Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-78

[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]

మన పిల్లల జీవితంలో టీచర్ ఎవరు? మార్కులు ఇచ్చేవారా, మనసు అర్థం చేసుకునేవారా?

సెప్టెంబర్ నెల వచ్చిందంటే మనకు గుర్తొచ్చే వాటిలో మొట్టమొదటిది టీచర్స్ డే. స్కూల్లో పిల్లలు తమ టీచర్లకు గ్రీటింగ్ కార్డులు ఇస్తారు. పూలు ఇస్తారు. “హ్యాపీ టీచర్స్ డే” అని చెబుతారు. కొందరు టీచర్ల గురించి చిన్న చిన్న ప్రసంగాలు కూడా చేస్తారు.

చిన్నప్పటినుంచి మనలో చాలామంది మన పిల్లలకి గురుబ్రహ్మ అన్న శ్లోకంతో మొదలుపెట్టి “గురువు అంటే దేవుడితో సమానం.” అని చెబుతాం..

కానీ ఈసారి టీచర్స్ డే సందర్భంగా మనల్ని మనమే ఒక చిన్న ప్రశ్న వేసుకుందామా?

మన పిల్లల జీవితంలో నిజమైన టీచర్ ఎవరు?

పాఠాలు చెప్పేవారా? లేక, పరీక్షలు పెట్టేవారా?

మార్కులు ఇచ్చేవారా? లేక, మన పిల్లల మనసును అర్థం చేసుకునేవారా?

ఒకే పిల్లవాడు.. కానీ టీచర్ చూపు మారితే కథే మారిపోతుంది

ఉదాహరణకి: ఒక పిల్లవాడు Maths లో తక్కువ మార్కులు తెచ్చుకున్నాడనుకుందాం.

రెండు వాక్యాల మధ్య తేడా చాలా చిన్నదిగా కనిపించవచ్చు. కానీ ఆ రెండు వాక్యాలు ఒక పిల్లవాడి మనసులో చాలా పెద్ద తేడాను సృష్టించగలవు.

మొదటి వాక్యం పిల్లవాడికి ఒక label ఇస్తుంది. ఆ పిల్లవాడి మనసులో మరెన్నో భావనలు రేకెత్తిస్తుంది అవే:

కానీ రెండో వాక్యం మాత్రం ఒక దారిని చూపెడ్తుంది, ఒక అవకాశాన్ని ఇస్తుంది. “ఇప్పుడే అర్థం కాలేదు. ఇంకోసారి ప్రయత్నించవచ్చు.”

ఇదే ఒక మంచి టీచర్ చేసే అద్భుతమైన పని.

తప్పును చూపించడం మాత్రమే కాదు, తప్పు చేసినా తాను తప్పు మనిషిని కాదని పిల్లవాడికి అర్థమయ్యేలా చేయడం.

“ఇది తప్పు” అనడం వేరు.. “నువ్వే తప్పు” అనిపించడం వేరు

ఒక మంచి టీచర్ పిల్లవాడి తప్పును పట్టించుకోకుండా వదిలేయరు. అలాగే, అతనిపై ఉన్నఅంచనాలను కూడా తగ్గించరు.

కానీ, తప్పును సరిదిద్దడానికి, అవమానపరచడానికి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకుంటారు.

ఇది చాలా చిన్న తేడాలా అనిపించవచ్చు. కానీ పిల్లల మనసు ఈ చిన్న తేడాలను చాలా లోతుగా గుర్తుంచుకుంటుంది.

అయితే.. మనం మన పిల్లలకు ఎలాంటి టీచర్లం?

ఇక్కడ ఒక ప్రశ్న మన పేరంట్స్ కి కూడా వస్తుంది. మన పిల్లలకు మనం ఎలాంటి టీచర్లం అని?

పిల్లవాడు పరీక్షలో తక్కువ మార్కులు తెస్తే..

మనం మొదట అడిగేది,

“ఎందుకు ఇన్ని తక్కువ వచ్చాయి?” లేక, “ఏం కష్టంగా అనిపించింది?” అని అడుగుతామా?

పిల్లవాడు ఏదైనా తప్పు చేస్తే..

ఎన్ని సార్లు చెప్పాలి, అని అంటామా? లేక, ఇక్కడ ఏం జరిగింది? మనం దీన్ని ఎలా సరిచేయొచ్చు? అని అడుగుతామా?

పిల్లవాడు ఏదైనా విషయంలో విఫలమైతే..

