Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-35

[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]

హోమియో మందులు-37: సిక్యూటా విరోసా (Cicuta Virosa)

వాటర్ హెమ్లాక్, కన్వల్షన్‌గా పిలవబడే వక్షజాతికి చెందిన వేరు నుండి ఈ హోమియో మందుని తయారు చేసినవారు హానిమన్.

స్థానాలు:

ఈ మందుకి నరాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

వ్యాధులు:

ఇది నరాల బలహీనత, అపస్మారం, ఫిట్స్, మూర్ఛలు, హిస్టీరియాకి మంచి మందు.

పర్సనాలిటీ:

వీరు నల్లని శరీరఛాయతో బిగిలేని కండరాలతో ఉంటారు.

కారణాలు:

వీరిలో మెదడు, వెన్నుపాముకు కల్గు అదురుపాటు. చర్మవ్యాధులణగారడం వల్ల నరాల వ్యాధులొస్తాయి.

పోలికలు:

హైపరికం, నక్స్, హైడ్రోసయానిక్ ఆసిడ్ మందులతో దీన్ని పోల్చవచ్చు.

విరుగుళ్ళు:

ఆర్నికా, ఓపియం మందులు దీనికి విరుగుళ్ళు.

ఉద్రేకం:

వీరికి స్పర్శవలన, చుట్ట కాల్చడం, పొగాకు, చల్లదనం వల్ల వ్యాధి లక్షణాలు ఉద్రేకిస్తాయి.

ఉపశమనం:

వీరికి వెచ్చదనం వల్ల ఉపశమనం ఉంటుంది.

మోతాదు:

6-200 పొటెన్సీలో దీన్ని వాడవచ్చు.

మయాజమ్:

వీరిది సోరా మయాజమ్.

మానసిక లక్షణాలు:

వీరికి పిచ్చిపట్టినట్లు నవ్వడం, నాట్యం చేయడం, వింత వింత ఊహలు రావడం ఉంటుంది. తన పేరు కూడా మర్చిపోవడం, పరధ్యానంగా ఉండడం, మెదడు మొద్దుబారడం, మనస్సు నిలకడ లేకపోవడం, ఎవ్వరిమీద నమ్మకం లేకపోవడం ఉంటుంది.

శారీరక లక్షణాలు:

తల:

తలకు దెబ్బ తగలడం వల్ల కలిగే కంపాలు, మెడ త్రిప్పివేసినట్లు, కండరాలలో ముడుచుకున్నట్లు, నొక్కుచున్నట్లుంటుంది. తలమీద పసుపుపచ్చని చీముతో కూడిన కురుపులుంటాయి.

తలకు సంబంధించిన లక్షణాలు, అపాన వాయువు వదిలిన తర్వాత ఉపశమిస్తాయి.

కళ్ళు:

చదువుచున్నప్ప్పుడు అక్షరాలు మాయమైనట్లు. తిరుగునట్లు, పైకి, క్రిందికి పోవునట్లుండడం, వస్తువులు మామూలు కన్న రెట్టింపుగా, నల్లగా ఉండడం, రాత్రులందు కండ్లు అంటుకొనుట ఉంటుంది.

చెవులు:

చెవుల నుండి రక్తస్రావమవడం, గుటక వేయునపుడు కుడి చెవిలో ప్రేలినట్టు శబ్దం వస్తుంది. దీనివల్ల చెవులు సరిగా వినిపించవు.

పండ్లు:

పండ్లు వచ్చునప్ప్పుడు, పండ్లనుగాని, చిగుళ్ళుకాని కొరకడం, దౌడలు దగ్గర నొక్కివేసినట్లుంటుంది. పండ్లు కొరకడం ఉంటుంది.

ముఖం:

ముఖంపై పసుపు పచ్చ పొక్కులు, రసికారడం, పక్కులు కట్టడం ఉంటుంది. ముఖం నుండి తల నోటి చివుర్లు, గడ్డం మీదకి కూడా ప్రాకి మంటతో, బాధతో ఉండి, ముఖం ఎర్రగా కందినట్లుంటుంది. క్రింది దౌడ గడ్డంకు కల్గు సైకోసిస్‌కి ఇది మంచి మందు.

గొంతు:

గొంతు ముడుచుకొనిపోవడం వల్ల పొడిగా ఆర్చుకొనిపోయి ఉండడం, గుటక వేయడం కష్టంగా ఉంటుంది. ఆహారం మ్రింగినపుడు, గ్రుచ్చుకున్నట్లు గొంతుకలో నొప్పి ఉంటుంది. మాట్లాడునప్పుడు తల వణుకు రావడం, నోటి వద్ద నురుగ, చొంగ రావడంతో దౌడ దగ్గర పడతాయి.

