Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-22

[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]

హోమియో మందులు-21: ఎస్టకస్‌ ఫ్లావియటిలిస్‌ (Astacus fluviatilis)

ఇది క్యుబ్రకో మూలిక నుండి తీసిన ఔషధం. మూలిక నుండి ఔషధ గుణాల్ని రాబట్టినవారు డా॥ హానిమన్‌.

స్థానాలు:

ఈ మందుకి ఊపిరితిత్తులు, గుండెపై ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.

వ్యాధులు:

ఉబ్బసం. ముఖం పాలిపోవుట, ఉబ్బస వ్యాధిలో ముఖం నీలి నలుపు రంగుగా మారుతుంది.

ఊపిరితిత్తుల్ని, శ్వాసావయవ కేంద్రాల్ని ఉత్తేజపర్చుట ద్వారా రక్తం పరిశుద్ధమవుతుంది. క్షయవ్యాధిలో కల్గు ఆయాసం. ఆయాసంలో పెదవులు నీలిరంగుగా మారి ఊపిరాడక పోవడం, రాత్రిళ్ళు అధికంగా ఉంటుంది. ముద్ద ముద్దలుగా కళ్ళె పడుతుంది. పిల్లల్లో జాండీస్ రావడం వలన శరీరంపై దురదలుంటాయి. లివర్ ప్రాంతంలో నొప్పి. మెడలో లింఫ్ గ్రంథుల నొప్పి ఉంటుంది. పైత్యం,వాంతులు, దగ్గు, విరేచనాలు ఉంటాయి. శరీరంలో కుట్టినట్టు నొప్పులుంటాయి.

గుండె కవాటాలు సరిగా పనిచేయక పోవడం వల్ల గుండెలోని కండర ధాతువులు క్రొవ్వుగా మారడం వల్ల కుడివైపు గుండె పెరగడం వల్ల ఉబ్బసం వస్తుంది.

పోలికలు:

ఎపిస్, రూస్టాక్స్, నేట్రమూర్

విరుగుడు:

ఎకోనైట్

ఉద్రేకం:

కప్పుకోకపోవడం

మోతాదు:

3-30 పొటెన్సీలో వాడవచ్చు.

కాలపరిమితి:

6-12 రోజులు ఉంటుంది

తాగుబోతుల్లో వచ్చే గౌట్ వ్యాధికి ఇది మంచి మందు.


హోమియో మందులు-22. ఎసిమిన ట్రిలోబ (Asmina Triloba)

ఇది బొప్పాయి నుండి, కస్టర్డ్ ఆపిల్ నుండి తీసిన ఔషధం. మొక్క నుండి ఔషధ గుణాల్ని రాబట్టినవారు డా॥ హానిమన్‌.

వ్యాధులు:

ముఖం మీద మొటిమలు, ఎర్రగా వచ్చి దురదగా ఉండడం, శరీరం మీద చీముతో కూడిన పొక్కులు, సాయంకాలం దురదలు ఎక్కువగా ఉండడం. హై ఫీవర్. స్కార్‌లెట్ జ్వరంతో ఉండడం, విరేచనాలు ఉంటాయి.

గొంతు నొప్పి, గొంతు బొంగురు పోవడం ఉంటుంది. వీరికి చల్లని వస్తువులు తీసుకోవడం ఇష్టం.

విరేచనం అయిన తర్వాత దౌడ క్రింది గ్రంథులు వాస్తాయి.

పోలికలు:

కాప్సికమ్, బెల్లడోనా

ఉద్రేకం:

తిన్న తరువాత

మోతాదు:

3-30 పొటెన్సీలో, మదర్ టించర్ రూపంలో వాడవచ్చు.

కాలపరిమితి:

10-20 రోజులు ఉంటుంది

గవదబిళ్ళల వాపు, రాచపుండుతో బాధపడేవారికి ఇది మంచి మందు.


హోమియో మందులు – 23. ఎరెకా (Areca)

ఇది పోక చెక్క నుండి గ్రహించిన ఔషధం.

స్థానాలు:

ఈ మందుకి నోరు, ఆంత్రాలు, కండ్లపై ఎక్కువ ప్రభావం ఉంటుంది.

వ్యాధులు:

ఇది జీర్ణకోశ వ్యాధులకు ఉపయోగపడుతుంది

కండ్లు:

ఇది హ్రస్వదృష్టిని మాన్పుతుంది. వీరికి నోటిలో అధిక లాలాజలం ఊరుతుంది.

మోతాదు:

3X-30 పొటెన్సీలో వాడవచ్చు.

