Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-37

[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]

హోమియో మందులు-39: సిమిసిఫ్యూగా, ఏక్టియా రెసిమోజా (Cimicifuga)

ఉత్తర అమెరికాలో విస్తారంగా పెరిగే బ్లాక్ స్నేక్ రూట్, బ్లాక్ కోహోష్‌గా పిలవ బడే ఈ మూలిక నుండి 1856లో డా॥ సి.జె.హెంపెల్ ఔషధ గుణాల్ని రాబట్టడమైనది.

స్థానాలు:

ఈ మందుకి నరాలు, కండరాలు, స్త్రీ జననేంద్రియాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

వ్యాధులు:

ఇది గర్భాశయ వ్యాధులు, నరాల, కండరాల వ్యాధులకు ఉపయోగపడుతుంది.

పోలికలు:

ఇగ్నేషియా, లిలియంటిగ్, నేట్రంమూర్, పల్సటిల్లా, సెపియా మందులతో దీన్ని పోల్చవచ్చు.

ఉద్రేకం:

వీరికి ఉదయం, చల్లదనం వలన, బహిష్టు సమయం లోనూ, చల్లగాలి వల్ల వ్యాధి లక్షణాలు ఉద్రేకిస్తాయి.

ఉపశమనం:

వీరికి వెచ్చదనం వల్ల, భోజనం తర్వాత కదలడం వల్ల, ఒత్తిడి వల్ల, బహిరంగ గాలిలో ఉండడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

ఇది ఎడమవైపు పనిచేయు మందు.

కారణాలు:

త్రాగుట వలన, నరాల వ్యాధుల వలన, చల్లగాలి వలన కలిగే దుష్పలితాలకిది మంచి మందు.

మోతాదు:

30 X – 1M పొటెన్సీలో దీన్ని వాడవచ్చు.

కాల పరిమితి:

2-4 వారాలు ఉంటుంది.

మానసిక లక్షణాలు:

ఏదో అపాయం రానున్నదని మానసికంగా దిగులు చెందడం, సంధి లక్షణాలుండటం, మానసికంగా ఆత్మహత్య తలంపు కలుగుట, అదే పనిగా మాట్లాడడం (ఒక టాపిక్ గురించి మాట్లాడుతూ పూర్తి కాకుండగనే వేరొక టాపిక్ గూర్చి) తనకు పిచ్చెక్కుననే భావన ఉంటుంది.

శారీరిక లక్షణాలు:

తల:

మానసిక ఒత్తిడి వల్ల, ఎక్కువగా చదువుట వల్ల, గర్భాశయ రోగాలతో వచ్చెడి తలనొప్పి వల్ల తల పైభాగం, నొప్పిగా ఉంటుంది. విద్యార్థుల్లో తలవెనుక భాగం నుండి నడినెత్తిలోనికి ప్రాకెడి నొప్పి వల్ల తల బరువుగా ఉంటుంది. పార్శ్వపు నొప్పి మానిన తర్వాత వచ్చెడి వెర్రితనానికిది మంచి మందు. శరీరం మీద ఏవో ప్రాకుచున్నట్లుంటుంది. సంభోగానంతరం తలనొప్పి ఎక్కువై ఆరుబైట గాలిలో తగ్గుతుంది. తలపై భాగం ఎగిరిప్యేంత తలనొప్పి ఉంటుంది.

కండ్లు:

కనుగ్రుడ్లలో పోటుగా ఉండి, తలలోనికి ప్రాకడం వల్ల, వెలుతుర్ని చూడలేరు. కదలిన ఎక్కువై నొక్కుట వల్ల ఉపశమిస్తుంది.

ముఖం:

ముఖం పాలిపోయి, కండ్లు లోతున పడి నీరసంగా ఉంటుంది. తరచు వెచ్చగా ఉండడం వల్ల పెదవులు ఆర్చుకొనిపోయి బీటలు బారి ఉంటుంది. చెవులలో ధ్వనులు వినిపిస్తుంటాయి.

