Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-61

[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]

ఒకే ఇంట్లో ఉంటూ.. ఒక్కోరు ఒక్కో ప్రపంచంలో ఉన్నామా?

సాయంత్రం 7 గంటలు..

అమ్మ సోఫాపై కూర్చుని ఫోన్‌లో స్క్రోల్ చేస్తోంది, నాన్న ల్యాప్టాప్ ముందు పనిలో బిజీగా ఉన్నాడు.

పిల్లలు వాళ్ళ గదిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఏదో వింటున్నారు/చూస్తున్నారు.

ఇది మనలో చాలా మందికి చాలా పరిచయమైన సీన్ కాదా?

బయటికి చూస్తే.. అందరూ ఒకే ఇంట్లో ఉన్నారు, కానీ నిజంగా వాళ్లు కలిసే ఉన్నారా?

“ఒక కుటుంబంలోని సభ్యుల మధ్య దూరం కిలోమీటర్లలో కాదు.. కనెక్షన్లో కొలవాలి.”

ఇది సమస్యా? లేక న్యూ నార్మల్?

ఇప్పటి డిజిటల్ యుగంలో.. ఇలా ఒక్కోరు ఒక్కో ప్రపంచంలో ఉండటం చాలా కామన్ అయిపోయింది. ఒకే ఇంట్లో ఉన్నా, ప్రతి ఒక్కరి చేతిలో ఒక స్క్రీన్.. ప్రతి ఒక్కరి మైండ్లో ఒక ప్రత్యేక ప్రపంచం. బయటికి చూస్తే ఇది “నార్మల్”గా అనిపించొచ్చు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఇదే సీన్ కనిపిస్తోంది. కాబట్టి మనం కూడా అనుకుంటాం.. “ఇది ఇప్పుడు లైఫ్ స్టైల్ అయిపోయింది” అని.

కానీ ఒక చిన్న ప్రశ్న మనల్ని మనం వేసుకుందామా?

“కలిసి ఉండటం” అంటే ఇప్పుడు చాలాసార్లు physical presence మాత్రమే అయిపోయింది..

emotional presence మాత్రం మెల్లగా తగ్గిపోతుంది. ఒకే సోఫాపై కూర్చుని ఉండటం కాదు.. ఒకరి మనసులో ఇంకొకరు ఉండటం. ఈ “న్యూ నార్మల్”ను అంగీకరించే ముందు, అది మన బంధాలను నెమ్మదిగా దూరం చేస్తున్నదా అనే ప్రశ్న మనం తప్పకుండా ఆలోచించాలి. ఎందుకంటే.. నార్మల్‌గా కనిపించే చాలా విషయాలు, మనకు తెలియకుండా మన కనెక్షన్‌ను బలహీనపరుస్తుంటాయి.

💔 ఎందుకు ఇలా జరుగుతోంది?

మనమంతా ఒకే ఇంట్లో ఉంటూ కూడా.. ఒక్కోరు ఒక్కో ప్రపంచంలోకి వెళ్లిపోవడం ఒక్కరోజులో జరిగే మార్పు కాదు. ఇది మెల్లగా.. చాలా సైలెంట్‌గా జరుగుతుంది. మనకు తెలియకుండానే కొన్ని చిన్న అలవాట్లు, కొన్ని చిన్న మార్పులు.. మన మధ్య ఉన్న కనెక్షన్ని తగ్గిస్తూ ఉంటాయి.

ఇది ఎవరి తప్పూ కాదు..కానీ ఈ మార్పుల్ని గుర్తించకపోతే, దూరం మాత్రం పెరుగుతుంది.

ఇప్పుడు ఆ కారణాలను ఒక్కసారి మనం దగ్గరగా చూసేద్దాం:

1. డిజిటల్ డిస్ట్రాక్షన్:

ఇప్పటి రోజుల్లో ఫోన్ మన చేతిలో ఉండటం కాదు.. మనం ఫోన్ చేతిలో ఉన్నాము అనడం సరైన మాట.

ఒక్కసారి ఆలోచించండి..

మన పిల్లలు ఏదైనా చెప్పడానికి వస్తే, మనం నిజంగా చూస్తున్నామా/ వింటున్నామా?, లేకపోతే.. “ఒక్క నిమిషం” అని చెప్పి స్క్రీన్‌నే చూస్తూ ఉంటామా? అలాగే పిల్లలు కూడా తమ స్క్రీన్‌లలో మునిగిపోతున్నారు.

ఈ చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్.. మెల్లగా “మన మధ్య ఉన్న సంభాషణలను” తగ్గిస్తాయి. మాట్లాడాల్సిన సమయం.. సోషల్ మీడియా స్క్రోలింగ్ లో వెళ్ళిపోతుంది.

2. “నేను బిజీ” అనే కల్చర్

ఈ రోజుల్లో ఒక మాట చాలా కామన్ అయిపోయింది . అదే అందరూ చెప్పేది “టైమ్ లేదు..” అని.

