Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రేమ

[శ్రీ వీరేశ్వర రావు మూల రచించిన ‘ప్రేమ’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

సప్తపది కోసమే కలలు కన్నావు
కలల సాకారానికే అన్ని అగడ్తలూ దాటావు!
జ్వాలలను జఠరాగ్ని లో దాచి చంద్రికలను వెదచల్లావు!
పేగు బంధం కన్నా పోగు బంధమే గట్టిదని ఋజువు చేసావు.
నీ కోసం
రాజ్యాలు విడిచి రానా!
స్వర్గాలు నడిచి రానా!
***
ప్రేమ ఆయువు పెంచే వాయువు
ప్రేమంటే అదిరిపడే వాళ్ళు కాకూడదు రాహువు
ప్రేమను నటించే వాళ్ళు గోమాయువు
ప్రేమను ఆదరించే వాళ్ళు కాకూడదు జటాయువు!
ప్రేమంటే ఏమిటంటే
రెండు ఆశల సంగమ శ్వాస అని
రెండు బాసల పూలబాట అని
లిపిలేని కంటి భాష అని
గుండెలో దాచుకున్న మంజూష అని
ప్రేమ పెదవి దాటనప్పుడు
నయనాలు ప్రణయ కవనాలని,
నీ సన్నిధిలో తెలుస్తుంది
నీ ప్రేమే నాకు నిధి గా నిలుస్తుంది!
మన ప్రేమే ముందు తరాలకి వారధిగా వెలుస్తుంది!

Exit mobile version