Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-50

[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]

హోమియో మందులు-53. హైడ్రాస్టిస్ (Hydrastis canadensis)

అమెరికాలో విస్తారంగా పెరిగే వృక్షజాతికి చెందిన ఈ మొక్క వేరునుండి తయారుచేసిన కషాయం నుండి ఔషధ గుణాల్ని రాబట్టినవారు డా॥ బర్ట్. దీన్ని ఇండియన్ టర్మరిక్, గోల్డెన్ సీల్, ఆరెంజ్‌సీల్, ఎల్లో రూట్ అని కూడా అంటారు.

స్థానాలు:

ఈ మందు అన్నకోశం,  మూత్రావయవాలు, గ్రంధులు, చర్మం, కండరాలు, గర్భాశయం, లివర్ పై ప్రభావం చూపుతుంది.

వ్యాధులు:

ఇది జీర్ణకోశ వ్యాధులు, చెవి, పంటి, చర్మవ్యాధులు, కేన్సర్ వ్యాధులకు ఉపయోగపడుతుంది.

పర్సనాలిటీ:

వీరు కృశించి నిస్త్రాణ చెందే వృద్ధులు. త్వరగా అలసిపోయే స్క్రాపులస్ తత్వంగలవారు.

టెంపర్‌మెంట్:

లింఫాటిక్ టెంపర్‌మెంట్ ఉన్నవారికి సరైన మందు.

ఉద్రేకం:

వీరికి రాత్రి, కదలిక, వెచ్చదనం, బహిష్టు తర్వాత, సంభోగం, పొడిగాలికి ఎక్కువవుతుంది.

ఉపశమనం:

వీరికి విశ్రాంతి, శరీరం నొక్కుటవల్ల ఉపశమనం ఉంటుంది.

మోతాదు:

మదర్ టించర్‌ని 10 రెట్లు నీళ్ళలో కాని, 4 రెట్లు కొబ్బరినూనె, గ్లిసరిన్ వేసిలైన్‌లో కలిపి ఉపయోగించవచ్చు. 200 పొటెన్సీ వాడవచ్చు.

కాల పరిమితి:

1-2 వారాలు ఉంటుంది

డయాథిసిస్:

వీరికి కేన్సర్ డయాథిసిస్.

మయాజమ్:

సోరా, సైకోసిస్, సిఫిలిస్ మయాజమ్స్ గల మందు.

కారణాలు:

ఆల్కహాలిజమ్, మెర్కురీ, సిఫిలిస్, గనేరియా వంటి సుఖవ్యాధులు – వ్యాధికారకాలుగా ఉంటాయి.

విరుగుడు:

మెర్క్‌సాల్ దీనికి విరుగుడు.

తత్వం:

వీరు క్షయతత్వ రోగులు.

మానసిక లక్షణాలు:

జ్ఞాపకశక్తి తగ్గడం వల్ల మతిమరుపుతో చదువుచున్నవి, మాట్లాడుచున్నవి జ్ఞాపకం లేకపోవుట జరుగుతుంది. డిప్రెషన్‌తో మనోవ్యథతో చనిపోవుట, నిశ్చయమని తలంచి చావును కోరుకోవడం జరుగుతుంది.

శారీరిక లక్షణాలు:

తల:

వీరి నడినెత్తి మీద, నరాలలో నొప్పిగా ఉంటుంది.

కండ్లు:

జలుబుతో కూడిన కండ్లకలక వల్ల నీళ్ళు కారడం, చిక్కని స్రావం వస్తుంది. వాపు వల్ల, కనురెప్పలు అంటుకోవడం వల్ల, చూపు సరిగా ఆనకపోవడం జరుగుతుంది.

చెవులు:

చెవుల్లో వింత వింత ధ్వనులు వినపడడం, దుర్వాసనతో కూడిన చిక్కని స్రావం రావడం వుంటుంది.

ముక్కు:

ముక్కు నుండి చిక్కని జిగురువంటి తెల్లని స్రావం వల్ల నుదుటిలో  నొప్పిగా  ఉంటుంది. నీళ్ళ వంటి స్రావం వల్ల తరచూ ముక్కు చీదవలసి వుంటుంది.

నోరు:

నోరు కారంగా ఉండి, నాలుక వాచి, తెల్లని పూత కల్గుతుంది. దీనికి మిరియపు రుచి ఉంటుంది. వీరి కొండనాలుక సాగి నొప్పిగా ఉంటుంది. గొంతు పుండై చిక్కని పసుపుపచ్చని రుచి ఉంటుంది. ముద్ద వంటి ఆమం వెడలుతుంది.

ఆకలి ఉండక ఆహారం సహించదు. వీరి కడుపులో తిన్న ఆహారం చాలాసేపటికి ఏమీలేనట్లు, కుంచించుకుపోయినట్లు, బరువుగా ఉంటుంది. రుచి చేదువల్ల కాయగూరలు, రొట్టె సహించకపోవడం, కడుపులో పుండు వల్ల, కేన్సర్ వల్ల పులి త్రేన్పులు, మంట, అజీర్ణంను నివారిస్తుంది.

