[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
డయాస్కోరియా విల్లోసా (Dioscorea villosa)
ఇది వైల్డ్ యామ్‌గా ఉత్తర అమెరికాలో దక్షిణ భాగమందు సంవత్సరం పొడవునా అధికంగా ప్రాకెడి ఒక విధమైన తీగె. దీని వ్రేళ్ళ నుండి హోమియో మందుని తయారు చేసినవారు డా॥ కషింగ్, బర్ట్‌లు.
స్థానాలు:
ఈ మందుకి జీర్ణకోశం, నరాలు, బొడ్డుపై ప్రభావం ఎక్కువ.
వ్యాధులు:
ఇది జీర్ణకోశ వ్యాధులు, జననేంద్రియ వ్యాధులకు ఉపయోగపడుతుంది.
పోలికలు:
నక్స్, కోనియం, జెల్సీమియం, ఏగ్నస్, కలేడియం మందులతో దీన్ని పోల్చవచ్చు.
కారణాలు:
టీ త్రాగడం వల్ల కలిగే వ్యాధులు.
పర్సనాలిటీ:
వీరు ముసలివారైన, యువకులైన జీవశక్తులు దుర్బలంగా ఉన్నవారు. ఇది కుడివైపు పనిచేయు మందు.
మోతాదు:
2-30 పొటెన్సీలో దీన్ని వాడవచ్చు.
కాల పరిమితి:
30-40 రోజులు.
ఉద్రేకం:
వీరు ముడుచుకోవడం, పడుకోవడం, టీ వలన భోజనం చేయుటచే, కూర్చోవడం, ముందుకు బాగా వంగడం వల్ల లక్షణాలు ఉద్రేకిస్తాయి.
ఉపశమనం:
వీరికి చాచుకోవడం వల్ల, వెనకకు వంగిన, కదులుటచే, బహిరంగమైన గాలిలో, గట్టి ఒత్తిడిచే, అలిసియున్నను నడవవలసి రావడం వల్ల ఉపశమనం ఉంటుంది.
సహచరులు:
కోలోసింధ్, ఫాస్ఫరస్, పొడోఫైలం, రూస్టాక్స్, సైలీషియా దీనికి సహచరులు.
మానసిక లక్షణాలు:
వస్తువులకి మారుపేర్లు పెట్టి చిరాకుతో ఒంటరిగా ఉండాలనుకోవడం ఉంటుంది.
శారీరక లక్షణాలు:
తల:
నుదటిలో దిమ్ముగా ఉండి, నొక్కనచో రిలీఫ్ ఉంటుంది.
కళ్ళు:
కళ్ళు మంటగా ఉండి నీరు కారడం, కనురెస్సులు అంటుకుని పోవడం, దృష్టిలోపాలుంటాయి.
చెవులు:
చెవుల్లో గుబిలి ఉండ వలె ఉండడంతో చెవిపోటు ఉంటుంది.
ముక్కు:
తరుచు ముక్కులో దురదలో కూడిన తుమ్ములు రావడం, ఎడమ వాడికా నుండి ఎర్రని రక్తం స్రవించడం, పైత్యాజ్వరం వచ్చినప్పుడు ముక్కు నుండి దుర్వాసన వస్తుంది.
ముఖంపై చిన్న చిన్న మొటిమలు వచ్చి నల్లని కాలవలతో ఉంటాయి.
నోరు ఆర్చుకొనిపోయి చేదుగా, జిగురుగా, గోధుమ వర్ణం పూత ఉండి నిద్రలో లాలాజలం బైటికి రావడం ఉంటుంది. గొంతు ముడుచుకొని పోయినట్లుండి, మంటగా ఉండి, కుట్టుచున్నాట్లు ఇప్పి చెవుల వరకు వ్యాపిస్తుంది.
తలనొప్పి భోజనమైన తర్వాత, త్రేన్పులు వచ్చిన తర్వాత తగ్గుతుంది, కడుపులో బాధలు ఆకస్మికంగా ఒకచోటు నుండి మరొక చోటుకి మారడం, కడుపుల్లో గుడగుడు లాడుచు ఎక్కువగా ఆపానవాయువులు పోవడం ఉంటుంది. పొత్తికడుపు ముట్టుకొన్న నొప్పిగా ఉండి కోయుచున్నట్లు, గోకుచున్నట్లు బాధగా ఉండి నడిస్తే రిలీఫ్ ఉంటుంది. కాలేయాంలో గొప్పి ఎక్కువగా ఉండి కుడి ఛాతీ ఎముక వరకుంటుంది. మలవిసర్జనకు తొందరపడతారు.
