Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రయాణం

[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘ప్రయాణం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

సమయం సరిపోలేదు
పనులు పూర్తికాలేదు
త్వరగా ముగించుకొని
కాలంతో పరుగెత్తాలి
దిగులుతో కూర్చుంటే
సాధించేది ఏమీ లేదు

ఆగనంటుంది కాలం
వేకువతో మొదలుకొని
చీకటితో ముగుస్తుంది
ఓపికతో భరించిన
తేలని వ్యవహారాలు
తేల్చుకోలేని లెక్కలు

నా వైపే చూస్తున్నారు
నన్నే గమనిస్తున్నారు.
బాధ్యత గల పనులే
మోయలేని బరువులే
ఎక్కువ దూరమైంది
రెట్టింపు భారమైంది

పోవడానికి తొందర
రావడానికి ఆదుర్దా
రహదారులు రక్తసిక్తం
రాకపోకలు అస్తవ్యస్తం
ప్రయాణమంటే భయమని
విరమించుకోకు నయమని

Exit mobile version