Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘ప్రద్యుమ్న కథలు – కలలు.. కళలు’ బాలల కథల ధారావాహిక ప్రారంభం – ప్రకటన

బాలబాలికల మానసిక వికాసానికి, మంచి ప్రవర్తనకు; వారిలో భాషా నైపుణ్యాల అభివృద్ధికి బాల సాహిత్యం ఎంతో దోహదం చేస్తుంది.

పిల్లల్లో చిన్నప్పటి నుంచే ఏది మంచి, ఏది చెడు అనే అవగాహన కల్పించడానికి బాల సాహిత్యం చక్కని సాధనంగా పనిచేస్తుంది.

సమాజంలో ఎలా నడుచుకోవాలి, పెద్దలను ఎలా గౌరవించాలి అనే విషయాలను బాలల కథల ద్వారా నేర్పవచ్చు. బాలసాహిత్యం పిల్లల్లో ఆలోచనా శక్తిని, ఊహాశక్తిని పెంపొందిస్తుంది.

అందుకే నేటి తరపు బాలబాలికలకు ఆధునికమైన కథాంశాలతో బాలల కథలందిస్తున్నారు శ్రీ వారాల ఆనంద్.

వచ్చే వారం నుంచి సంచికలో వారానికి ఒకటి చొప్పున ప్రద్యుమ్న అనే పిల్లవాడి కథలు ప్రచురితమవుతాయి.

చదవండి.. చదివించండి

‘ప్రద్యుమ్న కథలు – కలలు.. కళలు’

Exit mobile version