Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-60

[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]

ఈ ‘మదర్స్ డే’కి అమ్మలు కోరేది గిఫ్ట్ కాదు.. ఇదొక్కటే!

మే నెల వచ్చిందంటే సోషల్ మీడియాలో మదర్స్ డే హడావిడి మొదలవుతుంది.

ఇంటి లోపల కూడా ఒక చిన్నపాటి చర్చలు మొదలవుతాయి. అదే, “ఈసారి అమ్మకి ఏ gift కొనాలి?” అని.

పిల్లలు ఆలోచిస్తారు.. భర్తలు ప్లాన్ చేస్తారు.. కొంతమంది సర్ప్రైజ్ పార్టీలు కూడా అరేంజ్ చేస్తారు.

ఇవన్నీ మంచివే. ప్రేమను వ్యక్తపరచడానికి ఇవి అందమైన మార్గాలే. కానీ, ఒక్కసారి ఆగి మనము మన అమ్మల్ని తను నిజంగా ఏం కోరుకుంటుంది అని అడిగితే?

చాలా అమ్మల మనసులో మాత్రం ఇంకో కోరిక ఉంటుంది. చాలాసార్లు వారు నోరెత్తి చెప్పని కోరిక.

చెప్పాలనుకున్నా.. “పర్లేదు” అని మింగేసే కోరిక.

అది ఒక్కటే. “నన్ను కూడా గుర్తించండి..” అని.

అమ్మల జీవితంలో చాలా పనులు కనిపిస్తాయి. కానీ చాలా శ్రమలు కనిపించవు.

ఇది కేవలం పని కాదు.. ఇది ఎవరికీ కనిపించని కానీ అమ్మల మనసులో నిరంతరం పరిగెత్తే ఒక పెద్ద భారం.

అందుకే వారి శరీరం అలసిపోతుంది, కానీ దానికంటే ముందు మనసు అలసిపోతుంది. అందుకే వారి మనసు నిశ్శబ్దముగా కోరేది ఏంటంటే  “నన్ను కూడా గుర్తించండి..” అని.

ఈ Mother’s Day కి అమ్మలు కోరేది ఏమిటి?

అమ్మలు పెద్దగా ఏమీ కోరుకోవడం లేదు. ఖరీదైన గిఫ్ట్‌లు అవసరం లేదు అలాగే పెద్ద పెద్ద సర్ప్రైజ్‌లు అవసరం లేదు. అమ్మ మనసు సంతోషపడడానికి, చాలాసార్లు చాలా చిన్న విషయాలే సరిపోతాయి. ఒక్కసారి ఆలోచించండి..

ఒక sincere “Thank You” చెబితే:

“అమ్మా.. నువ్వు ఎంత చేస్తున్నావో నాకు తెలుసు” అని చెప్పడం.. ఆ మాట ఆమె రోజంతా అలసటను కరిగిస్తుంది.

కొంతసేపు విశ్రాంతి ఇవ్వడం:

“నువ్వు కూర్చో.. ఇవాళ నేను చూసుకుంటాను” అని చెప్పినప్పుడు.. ఆమెకు అది ఒక పెద్ద ఊరటగా అనిపిస్తుంది.

విమర్శలేని ఒక రోజు ఇవ్వడం:

“ఇది ఎందుకు ఇలా?” “అది ఇంకా కాలేదా?” అనే మాటలకంటే.. ఒక రోజు ప్రశాంతంగా గడిపే అవకాశం ఇవ్వడం.. ఆమెకి చాలా విలువైనది.

మాటల్లో గౌరవం ఇవ్వడం:

అమ్మ చేసే పనికి విలువ ఇచ్చి మాట్లాడితే.. ఆమెకు తన పాత్రపై గర్వంగా అనిపిస్తుంది.

కొంతసేపు కలిసి ఉండడం:

mobile పక్కన పెట్టి.. 10–15 నిమిషాలు ఆమెతో కూర్చొని మాట్లాడితే.. అది ఆమెకి నిజమైన ఆనందాన్ని ఇస్తుంది.

“నువ్వు ఎలా ఉన్నావు?” అని అడగడం:

ఈ ఒక్క ప్రశ్నలోనే ఆమెకు ఒక గుర్తింపు, ఒక ప్రేమ కనిపిస్తుంది.

ఇవి చిన్నవి అనిపించవచ్చు.. కానీ అమ్మ హృదయంలో మాత్రం ఇవే పెద్దగా నిలుస్తాయి.

ఎందుకంటే.. అమ్మకి కావాల్సింది, మనసుతో ఇచ్చిన గుర్తింపు, గౌరవం, ప్రేమ.

పిల్లలు ఇవ్వగలిగే చిన్న కానీ గొప్ప కానుకలు:

పిల్లలు పెద్దగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ప్లాన్ చేసిన surprises అవసరం లేదు. అమ్మను సంతోషపెట్టడానికి చాలాసార్లు చిన్న చిన్న పనులే సరిపోతాయి. ఒక్కసారి ఆలోచించండి..

ఇవి చిన్నవి అనిపించవచ్చు.. కానీ అమ్మ గుండెల్లో మాత్రం ఇవే పెద్దగా నిలుస్తాయి.ఎందుకంటే..