జీర్ణకోశ లక్షణాలు:
టీ త్రాగే అలవాటున్న వారిలో, ఏ పదార్థమైన తిన్న పిమ్మట కడుపుబ్బరం, ప్రేగుల్ని మెలిపెట్టినట్లు నొప్పి పొర్లు పొర్లుగా రావడం, సరిగ్గా నొప్పి ఒకే టైమ్‌కి రావడం. ముందుకు వంగిన, పడుకున్న ఎక్కువై, నిటారుగా నిలబడిన, వెనకకు వంగిన, వళ్ళు విరుచుకున్న, అటుఇటు తిరగడం వల్ల, ఆరుబైట నడిచినా ఉపశమిస్తుంది. బొడ్డు నుండి శూల బయలుదేరి దేహమందలి ఇతరావయవాలకు వ్యాపిస్తుంది. నొప్పి కడుపులో తగ్గి, ఛాతీలో, కాళ్ళు చేతులకు మారుతుంది.
కడుపునొప్పితో విరేచనాలు ఉదయాన ఎక్కువగా కావడం, పల్చగా, పచ్చగా, జిగురుగా, విస్తారంగా, దుర్వాసనతో ఉండడం, విరేచనానంతరం ఆసనంలో చాలా బాధగా ఉంటుంది. పెద్ద పెద్ద కాయల వలె ఉండు మొలల వల్ల ఆసనంలో దురద, బాధ ఉండి విరేచనానంతరం మూత్రాశం వెలుపలికి వచ్చేవారికి ఇది మంచి మందు.
ఉదరం వాయుపూరిత మగుటచే గాల్ బ్లాడర్‌లో రాళ్ళేర్పడతాయి. గాల్‌స్టోన్ కోలిక్‌కి ఇది మంచి మందు.
జననేంద్రియ లక్షణాలు:
స్త్రీలలో:
బహిష్టు సమయంలో ఋతుశూల ఉంటుంది. గర్భవతిగా ఉన్నప్ప్పుడు కల్గు జీర్ణకోశ బాధలకు ఇది మంచి మందు. గర్భిణీలలో దొంగనొప్పులకు, ప్రసవానంతర నొప్పులకిది మంచి మందు.
మూత్రపిండాల నుండి వచ్చే నొప్పి కుడి బీజం, కుడి కాలుకి వ్యాపించడం.
పురుషుల్లో:
జననేంద్రియాలపై ఘాటైన వాసనగల చెమట పట్టి, స్ఖలనాలు ఒకే రాత్రి 2 -3 సార్లు అయి, మోకాళ్ళు నిస్త్రాణగా ఉండడం, అనంతరం జననేంద్రియం పటుత్వం లేనిదై చల్లగా ఉండి, సంభోగేచ్ఛపోయి తెలియకుండానే స్థలనమవడం, శుక్రనష్టం, నపుంసకత్వంకిది మంచి మందు.
కుడివైపు సయాటికాకి ఇది మంచి మందు. కదలకుండా కూర్చొన్నప్ప్పుడు నొప్పి నుంచి ఉపశమనం కల్గుతుంది. గోరు చుట్టునందు నొప్పి కన్పించగనే చీము పట్టకుండా చేసి, బాధని తగ్గిస్తుంది. పుప్పిగోళ్ళకిది మంచి మందు.
మూత్రనాళం నుండి చిన్న చిన్న రాళ్ళు వెళ్ళడం వల్ల బాధలో గిజగిజలాడుతారు.
రొమ్ము ఎముకల వద్ద కట్టివేసినట్లు నొప్పిగా ఉండడం వల్ల శ్వాస తీయునప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. గొంతులో ఇరిటేషన్ ఉండి, దగ్గు వస్తుంది. గుండెలో పొడుచు చున్నట్లు బాధ ఉండి ఊపిరాడదు.
మెడ నరం పట్టివేయడంతో ఎడమభుజంలో, మోచేతిలో నములుచున్నాట్లు బాధగా ఉంటుంది. నడుం నొప్పి ఉండి వంగిన ఎక్కువవుతుంది. మోకాళ్ళలో బలం లేకపోవడం వల్ల నొప్పితో వణుకుతుంటాయి. నిద్ర ఆలస్యంగా వచ్చి త్వరగా మెలకువ వస్తుంది.
ఇలాంటి లక్షణాలున్న వారికిది సూచించదగ్గ మందు.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.
