Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-64

[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]

ప్రకృతిని ప్రేమించే పిల్లలను ఎలా పెంచాలి?

పర్యావరణాన్ని కాపాడే పిల్లలు కాదు.. ప్రకృతితో బంధం పెంచుకునే పిల్లలు కావాలి!!!

మన చిన్నప్పుడు వేసవి సెలవులు అంటే చెట్ల నీడలో ఆటలు, సాయంత్రం బయట స్నేహితులతో గడిపిన సమయం, వర్షంలో తడిసిన జ్ఞాపకాలు, పక్షుల కిలకిలారావాలతో మొదలయ్యే ఉదయాలు.

కానీ, ఇప్పుడు మన పిల్లల వేసవి సెలవులు ఎలా ఉన్నాయి?

బయటకు వెళ్లడానికి వేడి ఎక్కువ, ఆడుకోవడానికి స్థలం తక్కువ, స్నేహితులు లేరు, ప్రకృతిని ఆస్వాదించడానికి సమయం మరింత తక్కువ. ఎందుకంటే, పిల్లల్ని బయటికి పంపించి ఆడుకోమని చెప్పాలి అంటే తల్లిదండ్రులకి భయం. మరి మన చుట్టూ సమాజం అలా ఉంది కదా, ఏం చేద్దాం?

అందుకే మన పిల్లలు ఇంట్లో మగ్గిపోతున్నారు. వాళ్ళు ఉండేది ఎయిర్ కండిషన్ గదులలో, ఆడేది కంప్యూటర్లలో, లేదు, మొబైల్లో, చూసేది యూట్యూబ్ వీడియోస్, ఆడేది వీడియో గేమ్స్. అందువల్ల, బయట ప్రపంచంతో, ప్రకృతి తోను, సంబంధాలు చాలా వరకు తగ్గిపోతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తరచుగా వస్తున్న హీట్ వేవ్స్, వర్షాల అస్థిరత, పర్యావరణ సమస్యలు మనందరికీ ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో పిల్లలకు “పర్యావరణాన్ని కాపాడాలి” అని చెప్పడం సరిపోదు. ఎందుకంటే, మనిషి కాపాడేది తాను ప్రేమించిన దాన్నే.

పిల్లలు ప్రకృతిని ప్రేమిస్తేనే రేపు దాన్ని కాపాడాలనే బాధ్యత వారి మనసులో సహజంగా పుడుతుంది. అందుకే ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒక ముఖ్యమైన ప్రశ్నను మనం ఆలోచిద్దాం. అదే, ప్రకృతిని ప్రేమించే పిల్లలను ఎలా పెంచాలి? అని.

పిల్లలు ప్రకృతిని ప్రేమించకపోవడం వారి తప్పు కాదు

చాలామంది తల్లిదండ్రులు మా పిల్లలు బయటకు రావడానికి ఇష్టపడరు అని అంటూ ఉంటారు. అలా వాళ్ళు ఎందుకు అంటున్నారో కాసేపు ఆలోచిద్దాం.

ఈ కాలంలో పిల్లలు నిజంగా ప్రకృతిని చూసే అవకాశం తల్లిదండ్రులుగా మనం ఎంతవరకు వాళ్లకు కల్పిస్తున్నాము?

మనలో చాలామంది అపార్ట్మెంట్లలో నివసిస్తున్నాం. భద్రత కారణాల వల్ల పిల్లలను ఒంటరిగా బయటకు పంపలేకపోతున్నాం. తల్లిదండ్రులు ఉద్యోగాలతో బిజీగా ఉన్నారు. వీటన్నింటి మధ్య స్క్రీన్లు పిల్లల జీవితంలో ప్రధాన వినోద సాధనంగా మారిపోయాయి. ఇది పిల్లల తప్పు కాదు. వాళ్లు చూసిన ప్రపంచాన్ని ప్రేమిస్తారు. వాళ్లకు చూపించని ప్రపంచాన్ని ప్రేమించడం ఎలా సాధ్యం?

