[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]
భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.
అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.
~
ప్రశ్నలు:
- సముద్రానికి వారధి కట్టాలని నిర్ణయించుకుని, దాని కన్నా ముందు ఒక శివాలయాన్ని నిర్మించాలనుకుంటాడు శ్రీరాముడు. ఆ ఆలయం ఏది?
- వామన పురాణం ప్రకారం ‘సరస్వతి’ నదీ తీరంలో బ్రహ్మ స్థాపించిన శివలింగం ఇది. ఒక కన్య పట్ల కామ భావాన్ని ప్రదర్శించినందుకు బ్రహ్మ శిరస్సు ఒకటి పగిలిపోతుంది. అప్పుడు స్థాణు తీర్థానికి వెళ్ళి లింగ ప్రతిష్ఠాపన చేస్తాడు. ఆ శివలింగం పేరు?
- అగ్నిపురాణం ప్రకారం భారతదేశాన్ని చాలా కాలం పాలించిన రాజవంశం ఇది. పురూరవ, నహుష, యయాతుల వంటి వారి వంశం ఇది. దీని పేరేమిటి?
- ఇతనికి శివపార్వతులు దర్శనమీయగా, పార్వతీదేవి సౌందర్యాన్ని వర్ణిస్తాడు. దేవి కోపించి ఇతడి కన్ను పగిలేట్టు చేస్తుంది. శివుడామెకు నచ్చజెప్పి, దృష్టి చెడకుండా ఇతనికి వరమిస్తాడు. ఎవరు ఇతను?
- మహాభారతం ప్రకారం, బ్రహ్మ సుబ్రహణ్యేశ్వరునికి లోహితాక్షుడు, ఘంటాకర్ణుడు, కుముదమాలితో పాటు ఇచ్చిన నాల్గవ అనుచరుడెవరు?
- దేవీ భాగవతాన్ని అనుసరించి, భూమి క్రింద నున్న ఏడు లోకాలలో చివరిది, నాగుల నివసించే లోకం ఏది?
- ఆనంద రామాయణం ప్రకారం, సీత శాపానికి గురై, తదుపరి జన్మలో మూడు వంకర్లతో ఉండే స్త్రీగా పుట్టిన అయోధ్యా వనిత ఎవరు?
- హిమాలయాలలోని ఏ పవిత్రక్షేత్రంలో నరనారాయణులు తపస్సు చేశారు?
- మార్కండేయ పురాణం ప్రకారం, నియతి, విధాతల కొడుకైన మృకండుడు, ఇతని భార్య మనస్విని కాగా, అల్పాయువైన కుమారుడి పేరి ఏమిటి?
- భారతం ప్రకారం కన్యకాంబగా వెలసిన పులోమ కూతురు ఎవరు?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 సెప్టెంబర్ 16వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-25 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 సెప్టెంబర్ 21వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పురాణ విజ్ఞాన ప్రహేళిక 23 జవాబులు:
1.అగస్త్యుడు 2. ఆది 3. ఇర 4. సూతుడు 5. కక్షసేనుడు 6. కర్ణికారుడు 7. కానీనులు 8. 18, 11 9. ప్రియ 10. భీముడు
పురాణ విజ్ఞాన ప్రహేళిక 23 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- పి.వి.రాజు, హైదరాబాదు
- రామలింగయ్య టి, తెనాలి
- శ్రేయా ఎస్. క్షీరసాగర్, బెంగుళూరు
- రామవరపు గిరిజాశంకర రావు, పూణే
- వనమాల రామలింగాచారి, యాదగిరిగుట్ట
- టి. రేవతి, సంతూరు (తమిళనాడు)
- ఆర్. బాలరాజు, ఉజ్జయిని
వీరికి అభినందనలు.
గమనిక:
- పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
- ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
