వల్లూరు లీలావతి తన 19 ఏళ్ల వయసు నుండే బోధన రంగంలో ఉన్నారు. పిల్లలతో, విద్యార్థులతో ఆమెకున్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. తెలుగు, హిందీ, సంస్కృత భాషల్లో ఎమ్మే పట్టాలు పొందారు. వీటితో పాటు సోషల్, ఇంగ్లీష్ కూడా బోధిస్తారు. హై స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులకు భాషను దగ్గర చేయటంలో, వ్యాకరణ అంశాలను హృదయానికి హత్తుకునేలా బోధించటంలో ఆమె దిట్ట. తెలుగు సామెతలు అనే పుస్తకం రాశారు. రేడియోలో హిందీ పాఠాలు చెబుతారు. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో వ్యాసాలు, కవితలే కాకుండా పిల్లల కోసం చిట్టిపొట్టి కథలు, గేయాలు రాస్తారు. ఉమయవన్ రాసిన ‘పరక్కుమ్ యానై మరియు ఇతర కథలు’ పుస్తకాన్ని తెనిగించారు. ఈ అనువాదంతో లాక్ డౌన్ సమయాన్ని ఎంతగానో సద్వినియోగం చేసుకున్నానని భావిస్తారు. వారి అమ్మాయి మోహిత కౌండిన్య వర్ధమాన రచయిత్రి.
All rights reserved - Sanchika™