Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పునరంకితం

[శ్రీ కయ్యూరు బాలసుబ్రమణ్యం రచించిన ‘పునరంకితం’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]

ప్రియా..!
నీ కురులలో
కుసుమం కానా
నీ నుదుటన
కస్తూరి తిలకం కానా
నీ కనులలో
కనుపాపను కానా
నీ పెదవులపై
చిరునవ్వును కానా
నీ బుగ్గలపై
సిగ్గుల మొగ్గను కానా
నీ చుబుకంపై
పుట్టుమచ్చ కానా
నీ ముక్కుకు
వజ్రపు ముక్కెర కానా
నీ చెవులకు
పసిడి లోలాకు కానా
నీ ప్రేమకు
నిత్యం పునరంకితం కానా

Exit mobile version