Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రకృతితో సంభాషణ

[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘ప్రకృతితో సంభాషణ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ప్రవాహానికీ ఓ భాషుంది
వినగలిగితే

పర్వతాలకీ ఓ భాషుంది
చూడగలిగితే

దట్టమైన అడవికీ ఓ భాషుంది
స్పందించగలిగితే

భాషంటే
కొన్ని పదాల సమూహమూ
మాటల ధ్వనీ మాత్రమే కాదు
వాటి నడుమ మౌనమూ వుంటుంది

నువ్వైనా నేనైనా
మౌనాన్ని వినాలి
నిశ్శబ్దాన్ని తెలుసుకోవాలి

ప్రకృతితో సంభాషించాలి
ప్రేమతో పలవరించాలి

Exit mobile version