కామెర్లు వల్ల కాలేయం మందంగా బాధగా ఉంటుంది. గాల్‌స్టోన్స్ వల్ల నొప్పి ఎడమ గజ్జల్లో నుండి కుడి వృషణంలోనికి వ్యాపించడం విశేషం. ఆల్కహాల్ తీసుకునేవారిలో కుడి లివర్ వాపు వల్ల కుడి వైపు డొక్కలో నొప్పితో పసుపుపచ్చని పుల్లగా వాంతులవుతాయి. చర్మం పచ్చగా ఉంటుంది. ఆపాన వాయువులు వెళ్లిన, ప్రెషర్‌వల్ల రిలీఫ్ ఉంటుంది. ఆసనంలో పుండ్ల వల్ల ముడుచుకొని పోయినట్లుండి దీర్ఘకాల మలబద్దకం ఉంటుంది. మొలల వల్ల ఆసనం బాధగా ఉండి ఒక్కసారి మలాశయం వెలుపలికి వస్తుంది. మలవిసర్జన సమయంలో, తర్వాత నొప్పి ఎక్కువ సేపు ఉంటుంది.

మూత్రం దుర్వాసనగా, ఎక్కువగా, అప్రయత్నంగా పోతుంది. మూత్రం అణిచిపెట్టడం వల్ల మూత్రంలో ఆమ్లం కలిసి, తీగ వలె పోతుంది.

జననేంద్రియ లక్షణాలు:

పురుషులలో గనేరియా వల్ల స్రావం తెల్లని లేదా పసుపు పచ్చని స్రావం చిక్కగా, తీగవలె వెడలుతుంది. శుక్లనష్టం వల్ల వచ్చే నీరసంని అరికడుతుంది.

స్త్రీలలో సంభోగేచ్ఛ అధికంగా ఉండి మంట, నొప్పి ఉంటుంది. స్తనాల్లో జననేంద్రియాల్లో వచ్చే కేన్సర్‌కిది మంచి మందు. దీనివల్ల చన్మొనలు ముడుచుకొనిపోవడం, గర్భసంచిలో పుండై, వెలుపలికి రావడం ఉంటుంది. బహిష్టు అయిన తర్వాత తెల్లమైల చిక్కగా, తెల్లగా, జిగురుగా, ఒక్కోసారి ముద్దగా పసుపు పచ్చగా వుండి దురదతో అవుతుంది. ముట్లుడుగు కాలంలో జననేంద్రియంలో దురద, తెల్లని స్రావమెక్కువగా పోతుంది. బాలింతల్లో నోటిపూత ఉండి, నాలుక పెద్దదై, పండ్ల ఆనవాలుతో ఉంటుంది. రజస్వల సమయంలో, గర్భిణీలో వచ్చే ఫిస్టులాకిది మంచి మందు.

ఎడమవైపు పడుకున్న ఊపిరాడకపోవడం, ఉదయాన గుండెదడ చాలా సేపుంటే తెలివి తప్పి పడిపోతారు.

నీరసంగా వుండే ముసలివారిలో వచ్చే బ్రాంకైటిస్‌లో కఫం ముద్దగా, పసుపు పచ్చగా పోవడం వల్ల నిస్త్రాణ ఉంటుంది. ఛాతీలో నొప్పి ఉండి బాధగా ఉంటుంది. ఛాతీలో గురగురలతో పొడి దగ్గు ఉండి, ఎడమవైపు పడుకున్న దగ్గు ఎక్కువవుతుంది.

నడుం క్రింది భాగం కొయ్యబారినట్లు, బరువుగా ఉండి, కూర్చున్న చోట నుండి లేచునపుడు, చేతుల్ని ఆసరా చేసికొంటారు. నడుచుట వల్ల నొప్ప్పులు ఉపశమిస్తాయి.

ఉదయం, సాయంకాలం నందు ఒకే సమయంలో చలి రావడం, శరీరం అప్ప్పుడప్ప్పుడు వెచ్చగా ఉంటుంది. నిస్త్రాణ కల్గించే జ్వరాలు, కామెర్లు, అజీర్ణ పైత్య జ్వరాల్లో అధిక చెమటలు పడతాయి.

మశూచికంలో వలె పొక్కులు రావడం, కేన్సర్ సంuంధమైన పుండ్లను మాన్పుటలో ఇది ఉపయోగకరమైనది. కేన్సర్ గడ్డలు గట్టిగా అంటుకొని చర్మం వివిధ రంగులలో ముడతలు పడి, నొప్ప్పులు చాకుతో కొయ్యునట్లు, తీవ్రంగా కొయ్యుచున్నట్లు ఉంటుంది. పుండ్లు గట్టిగా ఉండి, బాధ, చురుకు పోటువుంటుంది. చర్మం ముడతలు పడి తూట్లు పడతాయి. ఇలాంటివారికిది సూచించదగ్గ మందు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version