అయినంపూడి శ్రీలక్ష్మి గారు గత ముప్పై అయిదు సంవత్సరాలుగా సాహితీరంగానికి చిరపరిచితులే. ఆరు కవితా సంపుటులు వెలువరించారు. రస్కిన్ బాండ్ పిల్లల కథల్ని తెలుగులోకి అనువదించారు. ఖలీజ్ జీబ్రాన్ ‘శాండ్ అండ్ ఫోన్’ ని తెలుగీకరించారు. రెండు దీర్ఘకవితలు రాసారు. 52 వారాల పాటు ఆకాశవాణి నుండి ధారావాహికగా ప్రసారమై అశేష శ్రోతల్ని ఆకట్టుకున్న ‘కొత్త ప్రేమలేఖలు’ని ఈ మధ్యనే పుస్తకంగా ప్రచురించారు. కరోనాకి ఓ రిటర్న్ గిఫ్ట్ – అంటూ రాసిన ఓ కవిత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ప్రశంసలు కూడా పొందడం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం శ్రీలక్ష్మి గారు ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రంలో ఉద్ఘోషకురాలిగా పనిచేస్తున్నారు.
All rights reserved - Sanchika™