
శ్రీమతి సురేఖ పులి గారు రచించిన ‘ప్రేమే మా బలం’ అనే నవలని కొత్త ధారావాహికగా అందిస్తున్నాము.
ఒక సగటు మనిషి నిజ జీవితంలో విభిన్న పాత్రలు పోషిస్తూ, చదివిన చదువుకు సరిపోయే ఉద్యోగం లేకున్నా నిజాయితీతో ఒద్దికగా జీవన పయనం సాగించిన వైనం ఈ నవలలో రచయిత్రి వివరిస్తారు.
సంతోషం, బాధ జీవితంలో సమాంతర రేఖలు! ఈ రెండింటి మధ్యలో ‘ప్రేమ’ ఒక వారధి! ప్రేమ బలంగా ఉంటే జీవితంలో ఒడిదుడుకులు బలహీనంగా కనబడతాయి. మన అవాంతరాలను అధిగమించి ‘శక్తిగా’ మలచుకుంటే సాధికారతకు బాట అంటారు రచయిత్రి ఈ నవలలో.
‘కాంచన కరచాలనం’ పేరిట ఉద్యోగుల ఉదరం ఊగిసలాటకు ఒక పరిష్కారం కావలంటారు.
అనారోగ్యానికి భాష, జాతి, మత, ప్రాంత, లింగ వర్గ భేదాలు లేవు. ఏదో రకంగా ఏవో అనారోగ్య సమస్యలు సహజం. వీటికి తలవంచక తప్పదని తెలిసినప్పుడు మనస్పర్థలు, పరస్పర ద్వేషాలు, మోసాలు, పగలు, హత్యలు ఎందుకు? ఆలోచన విధానం చైతన్యవంతం కావాలి! ఆరోగ్యంగా ఆలోచించి సత్ప్రవర్తన కలిగి ఉండాలి. అప్పుడే జీవితం ఫలవంతమవుతుందని ఈ నవల చెబుతుంది.
***
ఆసక్తిగా సాగే ధారావాహిక
చదవండి.. చదివించండి..
‘ప్రేమే మా బలం’
