[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-73. స్పైజీలియా (Spigelia)
పింక్ రూట్‌గా పిలవబడే వృక్షజాతికి చెందిన ఈ మొక్కని హోమియో మందుగా మలచిన వారు హానిమన్.
స్థానాలు:
ఈ మందు నరాలు, మెదడుపై ప్రభావం చూపుతుంది.
వ్యాధులు:
ఇది మైగ్రేన్, న్యూరాల్జియా వ్యాధులకు ఉపయోగపడుతుంది.
విరుగుళ్ళు:
కాంఫర్, ఆరంమెట్, పల్సటిల్లా, కాక్యులస్ మందులు దీనికి విరుగుళ్ళుగా పనిచేస్తాయి.
ఉద్రేకం:
వీరికి కదలిక, ధ్వని వల్ల, తాకుడు వల్ల, ఉదయం శరీరం కుడివైపున బాధలు ఉద్రేకం చెందుతాయి.
ఉపశమనం:
వీరికి సాయంకాలం, నడుచుట, మర్దనం వల్ల వ్యాధి లక్షణాలు ఉపశమిస్తాయి.
మోతాదు:
3-200 పొటెన్సీలో దీన్ని వాడవచ్చు.
కాలపరిమితి:
3-4 వారాలు ఉంటుంది.
మానసిక లక్షణాలు:
పరిశ్రమ యందు అయిష్టంగా ఉంటారు, వీరు విచారగ్రస్థంగా అస్థిమితంగా, ఆత్రుతగా ఉంటారు. ఆత్మహత్య చేసుకొనవలెననే భావంతో ఉంటారు.
శారీరిక లక్షణాలు:
తల :
తలకు బద్దీని చుట్టిపెట్టినట్ట్ బాధగా ఉంటుంది. తలత్రిప్పు, తల పైవైపు బ్రద్దలైపోయినట్లుండడం. నడినెత్తిన ముట్టుకొన్న ఎడల నొప్పి ఉంటుంది. టైమ్ ప్రకారం వచ్చెడి తలనొప్పులకిది మంచి మందు.
కండ్లు:
కంటి నరాలు లాగినట్లుండడం, కనుబొమలు కాక ఈక వలె పెద్దవిగా ఉంటాయి. కన్నీళ్ళు కారుతూనే ఉంటాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు కదలికల వల్ల చప్పుడు వల్ల ఉద్రేకిస్తాయి
కండ్ల చుట్టు ఎక్కువ బాధగా ఉంటుంది కనురెప్పలు వాచి బాధగా ఉండి పుండ్లు పడి కండ్లు చికిలించి చూడడం వుంటుంది.
చెవులు:
చెవులు దిబ్బడ వేసినట్లుండి, పోట్లుగా ఉండి, చీము కారుతుంది.
ముక్కు:
మాననటు వంటి రొంప దుర్వాసనగా ఉంటుంది.
దంతాలు:
సాయంకాలం, పొగత్రాగిన పిమ్మట, చన్నీటి వల్ల, చల్లని చలిగాలి వల్ల, భోజనానంతరం పంటి నొప్పి ఎక్కువవుతుంది.
ముఖం:
ముఖం పొంగరించి ముడుచుకొని ఉంటుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎడమవైపు బాధలు చీల్చుచున్నట్లు, పొడుచుచున్నట్లుండి, కండ్లలోకి క్రింది దౌడ ఎముకల లోనికి, పండ్లలోనికి వ్యాపిస్తుంది.
నాలుక బీటలు బారి పసుపు పచ్చని పూతతో ఉంటుంది.
కడుపు:
కడుపులో రాయి పెట్టినట్లు బరువుగా ఉండి సూదులచో గుచ్చినట్లు, కుట్టుచున్నట్లు నొప్పి ఉంటుంది.
బొడ్డు వద్ద కోయుచున్నట్లు బాధగా ఉంటుంది. ప్రేవులు ముడుచుకొని పోయినట్లు బాధగా ఉండి ఊపిరి తీయుట కష్టంగా ఆత్రుతగా ఉంటుంది.
కడుపులో పురుగులుండడం వల్ల, ఆసనం వద్ద దురదగా, పురుగులు ప్రాకినట్లుంటుంది.
పురుషులలో శృంగార సంబంధమైన ఆలోచనలతో లేపనం ఎక్కువగా ఉంటుంది.