చూశావా! ముందే చెప్పాను, అని అంటామా? లేక, “సరే.. ఇప్పుడు ఏం నేర్చుకున్నాం?” అని అడుగుతామా?

మన మాటలు పిల్లలకు కేవలం ఆ క్షణానికి మాత్రమే వినిపించవు. అవి క్రమంగా వారి inner voice గా మారతాయి.

మనము పదే పదే, “నీకు రాదు.” అంటే..

ఒకరోజు పిల్లవాడే తనతో, తాను “నాకు రాదు.” అని అనడం మొదలుపెడతాడు.

మనము పదే పదే, “నువ్వు ఇంకా బాగా చేయగలవు. నేను నీతో ఉన్నాను.” అంటే..

ఒకరోజు మనం పక్కన లేకపోయినా, “నేను ఇంకోసారి ప్రయత్నించగలను.” అని అతనే తనను తాను ప్రోత్సహించుకోవడం నేర్చుకుంటాడు.

టీచర్ అంటే స్కూల్లో మాత్రమే ఉండే వ్యక్తి కాదు

అందుకే పిల్లల జీవితంలో టీచర్లు కేవలం స్కూల్లో ఉండరు.

అందుకే “టీచర్” అనే పదాన్ని కేవలం ఒక ఉద్యోగంగా చూస్తే మనం దాని అసలు అర్థాన్ని చాలా చిన్నదిగా చేసేస్తాం. మన జీవితంలో మనల్ని మనం ఎలా చూడాలో నేర్పే ప్రతి వ్యక్తీ ఒక టీచరే.

ప్రతి పిల్లవాడికీ ఒక “నిన్ను నేను నమ్ముతున్నాను” అనే మనిషి కావాలి

ప్రతి పిల్లవాడికీ జీవితంలో కనీసం ఒక్క పెద్ద మనిషి అయినా అవసరం.

అని చెప్పే ఒక వ్యక్తి, ఆ భద్రత ఇచ్చే ఒక వ్యక్తి.

ఆ వ్యక్తి ఒక టీచర్ కావచ్చు, ఒక coach కావచ్చు, ఒక parent కావచ్చు.

కానీ మన పిల్లల జీవితంలో ఆ వ్యక్తి మనమే అయితే? అది ఎంత గొప్ప బహుమతి!

ముగింపుగా.. మన పిల్లలకు మనం ఏ కథ చెబుతున్నాం?

ఈ టీచర్స్ డే కి మన పిల్లల గురువులకి మన కృతజ్ఞతలు తెలియజేద్దాం. కానీ ఈసారి.. ఆ ఒక్క కృతజ్ఞత దగ్గరే ఆగిపోకుండా, మనల్ని మనం కూడా ఒకసారి ప్రశ్నించుకుందాం.

మన పిల్లల మనసులో మన గురించి, వారి గురించి.. మన మాటలు ఎలాంటి కథను రాస్తున్నాయి?

ఎందుకంటే మనం ప్రతిరోజూ వాళ్లతో మాట్లాడే మాటలు.. కేవలం ఆ క్షణంలో ముగిసిపోవు.

అవి నెమ్మదిగా వాళ్ల లోపలి స్వరంగా మారతాయి.

ఒకరోజు మనం వాళ్ల పక్కన ఉండకపోయినా..

మనము చెప్పిన మాటలే వాళ్లతో మాట్లాడుతాయి.

అందుకే మనం వాళ్లకు ఇచ్చే గొప్ప బహుమతి ఎప్పుడూ :

“నేను ఎవరు?”

“నేను ఎంతవరకు చేయగలను?”

“నేను పడిపోయినప్పుడు మళ్లీ లేవగలనా?”

అనే ప్రశ్నలకు వాళ్ల మనసులో ఒక బలమైన, అందమైన సమాధానం ఉండేలా చెయ్యగలటం. ఎందుకంటే..

ఒక మంచి టీచర్ పిల్లవాడికి ఒక పాఠం నేర్పుతారు. కానీ ఒక గొప్ప టీచర్..

ఆ పిల్లవాడు తన గురించి జీవితాంతం నమ్మే ఒక మంచి కథను రాయడంలో సహాయం చేస్తారు.

మరి మన పిల్లల జీవితంలో..ఆ మంచి కథకు మనం ఎలాంటి పాత్ర పోషిస్తున్నాం?

(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)

Exit mobile version