[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]
మొబైల్ చేతిలో.. మళ్లీ చదువు మూడ్లోకి పిల్లలు వస్తారా?
వేసవి సెలవులు మెల్లగా ముగిసే దశకి వచ్చేశాయి. ఇంట్లో ఒక చిన్న మార్పు, కొత్త హడావిడి మొదలవుతుంది..
ఇంకో వారం పది రోజుల్లో స్కూల్ మొదలవుతుంది. తల్లిదండ్రులు పిల్లల్ని తమ హాలిడే హోమ్ వర్క్ ఫినిష్ చేయమని కంగారు పెట్టటం మొదలు పెడతారు. ఇంక పిల్లలు కొత్త స్కూల్ బ్యాగ్ యూనిఫామ్‌లు అంటూ హడావిడి పడటము మొదలెడతారు. కొంతమంది పిల్లలు స్కూల్‌కి వెళ్ళాలి అంటే బెంగపడటం కూడా స్టార్ట్ చేస్తారు.
అందుకే తల్లిదండ్రుల మనుషులు ఒక చిన్నపాటి కలవరం మొదలవుతుంది. “ఇన్ని రోజులు ఫ్రీగా రిలాక్స్డ్‌గా గడిపిన మన పిల్లలు అందరు తొందరగా చదువు మూడ్ లోకి వస్తారా?” అని.
ఇది చిన్న ప్రశ్న మటకే కాదు చాలామంది ఒక చిన్న పార్టీ ఆందోళన ఒక చిన్న సంశయము కూడా.
ఒకసారి ఆలోచించండి.. సెలవులంతా రాత్రి 11–12 వరకు mobileలో videos చూసిన పిల్లాడు.. ఉదయం లేటుగా లేవటానికి అలవాటు పడిపోయాడు.. కానీ ఇప్పుడు మనం చెప్తున్నాము “రేపటి నుంచి నువ్వు 6:00 కల్లా లేచి స్కూల్ బస్సు కట్టుకోవాలి లేదా చదువుకోవాలి” అని.
కాని, మన పిల్లల ప్రవర్తన switch off – switch on లా వెంటనే మారిపోతుందా?
ఉదాహరణ:
ఒక అమ్మ తన పిల్లవాడి గురించి నాతో ఇలా చెప్పింది:
తన పిల్లవాడు “రోజంతా YouTube, gamesలో busy.. ఇప్పుడు book open చేస్తే.. 5 నిమిషాలకే ‘bored’ అంటాడు.. మళ్లీ mobile కోసం చూస్తాడు..” అని.
ఆ అమ్మ మాటల్లో తనలోని ఫ్రస్టేషన్ కన్నా, ఒక నిస్సహాయత ఏం చేయాలో అని తెలియనితనము ఎక్కువ కనిపించింది. ఎందుకంటే.. ఆమెకు కూడా తెలుసు, “తన పిల్లవాడు చదువు అంటే ఆసక్తి లేక ఇలా అవలేదు” అని. కానీ ఎక్కువసేపు ఇలా ఫ్రీగా కనబడడానికి కారణం సమ్మర్ హాలిడేస్ అని.
ఇది ఒక్క ఇంటి కథ కాదు.. ఇది ఈ రోజుల్లో చాలా ఇళ్లలో నిశ్శబ్దంగా జరుగుతున్న నిజం.
అందుకే..
అందుకే ఇది మనం పానిక్ అయ్యే సమయం కాదు పిల్లలకి నెమ్మదిగా స్కూల్‌కి సంసిద్ధం చేయాల్సిన సమయం.
పిల్లల్ని మళ్లీ చదువు మూడ్ లోకి తీసుకురావడానికి చిన్న చిన్న మార్గాలు
సెలవుల తర్వాత పిల్లల్లో కనిపించే మార్పులు చాలా చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ పేరెంట్స్‌గా మనము వాటిని ఈజీగా గుర్తించగలం అవి ఏంటంటే:
చదువుకి కూర్చున్నా..
- 10 నిమిషాలు కూడా కాన్సెంట్రేట్ చేయలేకపోవటం
- మనసు ఎక్కడో ఉండటం
- చిన్న విషయాలకు కూడా ఇరిటేట్ అయి కోపం తెచ్చుకోవటం
- “ఒక్క ఐదు నిమిషాలు..” అంటూ మొబైల్‌ని వదల్లేకపోవటం.
