Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రేమ పరుగు

[శ్రీ కయ్యూరు బాలసుబ్రమణ్యం రచించిన ‘ప్రేమ పరుగు’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]

నీ మధుర అదరాల దరహాసము
నా మదిలో గిలిగింతలు పెడుతుంటే
నీ కలువ నయనాల చిలిపి చూపులు
నా ఎదను చక్కిలిగింతలు పెడుతుంటే
నీ గులాబీల చక్కని చెక్కిళ్ళ చక్కెరకేళీలు
నా హృదయాన పులకింతలు పెడుతుంటే
నీ మత్తెక్కించే మకరంద మల్లెల వాలుజడ
నా తీపి కలలో కలవరింతలు పెడుతుంటే
నీ విరహాగ్ని నుండి వచ్చె వెచ్చని శ్వాస
నా గుండెల్లో ప్రణయ ప్రళయాలు రేపుతుంటే
నిలువ లేని నా మనసు కళ్ళెం లేని అశ్వంలా
నీ ప్రేమకై పరుగులు తీస్తోంది ప్రియా..!

Exit mobile version