలెడన్ని ఉంటాయి. పేరెంట్స్‌లో పేషన్స్ (సహనం) పెరుగుతుంది, కుటుంబంలోని అనుబంధాలు దృఢ పడతాయి.
సెలవులు ఎందుకు పేరెంట్స్‌కి చాలెంజిగా అనిపిస్తాయి?
స్కూల్ ఉన్న రోజుల్లో మనకి ఒక డైలీ రొటీన్ అన్నది ఉంటుంది. ఉదయం లేవడం, సిద్ధం కావడం, స్కూల్‌కి వెళ్లటం, రాంగానే హోం వర్క్ చేసుకొవటం, కాసేపు ఆటలు, డిన్నర్ తినటం, తర్వాత పడుకోవటం.
కానీ సెలవులు రావడంతోనే ఒక్కసారిగా ఆ డైలీ రొటీన్ మొత్తం మారిపోతుంది. ఉదయం ఆలస్యంగా లేవడం, రాత్రి లేట్‌గా పడుకోవడం, “అమ్మా బోర్ కొడుతోంది.., మొబైల్ ఇవ్వమని” అని రోజుకు పది సార్లు అడగటం, ఫ్రిడ్జ్ తలుపు ఐదు నిమిషలకి ఒక్కసారి తెరవడం, Siblings fights, TV remote కోసం యుద్ధాలు, మొదలగునవి పేరెంట్స్ యొక్క సహనాన్ని పరీక్షిస్తాయి. తలనొప్పులు తెప్పిస్తాయి. అందుకే, వాళ్ళు ఒక్కోసారి స్కూల్ ఉన్నప్పుడే బాగుండేది అని కూడా అనుకుంటూ ఉంటారు.
అసలు పరీక్ష పిల్లలది కాదు.. పేరెంట్స్ emotional balance ది
చాలామంది పేరెంట్స్ సెలవులు వచ్చాయంటే వెంటనే వాటిని ఒక project లా తీసుకుంటారు. ఈ రెండు నెలల్లో పిల్లలతో ఏదో గొప్పది చేయించాలి.. ఏదో కొత్త skill నేర్పించాలి.. ఏదో special progress కనిపించాలి అని ఆలోచించడం మొదలుపెడతారు. అందుకే,
- Swimming class పెట్టాలా?
- Coding class join చేయాలా?
- Handwriting improve చేయాలా?
- Summer camp కి పంపాలా?
- రోజూ కొంత చదివించాలా?
అని ప్లానింగ్ మొదలుపెడుతారు. ఇవన్నీ తప్పు కాదు, మంచివే. కానీ సెలవులు అంటే productivity season మాత్రమే కాదు అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి.
నిజానికి ఈ సెలవుల్లో పరీక్ష పిల్లలది కాదు.. పేరెంట్స్ emotional balance ది. పిల్లలు ఇంట్లో ఎక్కువసేపు ఉంటారు. కొంచెం అల్లరి చేస్తారు. కొన్నిసార్లు వినరు. కొన్నిసార్లు బోర్ కొడుతోంది అంటారు. ఇంకొన్ని సార్లు siblings తో గొడవపడతారు. అప్పుడు మన patience, మన స్పందన, మన expectations అన్నవే పరీక్షకు వస్తాయి.
ఇలాంటి సమయంలో parents గా మనం నేర్చుకోవాల్సింది control కాదు.. calmness. perfection కాదు.. flexibility. anger కాదు.. understanding.
ఎందుకంటే పిల్లలు పెద్దయ్యాక ఈ సెలవుల్లో ఎన్ని worksheets చేశారో గుర్తు పెట్టుకోరు. కానీ అమ్మ నవ్వుతూ మాట్లాడిందా.. నాన్న సమయం ఇచ్చాడా.. ఇంట్లో ఆనందంగా feel అయ్యామా అన్నది మాత్రం జీవితాంతం గుర్తుంచుకుంటారు.
అందుకే సెలవులను పిల్లల performance time గా కాకుండా.. family bonding time గా చూడగలిగితే, ఈ పరీక్షలో గెలిచేది మొత్తం కుటుంబమే.
చాలామంది Parents చేసే Common Mistakes
పేరెంటింగ్ కోచ్‌గా నేను వివిధ దేశాల్లో ఉన్న పేరెంట్స్‌తో మాట్లాడినప్పుడు, వాళ్లు ఫేస్ చేస్తున్న డైలీ స్ట్రగుల్స్ గురించి చెప్పినప్పుడు ఒక విషయం స్పష్టంగా కనిపించింది. దేశం మారొచ్చు, భాష మారొచ్చు, లైఫ్ స్టైల్ మారొచ్చు.. కానీ సెలవులు వచ్చినప్పుడు పేరెంట్స్ ఎదుర్కొనే చాలెంజెస్ మాత్రం చాలా వరకు ఒకేలా ఉంటాయి.
