Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రేమకు ఇరుసును

[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘ప్రేమకు ఇరుసును’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

నీవు నిన్నలో
నేను నేటితో
ఎంత దూరం
మరెంత భారం
నీవు తూరుపువైతే
నేను పడమరను
నీ ఉదయాలు
చూడలేని పుడమిని
నీ ఎదలోతులను
కాంచని లేమిని
నీవు బొమ్మవైతే
నేను బొరుసును
కానీ నీ ప్రేమచక్రానికి
ఇరుసును నేను
అసలైన మనసును నేను

Exit mobile version