Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-47

[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]

హోమియో మందులు-50: హెలోనియస్ (Helonias Dioica)

యూనికార్న్ ప్లాంట్ అని పిలవబడే వృక్షజాతికి చెందిన మొక్క నుండి ఔషధ గుణాల్ని రాబట్టడమైనది.

స్థానాలు:

ఈ మందుకి స్త్రీ జననేంద్రియాలు, బ్రెయిన్‌పై ప్రభావం ఎక్కువ.

వ్యాధులు:

ఇది మానసిక, జననేంద్రియ వ్యాధులకు ఉపయోగపడుతుంది.

పోలికలు:

ఎలట్రిస్ ఫేరినోసా, లిలియం ట్రిగ్రినం, పల్సటిల్లా, సైలీషియా, స్టేనం మెట్ మందులతో దీన్ని పోల్చవచ్చు.

విరుగుళ్ళు :

లిలియంటిగ్రినం దీనికి విరుగుడు.

ఉద్రేకం:

వీరికి తాకుడు, నడక వల్ల లక్షణాలు ఉద్రేకిస్తాయి.

ఉపశమనం:

వీరికి మానసిక శ్రమ వల్ల ఉపశమనం ఉంటుంది.

కారణాలు:

శారీరక, మానసిక శ్రమ, శరీర వ్యాయామం లేకపోవడం అనేక వ్యాధులు కలుగుతాయి.

మోతాదు:

30-200 పొటెన్సీలో, మదర్ టించర్ రూపంలో దీన్ని వాడవచ్చు.

కాలపరిమితి:

20-30 రోజులుంటుంది.

పర్సనాలిటీ:

వీరికి శరీరపోషణ తక్కువగుటచే కల్గు నీరసం ఉంటుంది. వీరి ముఖం పాలిపోయి మట్టిరంగును పోలి వుంటుంది. పైత్యం ఎక్కువగా ఉంటడం వల్ల పగటి నిద్రతో మత్తుగా ఉంటుంది. కడుపులో మంటగా, బాధగా ఉంటుంది.

మానసిక లక్షణాలు:

మానసికంగా విచారంగా ఉండి ఒంటరిగా ఉండ కోరుతారు. తాను చెప్పిన అభిప్రాయాలు ఇతరులు కాదనుటను సహించలేకపోవడం ఉంటుంది. ఇతరుల సలహా పుచ్చుకొనుట యందు ఇష్టముండదు. ఆలోచనల వల్ల పని చేయునప్ప్పుడు లక్షణాలుపశమించును. ఏదియో ఒక పని చేయునపుడు, తన వ్యాధిని గూర్చి తలంచునపుడెల్లా సుఖంగా ఉందురు. అస్తిమితంలో నిత్యం అటు ఇటు కదులుతుంటారు. మానసికంగా క్రుంగి ఉంటారు. తేలికగా కోపం వస్తుంది. విసుగులో ఎదురు  చెప్పినా, సలహా చెప్పినా సహించలేరు.

శారీరిక లక్షణాలు:

తలనొప్పి మానసిక శ్రమ వల్ల ఉపశమిస్తుంది. నడినెత్తిన  మంటగా  ఉంటుంది.

వీరిలో ఆకలి లేక ఏ ఆహారం రుచింపక త్రేన్పులు వస్తాయి. కడుపులో మంటగా, బాధగా ఉండి, శరీరం ఉబ్బి ఉంటుంది. వెన్నెముకలో మంటగా, పోట్లుగా ఉంటుంది. కడుపులో గుడగుడలతో, శూలతో నీళ్ళ విరేచనాలు వచ్చినట్లుండి, ఉదయాన విరేచనం పసుపు పచ్చగా, పల్చగా, సాయంత్రం ముద్దలుగా పోతుంది.

మూత్ర పిండాలలో బాధగా ఉండి, మూత్రంలో ఫాస్ఫేట్స్, ఆల్బుమిన్ పోతుంది. డయాబెటిస్, యూరిన్ ఇన్ఫెక్షన్స్‌లో మూత్రానుమానం తరచుగా పోతుంది. శుష్కించి పోవడం పెదవులు పొడిగా ఉండి, అంటుకొనిపోవడం వల్ల అధిక దాహం, అధిక నీరసం, అలసటగా ఉండి నిద్రమత్తులో ఉంటారు. గర్భిణీల్లో వచ్చే డయాబెటీస్ వ్యాధికిది మంచి మందు. పురుషుల్లో సంభోగ వాంఛ, సంభోగ శక్తి ఎక్కువై తరచు అసాధారణమైన స్తంభన కల్గుతుంది. ఇది నపుంసకత్వంని నివారిస్తుంది.

గర్భకోశ పటుత్వం లేకపోవడం వల్ల బహిష్టులు ముందుగా రావడం, స్రావం నల్లగా ముద్దవలె దుర్వాసనలతో కావడం, గర్భాశయ రక్త స్రావాలుంటాయి. రక్తహీనతతో కూడిన తెల్లమైల వల్ల, నిస్త్రాణ వల్ల, జననేంద్రియ దుర్భలత్వం వల్ల గర్భాశయం వెలుపలికి వస్తుంది. గర్భాశయ వ్యాధులతో తలనొప్పి, జననేంద్రియాలు వాచి, ఎర్రగా వెచ్చగా ఎక్కువ దురదగా ఉంటుంది. కటి భాగంలో లాగినట్లు, బరువుగా ఉంటుంది. స్తనాలుబ్బి స్తనాగ్రాలు నొప్పిగా బాధాకరంగా ఉంటాయి. కటిలో పుండు వలె, బరువుగా బాధగా ఉండి, రోగి కదులునపుడు అది కూడా కదులు చున్నట్లుంటుంది. 4 – 6 నెలల మధ్య కలిగే అబార్షన్ వల్ల కలిగే చెడు ఫలితాలకిది మంచి మందు. గుండె దడ ఉంటుంది. ఛాతి ముందు వైపు మరలో పెట్టి నొక్కివేసినట్లు నొప్పి వస్తుంది.

అధిక శ్రమ వల్ల కండరాలలో మంటగా నొప్ప్పులుగా ఉండి, అలసట వల్ల నిద్ర పట్టదు. శరీర పోషణ తక్కువగుటచే కల్గు నీరసానికి ఇది మంచి మందు.

కూర్చున్నప్ప్పుడు పాదాలు మొద్దుబారినట్లుండి, కుడి చట్టలో నొప్ప్పులు కదలిక వల్ల ఎక్కువవుతాయి. నొప్పి, చల్లగాలికి పిక్కలలో నుండి పైకి ఎగబ్రాకుచున్నట్లుంది. గదిలో ఉన్నప్పుడు, కదలికల వల్ల శరీరం వెచ్చగా ఉండేవారికిది మంచి మందు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version