Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పురాణ విజ్ఞాన ప్రహేళిక-30

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.

అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.

~

ప్రశ్నలు:

  1. ప్రజలు నీతిమంతులుగా ఉండే కృతయుగానికి గల మరో పేరు?
  2. మార్కండేయ పురాణం ప్రకారం – పార్వతీదేవి అంశను పుట్టిన ‘కౌశిక’ సౌందర్యం గురించి శుంభ, నిశుంభలకు చెప్పి, దేవి చేతిలో మరణించిన రాక్షస సోదరులు ఎవరు?
  3. భారతం ప్రకారం సింధు దేశపు రాజైన సైంధవుని అసలు పేరేమిటి?
  4. భారతం ప్రకారం, ఈమె చంద్రుడి రెండవ కుమార్తె. ఈమెను సూర్యుడు వివాహం చేసుకున్నాడు. ఈమె పేరు?
  5. పద్మపురాణం ప్రకారం, ప్లక్ష ద్వీపానికి రాజైన దివోదాసుని కూతురికి 21సార్లు వివాహం చేయగా, భర్తలందరూ మరణిస్తారు. ఆమె ఎవరు?
  6. నారదుడు చెప్పిన మాటలు విని కుంభకుడి కుమార్తె అయిన ఓ గోపిక శ్రీకృష్ణుడిని ప్రేమిస్తుంది. ఆమె ఇంట్లో ఎవరికీ వశం కాకుండా ఉన్న వృషభాలను కృష్ణుడు బంధించి ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆమె పేరు?
  7. స్కాంద పురాణం ప్రకారం, తపస్సు చేసుకోవడానికి స్థలం ఇవ్వమని బ్రాహ్మణులు బ్రహ్మను కోరగా, ఆయన చేతి లోని దర్భలతో చేసిన రథాన్ని విసిరి, అది ఎక్కడ పడితే, అక్కడ తపస్సు చేసుకోమని చెప్తాడు. ఆ ప్రాంతమేది?
  8. బ్రహ్మాండ పురాణం ప్రకారం కాలనేమి కొడుకు పేరేమిటి?
  9. ఏ ముని శాపం వలన శ్రీమహా విష్ణువు, భూమిపై రామునిగా జన్మించాడు?
  10. ఉత్తర రామాయణం ప్రకారం, కుశధ్వజుడి కూతురైన ఈమె, భరతునికి భార్య అవుతుంది. ఈమె ఎవరు?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 అక్టోబర్ 21తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-30 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 అక్టోబర్ 26వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పురాణ విజ్ఞాన ప్రహేళిక 28 జవాబులు:

1.చాతుర్వర్ణం 2. ధుంధరుడు 3. పంచద్రావిడులు 4. ప్రియంవదుడు 5. భైరవుడు 6. మహేశుడు 7. మాయా శివుడు 8. మేరువు 9. రాక్షసుడు 10. విష్ణుశర్మ

పురాణ విజ్ఞాన ప్రహేళిక 28 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
  2. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  3. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version