అందరు ప్రేమతోనే చేస్తుంటారు.. పిల్లలకు మంచిదే కావాలని అనుకుంటారు.. కానీ తెలియకుండానే కొన్ని common mistakes జరుగుతుంటాయి. అవే తర్వాత unnecessary stress, fights, guilt కి కారణమవుతాయి.
ఉదా:
- ప్రతి గంటని activities తో నింపేయడం,
- రోజంతా scolding mode లో ఉండడం,
- ఇతర పిల్లలతో compare చేయడం,
- mobile ఇచ్చి పూర్తిగా వదిలేయడం,
- social media చూసి perfect summer create చేయాలని pressure పడటం,
- “నేను . disturb చేయొద్దు” అని పదే పదే చెప్పడం
వంటి విషయాలు సెలవులను ఆనందంగా కాకుండా అలసటగా మార్చేస్తాయి. మంచి విషయం ఏమిటంటే.. ఇవి common mistakes మాత్రమే, permanent problems కావు. కొంచెం awareness ఉంటే చాలానే మార్పు తీసుకురావచ్చు.
మరి ఎలా handle చేయాలి?
సెలవులు అంటే stress season కావాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మార్పులు చేస్తే, ఇదే సమయం కుటుంబానికి ఎంతో అందమైన bonding season అవుతుంది. Perfect planning అవసరం లేదు.. practical planning చాలు. పిల్లలను రోజంతా entertain చేయాల్సిన అవసరం లేదు.. emotionally connect అయితే చాలాసార్లు వాళ్లు స్వయంగా settle అవుతారు.
1. ఒక simple routine create చేయండి
Military timetable అవసరం లేదు.
ఉదయం లేవడం
Fresh అయ్యడం
Breakfast
కొంత active play
Lunch
Quiet time
Evening outdoor/family time
Night wind down
పిల్లలకు predictability ఉంటే behaviour కూడా better ఉంటుంది.
2. Boredom ని శత్రువుగా చూడొద్దు
పిల్లాడు “bore కొడుతోంది” అంటే వెంటనే activity ఇవ్వాల్సిన అవసరం లేదు.
కొంచెం bore అయితేనే వాళ్లు కొత్తగా ఆలోచిస్తారు. Creativity చాలా సార్లు boredom నుంచి వస్తుంది.
3. రోజుకు ఒక connection ritual పెట్టండి
ఇది చాలా powerful.
ఉదాహరణకు:
- Evening 15 minutes terrace talk
- Dinner తర్వాత family walk
- Bedtime gratitude chat
- Tea time తో చిన్న gossip time
పిల్లలకు expensive outings కంటే consistent presence ఎక్కువగా నచ్చుతుంది.
4. Screen rules ముందే decide చేయండి
రోజూ fight కాకుండా ముందే clear చేయండి.
ఉదా:
- Lunch తర్వాత 1 hour screen
- Homework/reading తర్వాత cartoon
- Night 1 hour ముందు gadgets off
Rule calm గా ఉంటే resistance కూడా తక్కువగా ఉంటుంది.
5. ఇంటి పనుల్లో involve చేయండి
మీ పిల్లలకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి.
ఉదా:
- మొక్కలకు నీళ్లు పోయడం
- బట్టలు మడత పెట్టడం
- డిన్నర్‌కి టేబుల్ని సెట్ చేయడం
- కిచెన్‌లో హెల్ప్ చేయటం
- డస్టింగ్ చేయటం
- రూమ్ సర్దటం
దీంతో మీరు మీ పిల్లలకి ఒక లైఫ్‌కి నేర్పించిన వాళ్ళు అవుతారు అంతేకాకుండా డిసిప్లిన్ కూడా నేర్చుకుంటారు.
Working Parents కోసం ప్రత్యేకంగా
చాలామంది వర్కింగ్ పేరెంట్స్ ఉద్యోగం ఇంటి పనులు మిగతా బాధ్యతలు అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవటంలో మనము పిల్లలకి సమయం ఇవ్వలేకపోతున్నామేమో అని, గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి.. పిల్లలకు మీరు రోజంతా పక్కనే ఉండాల్సిన అవసరం లేదు. వాళ్లకు కావాల్సింది 24 గంటల presence కాదు.. రోజూ కొంత నిజమైన, మనస్ఫూర్తిగా ఇచ్చే presence.