పేరెంట్స్‌కి పని ఇంట్లో బాధ్యతలు..

పిల్లలకి  స్కూల్, ట్యూషన్స్, ఆక్టివిటీస్..

ప్రతి ఒక్కరూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. కానీ ఒక మనము మరిచిన చిన్న నిజం ఏమిటంటే – బిజీగా ఉండటం వల్ల మనం దూరం అవడం కాదు.. కనెక్ట్ అవ్వడానికి టైమ్ కేటాయించకపోవడం వల్ల దూరం అవుతున్నాం.

రోజు మొత్తం బిజీగా ఉన్నా.. ఒక 15 నిమిషాల కనెక్షన్ కూడా లేకపోతే, అది మెల్లగా ఒక గ్యాప్‌గా మారుతుంది.

3. జడ్జ్‌మెంట్ భయం

చాలా పిల్లలు మాట్లాడకపోవడానికి అసలు కారణం ఇది:

“నేను చెప్పితే.. అమ్మ/నాన్న మందలిస్తారు..”

“అర్థం చేసుకోకుండా సలహాలు ఇస్తారు..”

అందుకే వాళ్లు ఒక నిర్ణయం తీసుకుంటారు – “చెప్పకపోవడమే బెటర్.”

ఇది ఒక్కసారిగా జరగదు..

వాళ్లు కొంచెం కొంచెంగా మౌనం ఎంచుకుంటారు.

మనం అనుకుంటాం – “పిల్లలు షేర్ చేయడం లేదు”, కాని, వాళ్లు అనుకుంటారు – “అమ్మ/నాన్న వినడం లేదు”

4. చిన్న చిన్న ఎమోషనల్ గ్యాప్స్

మనకు పెద్ద సమస్యలు కనిపించకపోతే, మన బంధం బాగానే ఉందని అనుకుంటాం.

కానీ నిజానికి..

ఇవి అన్నీ కలిసి..

మధ్యలో ఒక కనిపించని గ్యాప్‌ని సృష్టిస్తాయి. మరి ఆ గ్యాప్ పెరిగిన తర్వాతే మనం గమనిస్తాం.

ఉదాహరణ:

ఒక అమ్మ నా దగ్గరికి వచ్చి చెప్పింది.. “మేడం, నా కొడుకు ముందు చాలా మాట్లాడేవాడు.. ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడుతున్నాడు.”

ఆమె కొడుకుతో మాట్లాడితే అతను చెప్పాడు:

“అమ్మకి టైమ్ ఉండదు.. నేను చెప్పినా వెంటనే సలహాలు ఇస్తుంది, తిడుతుంది కానీ మాట వినదు.” అని.

ఇక్కడ తప్పు ఎవరిది అని ఆలోచిస్తే ఎవరిది కాదు కానీ కనెక్షన్ మటుకు మిస్ అయింది!!

మనమూ ఒక్కో ప్రపంచంలో ఉన్నామనే సంకేతాలు:

కొన్నిసార్లు మనం అనుకుంటాం.. “మన ఇంట్లో అంతా బాగానే ఉంది.. పెద్ద సమస్య ఏమీ లేదు” అని.

కానీ నిజానికి, బంధాలు ఒక్కసారిగా దూరం కావు. అవి చిన్న చిన్న సంకేతాల రూపంలో ముందుగానే మనకు తెలియజేస్తుంటాయి.

మనమవే గమనించకపోతే.. ఒకరోజు “ఎప్పుడు ఇలా దూరం అయ్యాం?” అని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది.

అయితే.. ఆ చిన్న సంకేతాలు ఏమిటి? ఒకసారి మనం చూసేద్దాం.. 👇

ఇవి చిన్న సంకేతాలే.. కానీ పెద్ద గ్యాప్‌కు సూచనలు.

మార్పు ఎక్కడి నుంచి మొదలు కావాలి?

మనమిదంతా చదివిన తర్వాత.. ఒక సహజమైన ప్రశ్న వస్తుంది: “ఇప్పుడు ఏం చేయాలి? ఈ గ్యాప్ను ఎలా తగ్గించాలి?” అని

చాలాసార్లు మనం వెంటనే అనుకుంటాం:

“పిల్లలు మారాలి.., వాళ్లు ఎక్కువగా మాట్లాడాలి..”

కానీ ఒక చిన్న నిజం మనం అంగీకరించాలి.. “మార్పు పిల్లలతో కాదు.. మనతో మొదలు కావాలి.”

ఎందుకంటే..పిల్లలు మనం చెప్పింది కంటే, మనం చేసినదే ఎక్కువగా నేర్చుకుంటారు.

మన behavior, మన స్పందన, మన presence – ఇవే వారి ప్రపంచాన్ని shape చేస్తాయి.

