[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-72. శాంబూకస్ (Sambucus)
మధ్య యూరప్‌లో విస్తారంగా పెరిగే ఈ చెట్టు యొక్క మొక్క ఆకులు, పువ్వు నుండి మెడికేటెడ్ టీ, మదర్ టించర్‌ని తయారు చేస్తారు. ఆకులు బెరడు నుండి ఆయింట్‌మెంట్స్‌ని తయారు చేస్తారు. ఎల్డర్‌గా పిలవబడే ఈ వృక్షజాతికి చెందిన ఈ మొక్క ఆకుల్ని హోమియో ఔషధంగా మలచినవారు డా॥ హానిమన్.
స్థానాలు:
ఈ మందు శ్వాసావయవాలు, ఉబ్బులపై బాగా పని చేస్తుంది.
వ్యాధులు:
ఇది జీర్ణకోశ వ్యాధులకు ఉపయోగపడుతుంది.
ఉద్రేకం:
వీరికి నిద్ర వల్ల, విశ్రాంతి వల్ల, పండ్లు తినడం వల్ల వ్యాధి లక్షణాలు ఉద్రేకిస్తాయి.
ఉపశమనం:
వీరికి పడక మీద కూర్చున్నప్పుడు, కదలిక వల్ల ఉపశమనం ఉంటుంది. వీరు చలికి తట్టుకోలేరు.
మయాజమ్:
ఇది సోరా మయాజం గల మందు. వీరిది స్క్రోపులస్ డయాథిసిస్.
మోతాదు:
3-30 పొటెన్సీలో వాడవచ్చు
కాల పరిమితి:
3-4 వారాలు ఉంటుంది.
విరుగుళ్ళు:
ఆర్స్ ఆల్బ్స్, కేంఫర్‍లు దీనికి విరుగుళ్ళు.
మానసిక లక్షణాలు:
కండ్లు మూసుకున్నప్పుడు ప్రతిమలు కనపడడంతో భయంతో ఊపిరాడకపోవడం ఉంటుంది.
శారీరిక లక్షణాలు:
దగ్గుట వల్ల ముఖం ఎర్రబడి మంటగా ఉండి నీలిరంగుగా మారుతుంది.
పిల్లల్లో అర్ధరాత్రి ఊపిరి ఆడకుండా దగ్గు రావడం వల్ల ఏడుస్తారు. ముక్కుదిబ్బడ వల్ల పిల్లలు తల్లి పాలు త్రాగలేరు. ఊపిరాడక పోవటం వల్ల ఆకస్మికంగా లేచి కూర్చుంటారు.
నిద్రలో చర్మం వెచ్చగా ఉండి పొంగరించి ఉంటుంది.
జ్వరం వచ్చినపుడు కప్పుకున్న బట్ట తీసివేసినచో భయపడతాను. తెల్లవారి శరీరమంతటా విస్తారంగా చెమటలు పడతాయి. జ్వరం వచ్చుటకు ముందు బాధాకరంగా ఉండే పొడిదగ్గు వస్తుంది.
పర్సనాలిటీ:
దగ్గుట వల్ల ముఖం నీలి రంగుగా ఉండి ఎర్రబారి మంటగా ఉంటుంది.
పొక్కులతో ఉండే దౌడలు. ముఖం వెచ్చగా, చెమటతో ఉంటుంది.
పొత్తి కడుపు వికారంతో ఉబ్బరంగా ఉండే శూల, నీళ్ళ వలె ఆమంతో తరుచు విరేచనాలవుతాయి.
మూత్రం తరుచూ కొద్ది కొద్దిగా విస్తారంగా పోవడం వల్ల చర్మం ఆర్చుకుపోయి వెచ్చగా ఉంటుంది.
జ్వరం వచ్చే ముందు బాధగా ఉండే పొడిదగ్గు ఉంటుంది. పాదాలుబ్బి మంచు వలె తెల్లగా, చల్లగా ఉండి కాళ్ళు చేతులు నీలి రంగుగా ఉంటాయి. రాత్రిళ్ళు నిస్త్రాణ కల్గించే చెమటలు పడతాయి.
శరీరానికి నీరు పట్టి వాపులుంటాయి. నిద్రలో చర్మం వెచ్చగా ఉండి మెలకువ వచ్చేసరికి చెమటతో ఉంటుంది. ఇలాంటివారికిది సూచించదగ్గ మందు.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.