కాలపరిమితి:

2 – 3 వారాలు ఉంటుంది

ఇది ప్రేవుల సంకోచాల్ని అధికం చేయును. ప్రేవుల్లోని క్రిముల్ని నశింపచేయును..

హోమియో మందులు – 24. అజాడిరక్టా యిండికా (Azadirachta India)

దీన్ని వేపచెట్టు నుండి తయారు చేస్తారు. దీన్ని హోమియో ఔషధంగా మలచిన వారు హానిమన్‌.

స్థానాలు:

ఈ మందు తల, చెవులు, నోరు, గొంతు, అన్నకోశం, పొత్తికడుపు, మలాశయం, శ్వాసావయవాలు, కాళ్ళు, చేతులపై ప్రభావం చూపుతుంది.

వ్యాధులు:

ఇది శ్వాసకోశ వ్యాధులు, చర్మరోగాలు, జ్వరాలు, మేహవాత రోగాలుకు ఉపయోగ పడుతుంది.

పోలికలు:

చైనా, ఆర్స్, నేట్రమూర్, నక్స్‌వామికా లను పోలి ఉంటుంది.

ఉద్రేకం:

వీరు ఉదయాన, బహిరంగమైన గాలిలో సంచరించడం వల్ల ఉద్రేకం చెందుతారు.

మోతాదు:

6-200 పొటెన్సీలో, మదర్ టించర్ రూపంలో వాడవచ్చు.

కాలపరిమితి:

5-10 రోజులు ఉంటుంది.

మానసిక లక్షణాలు:

విచారంగా, మతిమరుపు ఉండి, జ్ఞాపక శక్తి తగ్గుతుంది.

శారీరక లక్షణాలు:

తల:

తరచుగా వచ్చే తలనొప్పి ఉదయాన వస్తుంది, కూర్చుని లేచినప్పుడు తల తిరుగుచున్నట్లుంటుంది. వీరి తలపై చర్మం, తల వెంట్రుకల్ని సైతం పట్టుకున్న ఎడల తలనొప్పి ఉంటుంది.

కళ్ళు:

వీరికి కళ్ళు మంటగా ఉండి నీరు కారడం, కనుగ్రుడ్డులో నొప్పి ఉంటుంది.

నోరు:

నోరు విప్పినప్పుడు చెవిలో హోరుమనే శబ్దం వినబడడం, లాలాజలం ఉప్పగా ఎక్కువగా ఊరడం, ఏమి తిన్నా రుచి చేదుగా ఉండి సహించక పోవడం ఉంటుంది. వీరికి దప్పిక లేకపోవడం, ఆకలి ఎక్కువగా ఉండి తియ్యని వస్తువుల్ని తినాలనే కోరికగా ఉండడం, చన్నీటిని కోరడం ఉంటుంది.

పొత్తికడుపు బాధగా ఉండి, బొడ్డు దగ్గర నులిమినట్లు బాధలుండి దుర్వాసనతో కూడిన అపాన వాయువులు రావడం వుంటుంది. ప్లీహం వాపు ఉంటుంది. మలబద్దకం వల్ల చిరాకుగా ఉండి మలవిసర్జన కొద్దిగా అవుతుంది.

జననేంద్రియ లక్షణాలు:

పురుషుల్లో కామోద్రేకంతో ఎక్కువ సంభోగేచ్ఛ ఉంటుంది.

శ్వాసకోశ లక్షణాలు:

తరచూ దగ్గుతో కఫం తెల్లగా చిన్న చిన్న ముద్దలుగా రావడం వుంటుంది. స్నానానంతరం విడవనటువంటి దగ్గు ఉంటుంది.

చర్మవ్యాధి లక్షణాలు:

కాళ్ళు, చేతులు మొద్దుబారి, తిమ్మిరులుగా ఉండడం, చర్మం సూదులు గ్రుచ్చినట్లుండి దురదగా, గరుకుగా ఉంటాయి.

జ్వరాలు:

సాయంకాలం నుండి అర్ధరాత్రి వరకు జ్వరం ఉండి ముఖంలో, కండ్లు, చేతులు, అరికాళ్ళలో మంటగా, వెచ్చగా ఉండి ఎక్కువగా చెమటలు నుదుటి నుండి పొత్తికడుపు వరకు వ్యాపిస్తాయి. మలేరియా జ్వరాలకి ఇది మంచి మందు.

కలలో దెబ్బలాడినట్లు ఉండేవారికి ఇది మంచి మందు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version