కాబట్టి మార్పు కోసం ఎదురు చూడకుండా..మనమే మొదటి అడుగు వేయాలి.

1. మనమే ముందుగా connect అవ్వాలి:

పిల్లలు వచ్చి మాట్లాడే వరకు ఎదురు చూడకుండా.. మనమే వాళ్ల దగ్గరకు వెళ్లాలి.

“ఈ రోజు ఎలా గడిచింది?” అని అడగడం మాత్రమే కాదు.. ఆసక్తిగా, judgement లేకుండా వినడం ముఖ్యం.

మనం ఎప్పుడైతే మన అప్రోచ్‌ని మార్చుకుంటాము వాళ్లు కూడా మనతో ఓపెన్ అయ్యి వాళ్ళ మనసులో భావాన్ని మనతో షేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు.

2. పర్ఫెక్ట్ పేరెంట్ కావాలనే ప్రెజర్ వదిలేయాలి:

చాలాసార్లు మనం అనుకుంటాం – “నేను సరైన విధంగా పెంచుతున్నానా?” అని.

ఈ ఆలోచన వల్ల మనం చాలా షిఫ్ట్‌గా లేదు చాలా కరెక్టివ్ పేరెంట్‌గా (అంటే తప్పులెంచే పేరెంట్‌గా), చాలా లీనియంట్‌గా ఉండే పేరంట్‌గా మారుతాము.

కానీ పిల్లలకి పర్ఫెక్ట్ పేరెంట్ అవసరం లేదు, వాళ్లకి కావాల్సింది వాళ్లతో ఉండే ప్రెసెంట్ పేరెంట్  (“present parent.”)

మన presence, మన patience – ఇవే ఎక్కువ ప్రభావం చూపిస్తాయి.

3. చిన్న చిన్న consistency ముఖ్యం:

ఒక్కరోజు ఎక్కువగా మాట్లాడటం కంటే.. రోజూ కొంచెం సమయం కేటాయించడం చాలా ముఖ్యము.

రోజుకు 10–15 నిమిషాల genuine connection.. పిల్లల మనసులో ఒక strong bondని build చేస్తుంది.

Consistency ఉన్నప్పుడు.. పిల్లలు safeగా feel అవుతారు.

4. మనమే example అవ్వాలి:

మనమే ఎప్పుడూ ఫోన్లో ఉంటే.. పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు.

మనమే actively listen చేస్తే.. వాళ్లు కూడా మనతో open అవుతారు.

👉 పిల్లలు మన మాటలు వినకపోయినా.. మన actions మాత్రం తప్పకుండా observe చేస్తారు.

5. చిన్న మార్పులను చిన్నగా చూడకండి

మన మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. చిన్న చిన్న ప్రయత్నాలే చాలు. రోజుకు కొద్దిసేపు ఫోన్స్ పక్కన పెట్టి “No Gadget Time” గా కుటుంబంతో గడపడం, పిల్లలతో రోజుకు ఒక meaningful conversation చేయడం – ఇవి చాలా చిన్నగా అనిపించినా, చాలా పెద్ద మార్పును తీసుకురాగలవు. ముఖ్యంగా పిల్లలు మాట్లాడుతున్నప్పుడు వెంటనే సలహాలు ఇవ్వకుండా, తీర్పు ఇవ్వకుండా వినడం.. వాళ్లకు ఒక “safe space”ని కల్పిస్తుంది.

అలాగే, కలిసి భోజనం చేయడం, చిన్న వాకింగ్‌కు వెళ్లడం, లేదా పడుకునే ముందు కొన్ని నిమిషాలు మాట్లాడుకోవడం లాంటి చిన్న rituals మన మధ్య ఉన్న కనెక్షన్‌ను బలపరుస్తాయి. మనం పిల్లల ప్రపంచంలోకి అడుగుపెట్టి, వాళ్లకు ఇష్టమైన విషయాలపై ఆసక్తి చూపించినప్పుడు.. వాళ్లు కూడా మన దగ్గరకు వచ్చి మనసు విప్పుతారు. ఇవన్నీ చిన్న అడుగులే.. కానీ మన బంధాన్ని మళ్లీ దగ్గర చేస్తాయి.

ముగింపుగా..

కుటుంబం అంటే ఒకే ఇంట్లో ఉండటం కాదు.. ఒకే హృదయంలో ఉండటం. మనం ఒకరికి ఒకరం దగ్గరగా ఉండటానికి గోడలు సరిపోవు.. మనసులు కలవాలి. ఈరోజు నుంచే ఒక చిన్న మార్పు ప్రారంభించండి – ఒక చిన్న సంభాషణ, ఒక చిన్న నవ్వు, ఒక చిన్న సమయం.

ఎందుకంటే..

పిల్లలతో మన బంధం – మన జీవితంలోనే అత్యంత విలువైన సంపద. ❤

(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)

Exit mobile version