Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రాసలు

[శ్రీ రేడియమ్ రచించిన ‘ప్రాసలు’ అనే కవితని అందిస్తున్నాము.]

ప్రాసల రసం
కొందరికి విరసం
పేలితే హాసం

మంచి పుస్తకం
భక్తికి ముక్తి మార్గం
జ్ఞానం అమోఘం

ఆరోగ్యధామం
పండ్ల రసాల నీరం
పేదకు దూరం

నిప్పల వాన
అనలకాలజాణ
నీడల కాన

బూతు పురాణం
సినీ పాటల తోర్ణం
చెయ్యరు రణం

Exit mobile version