Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రేమ – ప్రతి దినము

[వాణి వేమవరపు గారు రచించిన ‘ప్రేమ – ప్రతి దినము’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

ది ప్రేమ దినమని ఎరుగవు నీవయినా,
రాధాకృష్ణుల ప్రేమ ఘనమైనది సృష్టినందున,
సీతారాముల ప్రేమ ఎంచ తగునా ఎవరైనా,
నవ మాసాలు మోసిన ఆ తల్లి కెంత ప్రేమ బిడ్డ మీద ,
చిటికెన వేలెట్టుకొని ప్రపంచాన్ని చూపు
తండ్రి ప్రేమను కొలువగలమా,
గురు శిష్యుల ప్రేమ దారి చూపును గాదే,
జగతిని గూర్చిన భగవంతుని కన్నా
ఏది పెద్ద ప్రేమని కొలమానము లేదు.
ప్రకృతి అంతయూ ప్రేమయే అణువణువునా,
నీవు ఇచ్చిన ప్రేమను పుచ్చుకుందువు ఇలలోన,
ప్రేమకి ఓ దినమని నిలుపవలదు,
జీవి పుట్టు నుంచి కడవరకు ఎదురుచూపులే కాదా ఆ ప్రేమ కొరకు.

Exit mobile version