[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-75. సెబడిల్లా (Sabadilla)
సెబడిల్ల వెరాట్రమ్ ఆఫిసినాలిస్, సెబాడిల్లా అని పిలవబడే వృక్షజాతికి చెందినది. దీని నుండి హానిమన్ ఔషధగుణాలు రాబట్టినాడు.
స్థానాలు:
ఈ మందుకి నరాలు, మెదడుపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
వ్యాధులు:
ఇది నరాలు, జననేంద్రియ వ్యాధులకు ఉపయోగపడుతుంది.
సహచరులు:
సెపియా దీనికి సహచరి.
విరుగుళ్ళు:
దీనికి పల్సటిల్లా, లైకోపోడియం, కోనియం, లేకసిస్‌లు విరుగుళ్ళు.
ఉద్రేకం:
వీరికి చల్లదనం, చల్లని పానీయాలు వల్ల, పౌర్ణమి నాడు వ్యాధి లక్షణాలు ఉద్రేకిస్తాయి.
ఉపశమనం:
వీరికి వెచ్చని ఆహార పానీయాలవల్ల, కప్పుకొనుట వల్ల ఉపశమనం ఉంటుంది.
కారణాలు:
వర్మ్స్, థింకింగ్, భయం, మెంటల్ ఎగ్జర్షన్. సోరా, సైకోసిస్ వల్ల వ్యాధులు కలుగుతాయి.
మోతాదు:
3-200 పొటెన్సీలో వాడవచ్చు.
కాలపరిమితి:
3-4 వారాలు ఉంటుంది.
మానసిక లక్షణాలు:
తనకు జబ్బుగా నున్నదనియు, అవయవాలు ముడుచుకునిపోయినట్టు, కడుపులో వాయువు చేరుట వల్ల ఉబ్బరించుటచే తను గర్భవతినైనాననియు, కేన్సర్ గడ్డ ఉన్నదని ఆలోచించేవారికిది మంచి మందు.
శారీరిక లక్షణాలు:
తల:
ఆలోచనల వల్ల తలనొప్పి, నిద్రలేమి వస్తాయి. కూర్చొని లేచినచో వికారంగా ఉంటుంది. తలనొప్పితో వస్తువులన్నియు తిరుగుచున్నట్లనిపిస్తాయి.
కండ్లు:
కనురెప్పలు ఎర్రగా, మంటగా ఉండి నీళ్ళు కారుతుంటాయి. కాంతితో ఉండే వస్తువుల్ని చూచుట వల్ల, దగ్గుట వల్ల, ఆవలింతల వల్ల, అవయవాల్లోని బాధల వల్ల కండ్లు నీరు కారడం వల్ల దృష్టి మాంద్యం వుంటుంది. బహిరంగమైన గాలిలో వ్యాయామం చేసినచో కళ్ళల్లో నీళ్ళు కారును.
చెవి:
చెవులలో గిలిగింతలు పెట్టినట్లుండి, చెవుడు వుంటుంది.
ముక్కు:
తుమ్ములుండి, తరుచూ ముక్కు నీళ్లు కారడం జరుగుతుంది.
ముఖం:
వైను త్రాగిన పిమ్మట నిప్పు వలె ఎర్రగా, వెచ్చగా ఉంటుంది.
గొంతు:
గొంతు ఆర్చుకొనిపోయి ఎడమవైపు నొప్పిగా ఉండి వెచ్చని ఆహార పానీయాల వల్ల రిలీఫ్ ఉంటుంది.
పండ్లు:
పండ్లు పుచ్చిపోయి, పంటిపోటు వల్ల వెచ్చని పదార్థాల్ని నోటిలో పెట్టుట కష్టంగా ఉంటుంది.
నోరు:
నోరు ఆర్చుకొనిపోయి దాహం లేకపోవుట, తియ్యని లాలాజలం ఊరుతుంది.
తరచూ పొడిదగ్గు వస్తుంటుంది. వీరికి ఆయాసంతో కూడిన శూల ఉంటుంది. పడుకున్న వెంటనే దగ్గు ప్రారంభమై ఛాతీలో పొడుచుచున్నట్లు బాధ, స్రావం వుంటుంది. వెచ్చని పదార్థాలని తినాలని ఉంటుంది. తియ్యని ఆహార పదార్థలు తినడం వల్ల దగ్గు ఎక్కువ అవుతుంది.
కడుపులో ఏలిక పాములు, నులి పురుగులు వల్ల ఆసనం, చెవి, ముక్కు వంటి ఇతర అవయవాలలో దురదగా ఉండి గోకిన పిమ్మట మంటగా ఉంటుంది.
మూత్రం తక్కువగా, చిక్కగా అవుతుంది. సాయంకాలం తీపుతో, బాధతో అధికమైన మూత్రానుమానంతో వుంటుంది.
స్త్రీలలో అధికమైన సంభోగేచ్ఛ. బహిష్టులు ఆలస్యంగా, స్రావమెక్కువగా అవుతుంది. పురుషులలో సంభోగేచ్ఛ తక్కువగా ఉంటుంది.
నడుంలో ఎడమవైపు కుట్టుచున్నట్లుండే బాధలుంటాయి. కాలి బొటన వ్రేలి గోరు కింద వాపు ఉండి, బాధగా ఉంటుంది. చేతులు కంపించి రాత్రి యందు పిక్కల్లో బాగా చీల్చుచున్నట్లు, లాగుచున్నట్లు బాధగా ఉంటుంది. పాదాలు బరువుగా ఉంటాయి.
చర్మం కాగితం వలె ఆర్చుకుపోయి ఎర్రని చారికలు, మచ్చలు, చుక్కలు చలిగాలి వీచునపుడు ఏర్పడడం విశేషం.
జ్వరం వచ్చినప్పుడు ఎక్కువ చలిగా ఉండి దాహం ఉండదు. ముఖం, తల వెచ్చగా ఉండి, కాళ్ళూ చేతులు చల్లగా ఉండి చలితో ఉంటాయి.
పగలు నిద్ర పోవలయునని ఆవలింతలుంటాయి. నిద్ర మత్తు వల్ల అవయవాలు చాచుచు నిద్రపట్టదు.
ఎక్కువ ఆలోచనల వల్ల, ఆతురతతో కూడిన కలల వల్ల నిద్ర పట్టనివారికిది మంచి మందు.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.