అమ్మకి కావాల్సింది వస్తువులు కాదు..మనసుతో ఇచ్చిన గుర్తింపు, ప్రేమ, సమయం.

కుటుంబానికి ఒక చిన్న మాట:

గిఫ్ట్ ఇవ్వటం, పార్టీకి తీసుకెళ్లడం తప్పు కాదు కానీ గిఫ్ట్‌లు, పార్టీలు ఒకటే సరిపోవు. పూలు వాడిపోతాయి, కేక్ అయిపోతుంది, భోజనం అరిగిపోతుంది. కానీ..

👉 మన మాటల్లో ఉండే గౌరవం,

👉 మన ప్రవర్తనలో కనిపించే ఆదరణ,

👉 మన చేతుల్లో కనిపించే సహాయం..

👉 మీరు పంచుకున్న బాధ్యత

👉 మీరు చూపిన ప్రేమ

ఇవి మాత్రం అమ్మ మనసులో చాలా కాలం నిలుస్తాయి.

ఒకరోజు స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ చేయడం మంచి విషయం. కానీ ప్రతిరోజూ ఆమెతో మాట్లాడే విధానం మరింత ముఖ్యమైనది.

మదర్స్ డే కి మనం గుర్తుంచుకోవాల్సింది ఇదొక్కటే:

అమ్మకి మన ప్రేమ కనిపించాలి..

మన గౌరవం వినిపించాలి..

మన సహాయం అనుభూతి కావాలి.

అమ్మల కోసం ఒక మాట:

చాలామంది తల్లులు తమ కోరికలు మంచివి చెప్పుకోవడానికి కూడా సందేహ పడతారు. వాళ్ల భర్తలతో కాదు కదా పిల్లలతో కూడా చెప్పుకోవడానికి సంశయపడతారు. ఎందుకంటే ఎక్కడ ఇంట్లో వాళ్ళు, మిగతా ప్రపంచము తనని ఒక మంచి తల్లి కాదు అని అనుకుంటారో అన్న ఒక భయంతో.

అందుకే మీరు మీ మనసు విప్పి చెప్పాలి:

మీరు మీ మనసులోని భయాన్ని సందేహాల్ని మీ పిల్లలతో బట్టలతో పంచుకున్నప్పుడే వాళ్లు మీ ప్రయత్నాల్ని, మీరు పడ్డ కష్టాన్ని గుర్తిస్తారు.

ఇలా అడగటము, అనుకోవటము మూలంగా మీరు స్వార్థపరురాలు అవ్వరు, మీరు ఒక చెడ్డ తల్లి కూడా కారు ఎందుకంటే:

👉 మీరు కూడా మనిషే

👉 మీకు కూడా భావాలు ఉన్నాయి

👉 మీకు కూడా care అవసరం

అది అడగడం మీ బలహీనత కాదు.

మదర్స్ డే ఎప్పుడు ఒక రోజుకు మటుకు పరిమితం కాకూడదు:

మదర్స్ డే రోజు మటుకే ఒక కేక్ ఇచ్చి, పూలు ఇచ్చి, ఖరీదైన గిఫ్ట్ లు ఇచ్చేసి, అమ్మని విష్ చేసి హ్యాపీ చేసేస్తే సరిపోదు. అన్ని రోజులు అమ్మని మనము సంతోషంగా ఆప్యాయంగా చూసుకున్నామా లేదా అన్నది ముఖ్యం.

ఎప్పుడైతే మనం మిగతా అన్ని రోజులు అమ్మని తిట్టుకుంటూ చేస్తూ ఉంటే మనము ఆ అమ్మ మన అమ్మలకి కావాల్సినంత విలువ ఇవ్వడం లేదు అని అర్థం చేసుకోవాలి. అందుకే మనం ఈ మదర్స్ డే ని ఒక రిమైండర్‌గా మటుకే చూడాలి.

ఈ కొన్ని ప్రశ్నలు మనల్ని మనం అడగడానికి ఈ మదర్స్ డే మనకు ఒక రిమైండర్‌గా తోడ్పడుతుంది.

ప్రతి ఒక్క అమ్మ తన పిల్లల నుంచి ఆశించేది ఒకటే ఒక ఆప్యాయత కూడిన చిరునవ్వు, తన పక్కన కొంచెం సేపు కూర్చుని కబుర్లు చెప్పటం. అందుకే ప్రతిరోజు మనము మన అమ్మలతో కొంచెం సేపు కలిసి కాలం గడపడం అన్నది అలవాటు చేసుకోవాలి.

ముగింపుగా..

మీరు గుర్తుపెట్టుకోండి ఈ మదర్స్ డే కి ఏ అమ్మ డైమండ్స్ కానీ, ఖరీదైన గిఫ్ట్స్ గాని కోరదు. వారికి కావాల్సింది:

అది ఇస్తే.. వారి కళ్లలో కనిపించే ఆనందం, వెలుగు ఏ గిఫ్ట్ కంటే గొప్పది..

గిఫ్ట్ ని ప్యాక్ చేసే చేతులు కన్నా అమ్మ మనసుని చదివే హృదయాలు ఈ మదర్స్ డే కి ఎక్కువ అవసరం.

(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)

Exit mobile version