ఇవి చూసి మనం వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేస్తాం: “అదే మన పిల్లలకి చదువు మీద శ్రద్ధ లేదు అని..”
కానీ నిజంగా ఆలోచిస్తే..“ఇంట్రెస్ట్ తగ్గలేదు కానీ, అలవాట్లు మారిపోయాయి.”
ఇక్కడే మనం కూడా టెన్షన్లో మనము కొన్ని నిర్ణయాలు తీసుకుంటాము..
- ఒక్కసారిగా మొబైల్ తీసేయడం
- “మా కాలంలో..” అని పోల్చటం
- అస్తమానం చదువు అని చెప్పటం
మనం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల పిల్లలకి చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది అని మనం అనుకుంటాము. కానీ చాలాసార్లు జరిగేది ఏంటంటే, పిల్లలు చదువుకి దగ్గరవడం కాదు.. మెల్లగా వారు మనకి దూరం అవుతారు.
అందుకే.. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే..
👉 ఇది laziness కాదు
👉 ఇది attitude problem కాదు
👉 ఇది ఒక adjustment phase
ఇప్పుడు మనం ఎలా respond అవుతామో..అదే పిల్లల next behavior ని decide చేస్తుంది. అందుకే..
ఎలా మన పిల్లల్ని స్కూల్ రొటీన్ లోకి తిరిగి తీసుకురావాలో చూద్దాం:
1. ఒక్కసారిగా రొటీన్ మార్చకండి:
నిన్నటి వరకు లేటుగా లేచిన పిల్లలకి ఈరోజు నుంచి ఆరింటికల్లా లేవాలి అంటే అది వాళ్ళకి పెద్ద షాక్ అవుతుంది.
అందుకే పిల్లల స్కూల్ తెరిచేందుకు ఒక పది రోజులు ముందు నుంచి రోజుకి ఒక 10 నిమిషాలు లేదా 20 నిమిషాలు ముందుగా లేవటం అన్నది మీ పిల్లలకి అలవాటు చేయండి. దానితో మీ పిల్లలకి తొందరగా లేవటం అలవాటవుతుంది, మీకు స్ట్రెస్ తగ్గుతుంది.
2. చదువు చిన్నగా మొదలు పెట్టండి:
మొదటి రోజే రెండు గంటలు చదువు లేదు ఒక పాఠం ఫుల్‌గా నేర్చుకో అంటే మీ పిల్లలు స్ట్రెస్ అయిపోతారు.
దానికి బదులుగా రోజుకి 20 నిమిషాలు చిన్న చిన్న స్టోరీ బుక్స్ చదవటం అలవాటు చేయండి. ఈ అలవాటు చేయడంతో రేపు పొద్దున స్కూల్ తెరిచాక కూడా వాళ్ళకి చదవడం అన్నది పెద్ద కష్టం అనిపించదు.
3. స్క్రీన్ టైమ్‌ని స్మార్ట్‌గా తగ్గించడం తగ్గించండి:
ఒక్కసారిగా స్కూలు తెరిచారు కాబట్టి, నో మొబైల్, లేదా, నో టీవీ అన్నారంటే, మీ పిల్లలు దాని గురించే ఆలోచిస్తారు.
దానికి బదులుగా ఏదైనా ఒక ఫన్ చాలెంజ్‌గా మనం ఒక 30 మినిట్స్ మొబైల్ లేకుండా ఉందామా? నో స్క్రీన్ డే చాలెంజ్ తీసుకుందామా అని అడగండి. ఎప్పుడైతే మీ పిల్లలు అది ఫైట్ లాగా కాకుండా చూస్తారో, అప్పుడే వాళ్ళు స్క్రీన్ లేకుండా సమయం గడపడానికి ఆస్వాదిస్తారు.
4. చదువు అంటే ఆసక్తి పెంచండి:
ఇన్ని రోజులు ఫ్రీగా టైం ఎంజాయ్ చేసిన పిల్లలకి చదువు బోరింగ్ గానో లేదు పనిష్మెంట్ గానూ అనిపించిందంటే, వాళ్లు దానిమీద ఆసక్తి చూపించరు.
అందుకే పిల్లలకి చదువు అన్నది ఒక ఫన్ ఆక్టివిటీ లాగా యూట్యూబ్ వీడియోస్, డయాగ్రమ్స్ ఎగ్జాంపుల్స్, చూపెట్టి, వాళ్లలోని ఇంట్రెస్ట్‌ని ఇంకొంచెం పెంపొందించండి.