జీర్ణకోశ లక్షణాలు:

నోరు ఆర్చుకొని పోవడం, సుద్దబొగ్గు తినవలెనని కోరిక ఉండడం, ఆకలి లేకపోవడం, భోజనానంతరం శూల, బాధ, మగత, విపరీతమైన ఎక్కిళ్ళు వస్తాయి. దీనివల్ల రోగికి ఏడ్పు వస్తుంది. దీనివల్ల వాంతులవుతాయి. భోజనం చేయుచున్నప్ప్పుడు తలత్రిప్ప్పుగా ఉంటుంది. పిల్లల్లో నులిపురుగులుండడం వల్ల కంపంతో కూడిన ఫిట్స్ వస్తాయి. పొత్తికడుపులో గ్యాస్ ఎక్కువగా చేరడం వల్ల బాధగా, పొట్ట ఎత్తుగా బరువుగా ఉండి గురగురలాడుతుంది.

మలం పచ్చగా, అతి తరచుగా పోవడం వల్ల ఆసనం దురదగా ఉంటుంది. ఉదయాన ఆపుకోలేనంతటి మూత్రానుమానంతో పాటు నీళ్ళ విరేచనాలవుతాయి.

జననేంద్రియ లక్షణాలు:

పురుషులు:

శృంగార సంబంధమైన కలలు లేకుండగనే స్ఖలనమవుడం, బీజాలు పైకి లాగడం ఉండి, గనేరియా వల్ల మూత్రనాళం అప్పుడప్పుడు మూసుకోనిపోతుంది.

స్త్రీలు:

బహిష్టు రావలసిన సమయం కన్నా ఆలస్యంగా రావడం. బహిష్టులో బాధ ఉండి నడుంలో దిగువ భాగాన చీల్చుచున్నట్లుంటుంది.

మూత్రకోశానికి పక్షవాతం వల్ల మూత్రమప్రయత్నంగా తరచుగా విసర్జించడం, మూత్రం ఒక్కోసారి పోకపోవడం, మరొకసారి వడిగా ఎక్కువగా పోతుంటుంది.

రుమాటిక్ లక్షణాలు:

నడుం ధనస్సు వలె వంగడం, మెడలోని కండరాల్లో నొక్కినట్లు బాధలు ఆగాగి రావడం ఉంటుంది. వంగిన అవయవాలు నిటారుగా చేయుట కష్టమవడం, వ్రేళ్ళలో చైతన్యశక్తి లేనట్లుండి చేతులు, కాళ్ళు వ్రేళ్ళు కంపం వస్తుంది. కాళ్ళు చేతులు, శరీరమంత భయంకరంగా వంకరలు తిరిగి తిరిగిపోవడం, శరీరం విల్లు వలె వంగి స్పహ ఉండదు. అతి స్వల్ప స్పర్శ వల్ల, శబ్దం వల్ల, కుదుపుల వల్ల మరల పొర్లు కల్గుతుంది. రాత్రిళ్ళు తరచుగా మూర్ఛలు వస్తాయి. స్త్రీలలో ప్రసవానంతరం, పిల్లల్లో పండ్లు వచ్చేటప్ప్పుడు, కడుపులో నులిపురుగులున్నప్ప్పుడు మెదడు వ్యాధులుఎక్కువగా వస్తాయి. శరీరం పైభాగం చాలా వ్యాధి గ్రస్థమవుతుంది. ముఖం ఎర్రగా లేదా నీలిగా మారి, దౌడలు బిర్రబిగిసి ఉంటాయి.

రాత్రిళ్ళు కలలు ఎక్కువగా రావడం వల్ల అధిక చెమటలతో (పొట్ట) నిద్ర పట్టదు. నిద్రలో తరచు మెలకువ వస్తుంది. శరీరం చల్లగా ఉండడం వల్ల రోగి వెచ్చదనాన్ని కోరడం, జ్వరంతో కంపాలు కల్గుతాయి. కొరియావంటి మెదడు వ్యాధులకిది మంచి మందు.

ఛాతీ బిగపట్టినట్లుండ వల్ల ఊపిరి తీసుకొనుట కష్టంగా ఉండుట, గుండెలో వెచ్చగా, మంటగా ఉండటం, మాట బొంగురుగా రావడం, ఎక్కువ స్రావంతో కూడిన దగ్గు ఉంటుంది.

ఇలాంటికి వారికిది సూచించదగ్గ మందు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version