రోజులో కేవలం 20 minutes అయినా phone పక్కన పెట్టి వాళ్లతో మాట్లాడండి, వాళ్ల రోజు గురించి అడగండి, నవ్వుతూ వినండి. ఆ చిన్న సమయమే పిల్లలకు ఎంతో పెద్ద gift అవుతుంది. ఎందుకంటే ఆ సమయంలో వాళ్లు మనసులో ఇలా అనుకుంటారు “అమ్మానాన్న నా మాట వింటున్నారు, నన్ను చూస్తున్నారు, నాతో మాట్లాడుతున్నారు, నన్ను అర్థం చేసుకుంటున్నారు” అని ఆ ఫీలింగ్ మీ పిల్లల హృదయాల్లో చాలా కాలం నిలిచిపోతుంది.
ఈ సెలవుల్లో నిజంగా పిల్లలకు కావాల్సింది ఏమిటి?
ఈరోజుల్లో సోషల్ మీడియా చూసిన ప్రతి ఒక్కరికి, తాము తప్ప ప్రపంచంలో మిగతా అందరూ, సమ్మర్‌ని చక్కగా ప్లాన్ చేసి పర్ఫెక్ట్‌గా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఆ పేరెంట్స్ అందరు వారి బెస్ట్ మూమెంట్స్ ని మటుకే షేర్ చేస్తున్నారు అని అర్థం చేసుకోకుండా తాము కూడా ఆ పేరెంట్స్ లాగా తమ పిల్లలకు పర్ఫెక్ట్ సమ్మర్ ఇవ్వాలి అని కొంతమంది పేరెంట్స్ చాలా ఎక్కువ ప్రెషర్ తీసుకుంటున్నారు. కానీ పిల్లలకు నిజంగా కావాల్సింది పర్ఫెక్ట్ సమ్మర్ హాలిడేస్ కాదు, పీస్‌ఫుల్‌గా స్లో గా ఉండే సమ్మర్ హాలిడేస్.
మీ పిల్లలకి పెద్ద పెద్ద ప్లాన్లు, కాస్ట్లీ ఔటింగ్స్, విదేశీ విహారాలు, ఎక్స్పెన్సివ్ హాలిడేస్, అవసరం లేదు. అన్నిటికంటే వాళ్లకు ముఖ్యముగా కావాల్సింది ఇంట్లో దొరికే ప్రశాంతమైన వాతావరణం, తాతయ్య అమ్మమ్మలతో కలిసి గడిపే సమయం, కొంచెం నవ్వులు, కొంచెం ఫ్రీడం, మనతో కలిసి గడిపే కొంచెం క్వాలిటీ టైం. ఇవే వారి మనసుకి ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. అందుకే, ఈ సెలవుల్లో పిల్లలకి ముఖ్యంగా కావాల్సింది, మీ యొక్క సమయము, సహనము, అటెన్షన్ మరియు మీ ప్రెజన్స్.
కాబట్టి, కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుంటే, సెలవులు పిల్లలకే కాదు.. మొత్తం కుటుంబానికి రిఫ్రెష్ అవ్వడానికి రీసెట్ అవ్వటానికి దొరికే ఒక మంచి అవకాశం. అందుకే ఈ సెలవల్లో కొంచెం అల్లరి, కొంచెం హడావిడి, కొంచెం తగువులు, అన్నీ ఉంటాయి. కానీ, వాటన్నిటి మధ్యలో నుంచే మనం జీవితాంతం గుర్తుంచుకునే స్వీట్ మెమరీస్ కూడా పుడతాయి. అందుకే, ఈసారి మిలటరి టైమ్‌టేబుల్ బదులు కలిసి గడపడానికి ప్రాధాన్యతని ఇవ్వండి. అలాగే, కంట్రోల్ కి బదులు కనెక్షన్‌కి, పర్ఫెక్షన్ బదులు మెంటల్ పీస్‌కి ప్రాధాన్యతని ఇవ్వండి. అప్పుడే ఈ సెలవులు పిల్లలకే కాకుండా పేరెంట్స్ అయిన మీకు కూడా ఒక అందమైన అనుభవంగా జ్ఞాపకంగా మిగిలిపోతాయి.
(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)
ఐ.పి. సుహాసిని గారు కిడ్స్ అండ్ పేరెంట్స్ లైఫ్ కోచ్‌గా పని చేస్తున్నారు. చైల్డ్ సైకాలజిస్ట్. పేరెంటింగ్ బ్లాగర్, యూట్యూబర్. పేరెంట్స్ కోసం వాట్సప్‌లో ఒక ఫ్రీ కమ్యూనిటీ నడుపుతున్నారు. ఆ కమ్యూనిటీ లింక్ Simplified Parenting with Suhasini. వారిని mommyshravmusings@gmail.com అనే మెయిల్ ఐడిలో సంప్రదించవచ్చు.