ఊపిరి గట్టిగా పీల్చునప్పుడు ఛాతీలో నొప్పి ఎక్కువై, కుడి చేతిలోనికి వ్యాప్తిస్తుంది. ఛాతీకి నీరు పడుతుంది.
ఆతురతతో ఊపిరాడదు. నాడి కెరటంలా కొట్టుకుంటుంది.
గుండెదడ విపరీతంగా ఉండి ముందుకు వంగినా ఎక్కువవుతుంది. ఎక్కువ జ్వరం ఉండి శరీరంలో నొప్పులుంటాయి.
నడిచినా కాళ్ళు చేతులలో నొప్పులుంటాయి. చర్మం పాలిపోయి ముడతలు పడి పసుపు పచ్చగా ఉంటుంది.
భుజాలు కదిల్చినచో, చేతులకి బంకగా ఉండే చెమట పడుతుంది. వీరికి ఉదయానే నిద్ర వస్తుంది. ఇటువంటి వారికి సూచించదగ్గ మందు.
హోమియో మందులు-74. శానిక్యుల (Sanicula)
జలం నుండి ఉద్భవించిన లోహాలు గల నీరు (శానిక్యులా ఆక్వా) మినరల్ స్ప్రింగ్ వాటర్ (USA) నుండి, శానిక్యులా మారీలాండికా, బ్లాక్ స్నేక్ రూట్‌గా పిలవబడే మొక్క నుండి ఔషధ గుణాల్ని రాబట్టిన వారు J.G. Gundlach.
స్థానాలు:
ఈ మందు జననేంద్రియాలు, నరాలపై ప్రభావం చూపుతుంది.
వ్యాధులు:
ఇది జననేంద్రియ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు, స్త్రీల వ్యాధులకు ఉపయోగపడుతుంది.
కారణాలు:
చర్మ వ్యాధులు అణగారడం, బెణుకుల వల్ల కలిగే వ్యాధులకిది మంచి మందు.
పర్సనాలిటీ:
వీరు నీరసంతో ఎండిపోయినట్లు ఉంటారు.
మోతాదు:
3-200 పొటెన్సీలో వాడవచ్చు.
కాలపరిమితి:
2-3 వారాలు ఉంటుంది.
ఉద్రేకం:
వీరికి వేడి, అర్ధరాత్రి, గీరడం, మలవిసర్జన చేసేటప్పుడు వ్యాధి లక్షణాలు ఉద్రేకిస్తాయి.
ఉపశమనం:
వీరికి కదలిక వల్ల, తిన్న తర్వాత ఉపశమనం ఉంటుంది.
మయాజమ్:
ఇది సిఫిలిస్, సోరా మయాజం గల మందు.
శారీరిక లక్షణాలు:
వీరికి తల వెనుక భాగం లోను, మెడ మీద ఎక్కువ చెమటలు పడతాయి. తల త్రిప్పు ఉంటుంది.
నుదుటి నొప్పి వస్తుంది. తలపై, కనుబొమ్మలలో దళసరిగా ఉండే చుండ్రు ఉంటుంది.
వెలుతుర్ని ఏ మాత్రం చూడలేరు. కన్నుల నుండి పసుపు ఆకుపచ్చని స్రావం వస్తుంది.
చెవుల వెనుక పుండు పడి జిగురు వంటి స్రావం స్రవిస్తుంది.
ముఖంపై ఎర్రని పొక్కులు, మొటిమలుంటాయి. నోరు దుర్వాసనగా ఉండి నోటి పూత ఉంటుంది.
వీరికి దాహం వుండదు. గొంతు, నోరు పొడిగా ఉంటుంది. నాలుకపై తామర ఉంటుంది.
జీర్ణకోశం, కాలేయం పచ్చిపుండు వలె ఉండి నొక్కిన చాలా బాధగా ఉంటుంది.
మూత్రం ఆపుకోలేరు. మూత్రం తక్కువగా, ఎర్రగా ఉంటుంది. వృషణాలు ఎండిపోయి, దిగజారి, ముసలివారి వలె ఉంటాయి.
స్త్రీలలో తెల్లమైల పాలవలె పల్చగా స్రవిస్తుంది. గర్భకోశంలో కంతి వల్ల గర్భకోశం క్రిందికి దిగజారినట్లుంటుంది. గర్భిణీ స్త్రీలలో మూడవ నెలలోనే కాళ్ళు చేతులు ఉబ్బు ఉంటుంది.
ఇలాంటివారికిది సూచించదగ్గ మందు.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.
