[శ్రీ రేడియమ్ రచించిన ‘ప్రేమ ద్విపదలు’ అనే కవితని అందిస్తున్నాము.]
మనసు తోటన చెలి
మల్లెల తీరు
తాపపు తీగలు
తనువుపై పారు
విరితోట వలపుల
విరహపు బాట
సిరివెన్నెల కురిసె
జిగెలుగా తోట
మనసు వికలమైన
మల్లెల మరపు
తనువు లోలోపల
తాపపు తలపు
శిలలు కరిగితేను
చిత్రమే మనకు
శిలలు తలను వంచు
శిల్పి చేతలకు
ప్రియుడు శిల్పి మరియు
ప్రియురాలు శిలయె
ప్రియ కరిగెను ఉలి
ప్రేమకు సరియె
