Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-34

[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]

హోమియో మందులు-36: సినా (Cina)

దీన్ని వర్మ్ రెమిడీ అని వ్యవహరిస్తారు. వర్మ్ సీడ్‌గా పిలవబడే ఈ మొక్క నుండి హానిమన్ ఔషధ గుణాల్ని రాబట్టడమైనది. ఆర్టిమిషియా మరిటమా అనే మొక్క పుష్పించేదశలో దీన్ని ఔషధంగా మారుస్తారు.

స్థానాలు:

ఈ మందు జీర్ణకోశం, ప్రేవులపై ప్రభావం చూపుతుంది.

వ్యాధులు:

ఇది పిల్లల వ్యాధులు, జ్వరాలు, అపస్మారకంకి మంచి మందు.

విరుగుళ్ళు:

కాంఫర్, కాప్సికం, ఇపెకాక్, మెర్కూరియస్ దీనికి విరుగుళ్ళు.

పోలికలు:

నక్స్, ట్యూర్రియమ్, మారం వీరమ్ మందులతో దీన్ని పోల్చవచ్చు.

మోతాదు:

3-M పొటెన్సీలో వాడవచ్చు. నరాల వ్యాధులతో బాధపడేవారికి, పిల్లలకి 30-200 పొటెన్సీలో వాడవచ్చు.

కాలపరిమితి:

1-7 రోజులు ఉంటుంది.

ఉద్రేకం:

వీరికి ఉదయం, సాయంకాలం, తాకుడు వల్ల, భోజనానంతరం, వేసవిలో సూర్యరశ్మి వల్ల, క్రిమి దోషం వల్ల, బహిరంగమైన గాలిలో నడవడం వల్ల ఉద్రేకిస్తుంది.

ఉపశమనం:

వీరికి కదలిక వల్ల, బోర్లా తిరిగి పడుకోవడం వల్ల ఉపశమనం ఉంటుంది.

మానసిక వ్యాధులు:

వీరు మానసికంగా బిడ్డను ముట్టుకొనుటకు, ఎత్తుకొనుటకు యిష్టపడరు.

శారీరిక వ్యాధులు:

తల:

ఒకసారి తలనొప్పి ఉంటే మరొకసారి పొత్తి కడుపులో బాధ ఉండి, ముందుకు వంగుట వల్ల తగ్గుతుంది. పడక నుండి లేచినపుడు తల తిరిగినట్లుండి నిద్ర వల్ల ఉపశమిస్తుంది. ఎక్కువగా చదివినా, సెల్, కంప్యూటర్లు ఎక్కువగా చూసినా వచ్చే తలనొప్పికి ఇది మంచి మందు.

ముఖం:

వీరి ముఖం పాలిపోయి జబ్బు పడినవానివలె ఉంటుంది. ముఖం మీద చల్లని చెమటలెక్కువగా పడతాయి. ముఖం వెచ్చగా, ఎర్రగా ఉంటుంది.

కండ్లు:

మద్యం వల్ల దష్టి మందగిస్తుంది. కండ్ల నుండి నీళ్ళు కారుతుంది.

చెవులు:

ఎక్కువ దురదగా ఉండి గోకుతుంటారు, సరిగా వినపడవు.

ముక్కు:

విపరీతమైన తుమ్ములు, దురద వల్ల వ్రేళ్ళతో ముక్కును నలుపుకోవడం వల్ల ముక్కునుండి రక్తం స్రవిస్తుంది.

జీర్ణకోశం:

భోజనం చేసిన వెంటనే తిరిగి ఆకలిగా ఉండి, తీపి వివిధ వస్తువుల్ని తినాలనిపించడం, దాహంగా ఉండడం  జరుగుతుంది. ఒకప్పుడు ఎక్కువ ఆకలిగా ఉండి, మరొకప్పుడు ఆకలి ఉండదు. ఆహార పానీయాల్ని తీసుకొన్న పిదప వాంతులు, విరేచనాలు కావడం ఉంటుంది, వాంతులలో పురుగులు పడడాన్ని నివారిస్తుంది.

పిల్లల్లో కడుపులో నొప్పితో మెలికలు తిరగడం, కడుపు ఉబ్బరం ఉంటుంది. ఆసనం ఎక్కువగా దురదగా ఉంటుంది. మలం తెల్లగా పల్చగాను ఒక్కోసారి నల్లగా, గట్టిగా పోతుంది. కడుపులో నులిపురుగుల వల్ల గ్రుచ్చుచున్నట్లు బాధగా ఉంటుంది.

రాత్రి సమయాల్లో అప్రయత్నంగా, నిద్రలో మూత్రవిసర్జన చేయడం, తరచు మూత్రానుమానం ఉండడాన్ని నివారిస్తుంది. స్త్రీలలో రజస్వలకు పూర్వమే రక్తస్రావాలుంటాయి.

శ్వాసకోశం:

ఉదయం  లేచిన  వెంటనే  దగ్గువల్ల  రొమ్మెముక  వద్ద  బాధగా  ఉంటుంది. తెల్లని కఫం స్వల్పంగా రక్తజీరతో వస్తుంది. బిడ్డ దగ్గు వచ్చునేమోయను భయం వలన మాట్లాడుట. కదులుట మానివేస్తుంటారు. ఆరుబైట గాలిలో తిరిగిన, పానీయాలు త్రాగిన దగ్గు వచ్చి ఊపిరాడుట కష్టంగా ఉంటుంది.

పిల్లల్లో రాత్రిళ్ళు ఫిట్స్ రావడం, స్థిమితం లేక ఏడ్వడం, బాధతో కేకలు వేయడం, మాట్లాడడం తరచు ఆవలింతలు రావడం, శరీరం వెచ్చగా ఉంటుంది.

నిద్రలో దంతాలు కొరకడం, కేకలు వేయడం, మాట్లాడుతుంటారు

జ్వరం:

సాయంకాలం వచ్చు చలితో కూడిన జ్వరమెక్కువగా ఉన్నప్పటికి, ఆకలి, దాహం కూడా ఎక్కువగా ఉంటుంది. జ్వరంలో ముఖం చల్లగా, చేతులు వెచ్చగా ఉంటాయి. చేతులు, ముక్కు, నుదురుపై చల్లని చెమటలు పడతాయి. దడుపు జ్వరంతో ఫిట్స్ వచ్చినప్ప్పుడు వాంతులు అయి, ఎక్కువ ఆకలి కల్గుతుంది. శరీరం చలిగా గాని, వెచ్చగా గాని ఉంటుంది.

చేతులలో చీల్చుచున్నట్లు బాధగా ఉంటుంది. ఇలాంటి వారికిది సూచించదగ్గ మందు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version