ఒక పిల్లవాడు ఎప్పుడూ సముద్ర తీరానికి వెళ్లకపోతే అలల అందాన్ని ఎలా ఆస్వాదిస్తాడు?

ఒక పిల్లవాడు ఎప్పుడూ తోటలో గడపకపోతే మట్టివాసనతో ఎలా ప్రేమలో పడతాడు?

అందుకే ప్రకృతిని ప్రేమించడం గురించి పిల్లలకు బోధించడం కంటే ముందు, ప్రకృతిని అనుభవించే అవకాశాలను కల్పించడం మన బాధ్యత.

ప్రకృతితో పిల్లల బంధాన్ని పెంచే చిన్న చిన్న మార్గాలు

చాలామంది తల్లిదండ్రులు ఇలా అంటుంటారు మేము సిటీలో ఉంటాము, అపార్ట్మెంట్లో ఉంటాము, ఇక్కడ ప్రకృతికి ఎక్కడ స్థానం ఉంది అని? అంతేకాకుండా వాళ్లు ఇంకో పెద్ద అపోహలో కూడా ఉంటారు ప్రకృతి అంటే వాళ్ళని గ్రామాలకు తీసుకెళ్లాలి లేదు అడవులకు తీసుకెళ్లాలి, అదో పెద్ద పని అని కూడా అనుకుంటారు.

అవేవి, అసలు అవసరం లేదు.

ప్రకృతిని చూడమని కాదు.. గమనించమని చెప్పండి

మనం ఇచ్చే చిన్న చిన్న అనుభవాలు చూపెట్టే సంఘటనలతోనే మన పిల్లల్లో  పెద్ద మార్పులు వస్తాయి. ప్రకృతితో ప్రేమ ఒక్కరోజులో పుట్టదు. పరిశీలనతో మొదలవుతుంది.

మీ ఇంటి అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోనో లేదు మీ ఇంటి పక్కన ఒక చిన్న పార్కు మీ పిల్లల్ని ఒకరోజు సాయంకాలం వాకింగ్‌కి తీసుకెళ్లండి. వివిధ రకాలైన చెట్లని పరిచయం చేస్తూ కొన్ని ప్రశ్నలు ఇలా అడగండి.

ఇలాంటి ప్రశ్నలు పిల్లలలో పరిశీలన శక్తిని పెంచుతాయి. ఒకసారి గమనించడం అలవాటైతే, ప్రకృతి వారికి ఒక కొత్త ప్రపంచంలా కనిపించడం మొదలవుతుంది.

ఇంట్లో చిన్న తోటను సృష్టించండి

ప్రకృతికి చేరువ అవ్వాలంటే మీ గ్రామంలోనూ, లేదు, అడవిలోనూ ఉండాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో కూడా ఒక తోటను సృష్టించుకోవచ్చు. దానికి కావాల్సింది పెద్ద స్థలం కాదు మీ మనసు. మీ మనసు ఉంటే, మీరు ఇంట్లో ఎక్కడైనా చిన్న తోటను చాలా ఈజీగా సృష్టించుకోవచ్చు.

చాలు. పుదీనా, ధనియాలు, కరివేపాకు, తులసి వంటి మొక్కలు పెంచవచ్చు.

పిల్లలు పెంచిన కరివేపాకు వంటలో వాడిన రోజు వారి ఆనందం వేరే స్థాయిలో ఉంటుంది.

ఎందుకంటే అప్పటివరకు కూరగాయలు, ఆకుకూరలు సూపర్ మార్కెట్లో పుట్టేవి అనుకున్న పిల్లలకు, అవి ప్రకృతి నుంచి వస్తాయని అర్థమవుతుంది.