5. రివార్డ్స్ ఇవ్వండి కానీ కొంచెం జాగ్రత్తగా..
“చదివితే మొబైల్ ఇస్తాను” అంటే.. మొబైల్ మీద మీ పిల్లల ధ్యాస ఇంకా పెరుగుతుంది.
అందుకే మొబైల్‌కి బదులుగా
- మీ పిల్లలతో కలిసి టైం స్పెండ్ చేయడం,
- ఒక చిన్న ఫన్ గేమ్ ఆడటం,
- ఫ్యామిలీగా కలిసి బయటికి వెళ్లడం,
- కలిసి డిన్నర్ చేయడం, మొదలగునవి
రివార్డ్స్ ఇస్తున్నాము అంటే మనం మన పిల్లలకి కనెక్ట్ అయి ఉండాలి. మన పిల్లలకు కావాల్సింది: నుంచి మన సమయము, అటెన్షన్, అప్రిసియేషన్.
6. మీరు చూపించే example చాలా ముఖ్యం
పిల్లలు మనం చెప్పేది కంటే.. మనమే చేస్తున్నది ఎక్కువగా follow అవుతారు. మీరు చేతిలో మొబైల్ పెట్టుకుని ఉంటే.. వాళ్లు ఎందుకు వదులుతారు?
అందుకే..
- మీరు కూడా స్క్రీన్ టైమ్ తగ్గిస్తే.. వాళ్లు మిమ్మల్ని ఫాలో అవుతారు.
- పిల్లలతో కలిసి కొంచెం సమయం గడపండి
వర్కింగ్ పేరెంట్స్ కోసం ఒక చిన్న సూచన:
మీరు busy అని నాకు తెలుసు..
కానీ పిల్లలకి కావాల్సింది time కాదు.. attention.
👉 రోజుకు 15 నిమిషాలు
👉 no mobile
👉 only child
ఆ చిన్న సమయం..
వారి mindset మార్చగలదు.
ముగింపుగా..
ఇక్కడ మనం ఒక నిజం అర్థం చేసుకోవాలి.. మన పిల్లల అలవాట్లు సెలవుల్లో ఎలా నెమ్మదిగా మారాయో, ఎలా వాళ్ళు గ్యాడ్జెట్ల వైపు మళ్లారో.. అలాగే వాళ్ళ దృష్టి కూడా చదువు వైపు నెమ్మదిగా మరులుతుంది.
మనం ఎప్పుడైతే కంగారుపడి వాళ్ళని తొందర పెడతామో అప్పుడు వాళ్లు మనకి ఎదురు తిరుగుతారు. మనము అర్థం చేసుకొని నెమ్మదిగా వాళ్లకు చదువు ఎంత మనకు ముఖ్యమో దాన్ని ఎంత మనం ఫన్‌గా ఎంజాయ్ చేయవచ్చో వాళ్ళకి చెపితే వాళ్ళు నెమ్మదిగా మన మాట వింటారు.
మొబైలు ఒక సమస్య కాదు, మొబైల్ వాడకమే మనకి సమస్య. కాకపోతే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మొబైల్ వాడకం అనేది ఒక ఫేజ్ మటుకే. ఈ ఫేజ్ లో మనం మన పిల్లల్ని ఎలా గైడ్ చేస్తామో, ఎలా మార్గ నిర్దేశం చేస్తామో, అదే రేపు వాళ్ళ ఫ్యూచర్ హాబిట్స్ కూడా షేర్ మారుస్తుంది.
చివరి మాట
“మొబైల్ తీసేస్తే చదువు మొదలవదు.. చదువు యొక్క అవసరాన్ని అర్థాన్ని మనం పిల్లలకు తెలియజేస్తే, మొబైల్ వాడకం తనంతట తానే తగ్గిపోతుంది.”
(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)
ఐ.పి. సుహాసిని గారు కిడ్స్ అండ్ పేరెంట్స్ లైఫ్ కోచ్‌గా పని చేస్తున్నారు. చైల్డ్ సైకాలజిస్ట్. పేరెంటింగ్ బ్లాగర్, యూట్యూబర్. పేరెంట్స్ కోసం వాట్సప్‌లో ఒక ఫ్రీ కమ్యూనిటీ నడుపుతున్నారు. ఆ కమ్యూనిటీ లింక్ Simplified Parenting with Suhasini. వారిని mommyshravmusings@gmail.com అనే మెయిల్ ఐడిలో సంప్రదించవచ్చు.
