[శ్రీ వంగల సంతోష్ రచించిన ‘ప్రియమైన పెంగ్విన్..!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ప్రియమైన పెంగ్విన్
నీవు ఒంటరివి కాదు
నీ నడక
నీ ఆలోచనల దాటి
ఇప్పటి సమాజానికి
ఓ సందేశాత్మకంగా ఉన్నది
నా ప్రియమైన పెంగ్విన్
నీవు ఈ అస్తవ్యస్థ వ్యవస్థకు
ఓ మార్గాన్ని చూపే
మానవత్వపు శిఖరానివి..
నీవు వెనక్కి తిరిగి చూసిన
ఆ చూపే చెపుతుంది..!
ప్రియమైన పెంగ్విన్
నువ్వు ఎందుకలా
ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళావు
ఎవరు నీకు ద్రోహం చేశారని..?
నీ బంధువులు కాదన్నారా..?
నీ స్నేహితులు
నీతో ముచ్చటించడం లేదా..?
లేకా
నీ ప్రేయసి
నిన్ను ప్రేమించడం లేదా..?
ఏమైంది పెంగ్విన్
నీవు ఒంటరివి కాదు
నీకు మేము ఉన్నాము..!
నా ప్రియమైన పెంగ్విన్
నువ్వు కొంత దూరం నడిచి
తిరిగి చూసిన నీ చూపుల అర్థం
ఈ లోకపు పోకడల నడుమ
ఎందరి జీవితాలు
నీలాగా ఒంటరివి అయ్యి
అదృశ్యం అయినా వాళ్ళు ఎందరో..!
ఇప్పుడు నువ్వు కూడా
అదే దారిని ఎంచుకున్నావా
నా ప్రియమైన పెంగ్విన్..!
నువ్వు ఎప్పడు ఒంటరివి కాదు
నువ్వు ఒక సందేశాన్ని ఇచ్చి వెళ్ళావు
నా ప్రియమైన పెంగ్విన్
నీకు నేను స్నేహాన్ని అందిస్తాను
తిరిగి రా పెంగ్విన్
మనం ఈ లోకాన్ని చుట్టివద్దాం
మనుషులతో ముచ్చటిద్దాం
వస్తావు కదా
నా ప్రియమైన పెంగ్విన్..!
