Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పూల వాసన

[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘పూల వాసన’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


కాశమంత విశాలం ఆ కలయిక
సముద్రంలో తెలియని లోతు
మెలకెత్తినది
ఎగిరే రెక్కలు నింగీ నేలను
ఎగిరే పక్షి ఆశ
స్నేహం
ఊహలకందని కవిత్వం
రచన కరచాలనం చలన సంగీతం
పూల వాసనలో కురిసే వాన
రెండు మనసుల తీరం కలిపే
తడితడి ప్రవాహంలో
ఇద్దరు మిత్రుల జీవ భావోద్వేగం

Exit mobile version