మీకు ఇంకా ఓపిక ఉంటే మీ ఇంట్లో ఒక చిన్న కుండీలో ఇండోర్ మొక్కని పెట్టండి. మీ పిల్లల్ని నర్సరీకి తీసుకెళ్లి ఆ ఇండోర్ మొక్కని వాళ్ళందరూ వాళ్ళని ఎంపిక చేసుకోనివ్వండి.

‘గ్రీన్ టైమ్’ అనే కొత్త అలవాటు

ఈ రోజుల్లో మనం స్క్రీన్ టైమ్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాం. కానీ స్క్రీన్ టైమ్‌ని తగ్గించమని చెప్పడం కంటే, దానికి ప్రత్యామ్నాయం ఇవ్వడం ముఖ్యం. అందుకే ప్రతి కుటుంబం ఒక చిన్న అలవాటు ప్రారంభించవచ్చు.

అది ఏంటో కాదు కష్టమైంది అంతకంటే కాదు రోజుకి 15 లేదా 20 నిమిషాలు మీ కుటుంబం అంతా కలిసి గడిపే విలువైన సమయం అవుతుంది. ఆ సమయంలో మీ అందరూ, మొబైల్, టీవీ, టాబ్లెట్ లేకుండా, ఆరు బయట గడపండి.

కేవలం బయట గాలి, ఆకాశం, చెట్లు, పక్షులు చూడండి పరిశీలించండి. దీనిని ‘గ్రీన్ టైమ్’ అని పిలవండి.

కొన్ని రోజుల తరువాత పిల్లలే ఆ సమయాన్ని ఎదురు చూస్తారు.

ప్రకృతిని ప్రేమించడం ఎందుకు నేర్పాలి?

చాలామంది ప్రకృతి గురించి మాట్లాడేటప్పుడు పర్యావరణ పరిరక్షణ గురించి ఆలోచిస్తారు, వాటి మీద దృష్టి పెడతారు. ప్రకృతి అంటే పర్యావరణం అనే అపోహలోకి చాలామంది వెళ్లిపోయారు. అంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే మన చుట్టూ ఉండే, ఈ సోషల్ మీడియా ప్రపంచం, మనకు ఆలాంటి ఐడియాలు ఇవ్వడం మొదలెట్టింది కాబట్టి.

పర్యావరణ పరిరక్షణ చాలా ముఖ్యమైనది కానీ పర్యావరణం అన్నది ప్రకృతిలో ఒక భాగం మటుకే.

ప్రకృతి అంటే కేవలం చెట్లు, మొక్కలు లేదా పర్యావరణం మాత్రమే కాదు. మన చుట్టూ ఉన్న గాలి, నీరు, నేల, పక్షులు, జంతువులు, ఋతువులు, ఆకాశం – మన జీవితాన్ని నిలబెట్టే ఈ సమస్త జీవవ్యవస్థ అంతా ప్రకృతే.

ప్రకృతిని ప్రేమించడం అనే విషయం, పర్యావరణ పరిరక్షణ చర్యల కంటే చాలా పెద్దది. ప్రకృతిని ప్రేమించడం అంటే..

ఈ విలువలు పిల్లలలో చిన్నప్పుడే పెరిగితే, అవి జీవితాంతం వారితో ఉంటాయి. అందుకే, పిల్లల పెంపకంలో ప్రకృతి ఒక గొప్ప గురువు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే:

1. అది ఓర్పు నేర్పే గురువు:

ఒక చిన్న విత్తనం నాటిన వెంటనే మొక్కగా మారదు. దానికి:

ఇప్పటి పిల్లలు “ఇప్పుడే కావాలి” అనే ప్రపంచంలో పెరుగుతున్నారు.

అలాంటి పిల్లలకు ఎదురు చూడటం, ప్రక్రియను ఆస్వాదించడం, సహనం వహించడం ప్రకృతి నేర్పుతుంది.

