[సౌనిధి గారు రచించిన ‘ప్రేమావతారం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
ధరించావు ప్రేమావతారం..
సంధించావు వలపుల శరం..
రేపావు నాలో కలవరం..
చేసావు వేసవిని శిశిరం..
మలిచావు అవనిని స్వర్గం..
చెరిపావు మనసుల అంతరం..
దించావు ఎద భారం..
అయినావు.. ఈ చెలికి నీవో వరం.