నోరు:

నోరు దుర్వాసనతో కూడి నాలుక, నోరు వెచ్చగా ఆర్చుకొనిపోయి ఉంటుంది.

గొంతు:

గొంతువాపులో బాధగా ఉండి, కఫం వస్తుంది. మెడ నరం పట్టినట్టుగా ఉంటుంది.

జీర్ణకోశం:

జీర్ణకోశంలో పథ్యం వల్ల తలత్రిప్ప్పు వల్ల వికారం, కొరుకుచున్నట్లు  బాధగా  ఉండి, కడుపు లోతుకు పోవుచున్నట్లు ఉంటుంది. పొత్తి కడుపులో పుండు పడినట్లు నొప్పిగా ఉండి, నడుంను వంచిన, విరేచనానంతరం ఉపశమిస్తుంది. ఒక్కోసారి మలబద్దకం, మరొకసారి పల్చగా, నల్లని నీళ్ళ విరేచనాలు అవుతుంటాయి. మూత్ర పిండాల వద్ద, నడుంలో, నొక్కుచున్నట్లు నొప్పి ఉండి, మూత్రం ఎక్కువగా వెడలుతుంది.

స్త్రీ జననేంద్రియాలు:

గర్భాశయంలో బరువుగా బాధగా ఉండి, బహిష్టు స్రావమెక్కువగా గడ్డలు గడ్డలుగా కడుపు నొప్పితో అవుతుంది. బహిష్టులో స్రావమెంత ఎక్కువగా ఉండునో బాధ కూడా అంత ఎక్కువగా ఉంటుంది. బహిష్టులో అపస్మారకం, హిస్టీరియా, ఫిట్స్ మానసిక లక్షణాలుద్రేకిస్తాయి. అండాశయంలో బాధగా ఉంటుంది.

గర్భిణీ స్త్రీలలో తలత్రిప్ప్పు వాంతులుంటాయి. వేవిళ్ళు, స్తనాలలో మంటగా ఉంటుంది. ఈ మందు గర్భస్రావాన్ని అరికడుతుంది. ప్రసవ వేదనలో ముందుగా వచ్చే వణుకును, నరాల ఉద్రేకం వల్ల కల్గు కంపాలకు, గర్భకోశ ద్వారం గట్టిగా ముడుచుకొనిపోయినప్ప్పుడు దీన్ని వాడవచ్చు. ప్రసవానంతరం గజ్జలలో నొప్ప్పులు, జ్వరం ఎక్కువగా ఉంటాయి. శీతలం వల్లగాని, మనోవికారం వల్లగాని బహిష్టులు అణిచిపెట్టబడతాయి. ముట్లాగిపోయేటప్పుడు, భగ్న ప్రేవు వల్ల వచ్చే వ్యాధులకిది మంచి మందు.

రాత్రిళ్ళు ఉద్రేకించు పొడిదగ్గు వల్ల, నరాల ఉద్రేకం ఉంటుంది. కదలిక వల్ల గుండె దడ ఎక్కువై, నొప్పిగా ఉండి, ఊపిరాడనట్లు ఉంటుంది.

నడుం, మెడ వద్ద నరం పట్టి నొప్పిగా ఉండి, కలుక్కుమన్నట్లు శబ్దమవుతుంది. కీళ్ళ సంధులలో వెచ్చగా, వాపుగా ఉంటుంది. కండరాలలో నొప్పి వల్ల నిద్ర పట్టకపోవడం, అస్థిమితంతో కూడిన నిద్ర వల్ల, మాటలు, చిన్న శబ్దాలు వినపడిన నిద్రాభంగం అవుతుంది. వ్రాయుచున్నప్ప్పుడు వ్రేళ్ళు వణకడం, చేతులకి చెమటలు పడతాయి. పిల్లలకి పండ్లు వచ్చే కాలంలో నరాల ఉద్రేకం వల్ల నిద్రపట్టని వారికిది సూచించదగ్గ మందు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version