2. అది బాధ్యత నేర్పే గురువు:

ఒక మొక్కను సంరక్షించమని పిల్లలకు చెప్పండి. మొదటి రెండు రోజులు ఉత్సాహంగా చేస్తారు,  మూడో రోజు మరిచిపోతారు, మళ్లీ గుర్తు చేస్తే చేస్తారు.

కానీ కొద్ది రోజుల తరువాత ఆ మొక్క కొత్త ఆకులు వేస్తే, పువ్వు పూస్తే, వాళ్లలో ఒక బాధ్యత భావం పెరుగుతుంది.

“నేను చూసుకున్నాను కాబట్టే ఇది పెరిగింది” అనే అనుభూతి వారికి ఎంతో విలువైనది.

అదే ఒకవేళ ఆ మొక్క చనిపోతే, అది వారికి బాధ్యతలను విస్మరించటం మూలంగా జరిగే ప్రమాదాలు గురించి తెలియజేస్తుంది.

3. అది ప్రశాంతతను ఇచ్చే గురువు:

ఈ రోజుల్లో పిల్లల్లో ఒత్తిడి, ఆందోళన, చిరాకు వంటి సమస్యలు పెరుగుతున్నాయని మనం తరచుగా వింటున్నాం. ప్రకృతిలో కొంత సమయం గడపడం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.

పార్క్‌లో నడవడం, చెట్టు కింద కూర్చోవడం, పక్షులను గమనించడం వంటి చిన్న విషయాలే పిల్లల భావోద్వేగ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.

4. అది కృతజ్ఞత నేర్పే గురువు:

మనకు లభించే ప్రతి ఆహారం, ప్రతి పండు, ప్రతి కూరగాయ, ప్రతి గాలి పీల్చుడు ప్రకృతి నుంచే వస్తుంది. ఈ విషయాన్ని పిల్లలు అర్థం చేసుకున్నప్పుడు వారి మనసులో కృతజ్ఞత పెరుగుతుంది.

ఈ వారంలో కుటుంబంగా చేయగల 5 చిన్న పనులు

ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం (June 5th) సందర్భంగా కుటుంబమంతా కలిసి ఈ చిన్న పనులు చేసి చూడండి.

✓ ఒక మొక్కను నాటి దానికి పేరు పెట్టండి.

✓ ఇంటి బయట లేదా బాల్కనీలో పక్షుల కోసం నీళ్ల పాత్ర ఉంచండి.

✓ ఒక సాయంత్రం కుటుంబమంతా కలిసి ప్రకృతిలో నడవండి.

✓ ఇంట్లో ఉన్న ప్రతి మొక్క పేరు తెలుసుకోండి.

✓ రాత్రి భోజనం సమయంలో “ఈ రోజు ప్రకృతిలో నేను గమనించిన అందమైన విషయం” అని ప్రతి ఒక్కరూ పంచుకోండి.

ఈ చిన్న అలవాట్లు పెద్ద మార్పులకు ఆరంభం కావచ్చు.

ముగింపుగా..

మన పిల్లలకు మంచి విద్య ఇవ్వాలని మనం కోరుకుంటాం, మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటాం. జీవితంలో విజయవంతం కావాలని కోరుకుంటాం. అవన్నీ ముఖ్యమే.

కానీ వాటితో పాటు ఇంకో విలువైన బహుమతిని కూడా ఇవ్వాలి. ప్రకృతితో బంధం, ఎందుకంటే ప్రకృతిని ప్రేమించే పిల్లలు..

రేపటి ప్రపంచానికి అవసరమైనది కేవలం తెలివైన పిల్లలు కాదు.

ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం ఒక మొక్కను మాత్రమే నాటకూడదు. మన పిల్లల మనసుల్లో ప్రకృతి పట్ల ప్రేమ అనే చిన్న విత్తనాన్ని కూడా నాటాలి. ఎందుకంటే..

ఈ రోజు మనం నాటే ఆ ప్రేమ విత్తనం, రేపటి పచ్చని ప్రపంచానికి పునాది కావచ్చు.

(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)

Exit mobile version