సంచికలో తాజాగా

My Profile

Close
Profile Details
విశ్వర్షి వాసిలి

'విశ్వర్షి వాసిలి' పూర్తి పేరు వాసిలి వసంతకుమార్. పుట్టింది 1956 జులై 10 న. మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఏ. పట్టా పొంది ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్.డి. అందుకున్నారు. వీరు ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ పత్రికలకు తమ వీక్లీ కాలమ్స్ ద్వారా గత పదిహేను సంవత్సరాలుగా చిరపరిచితులు. వీరి "నేను" అనే యోగిక కావ్యం తెలుగులో తొలి యోగిక కావ్యంగా పరిశోధకుల, విమర్శకుల మన్ననలు పొందింది. వీరి రచనలు 77 సాధనారహస్యాలు, 56 ఆత్మదర్శనాలు, కొత్తకోణంలో గీతారహస్యాలు, ప్రజ్ఞానరహస్యాలు, అతీంద్రియరహస్యాలు : బ్లవట్స్కీ మొదలైన తాత్విక యోగ గ్రంథాలు అనేకముద్రణలు పొంది బహుప్రసిద్దాలు. ఇవికాక వ్యక్తిత్వవికాస పుస్తకాలైన విన్నర్ : గెలవాలి గెలిపించాలి, సిగ్గుపడితే సక్సెస్ రాదు, టైం ఫర్ సక్సెస్, ఒత్తిడి ఇక లేనట్లే, లైఫ్ ఈజ్ ఎమోషనల్ : అయినా గెలవాల్సిందే, పెళ్లి : ఒక బ్రతుకు పుస్తకం, మనసును గెలవాలి, మనకే తెలియని మన రహస్యాలు మొదలైనవి. ప్రస్తుతం సికింద్రాబాద్ లో యోగాలయ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. వీరిని 93 93 93 39 46 సెల్ నెంబర్ పైన సంప్రదించవచ్చు.

Social Profiles
Account Details

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!