Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పురాణ విజ్ఞాన ప్రహేళిక-29

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.

అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.

~

ప్రశ్నలు:

  1. భాగవతం ప్రకారం ఇతనో గొప్ప శిల్పి. తమకు ఇతను నిర్మించి ఇచ్చినందుకు దేవతలు ఇతనికి ‘హేమ’ను భార్యగా ఇస్తారు. ఎవరితను?
  2. కాశీఖండం ప్రకారం, శుచిష్మంతుడనే పేరున్న అష్టదిక్పాలకులలో ఒకరు ఎవరు?
  3. విచిత్ర రామాయణం ప్రకారం, దశరథుని కూతురుని ఋష్యశృంగుడికిచ్చి వివాహం చేస్తారు. ఆమె పేరేమిటి?
  4. మత్స్యపురాణం ప్రకారం వసుదేవుని ఏడుగురు భార్యలలో ఒకతె, దేవుకుడి కూతురైన ఆమె పేరు ఏమిటి?
  5. పద్మపురాణం ప్రకారం, గుర్రాన్ని దొంగిలించినందుకు మాండవు మహర్షిని శిక్షించిన రాజు పేరేమిటి?
  6. శివుడు బ్రహ్మ తలను నాలుగవ వేలితో నరికాడు. కాబట్టి అది అపవిత్రం అయింది. యజ్ఞయాగాదులలో, కర్మకాండలలో పవిత్రం పెట్టే ఆ వేలిని ఏమంటారు?
  7. పాతాళానికి కుంగిన భూమిని కశ్యపుడు తన ఊరువులతో పైకెత్తిన కారణంగా, భూమికి వచ్చిన పేరేమిటి?
  8. ముండకోపనిషత్తు ప్రకారం, ఇది – ‘అ’, ‘ఉ’, ‘మ’ ల సంగమం. ‘అ’ విష్ణువుకు, ‘ఉ’ శివునకు, ‘మ’ బ్రహ్మకు చిహ్నమైన ప్రణవాన్ని ఏమంటారు?
  9. కథాసరిత్సాగరం ప్రకారం, బ్రహ్మదేవుడి మానసపుత్రుడైన కామదేవుని పేరేమిటి?
  10. అగ్నిపురాణం ప్రకారం, దేవతలలో ఒక తెగ వారు, పులస్త్యుడి కొడుకులు, నరశరీరం, అశ్వముఖం గలవారినేమని పిలుస్తారు?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 అక్టోబర్ 14తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-29 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 అక్టోబర్ 19వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పురాణ విజ్ఞాన ప్రహేళిక 27 జవాబులు:

1.చిరుతొండడు 2. భోజుడు 3. మహానంది 4. ముర 5. మేదిని 6. శంకరుడు 7. సత్యసేనుడు 8. సుఘోషం 9. హంసుడు 10. పంచవటి

పురాణ విజ్ఞాన ప్రహేళిక 27 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
  2. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  3. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version